Jagame Thanthiram Trailer Released: ధనుష్​ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది - Sakshi
Sakshi News home page

ధనుష్​ కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది

Published Tue, Jun 1 2021 11:25 AM | Last Updated on Tue, Jun 1 2021 12:08 PM

Dhanush karthik Subbaraj Jagame Thandiram Netflix Trailer Out - Sakshi

కోలీవుడ్ స్టార్​ హీరో ధనుష్ నటించిన కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘జగమే తందిరమ్’, (తెలుగులో ‘జగమే తంత్రం’)​​ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్​లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్​ను డైరెక్టర్​ కార్తీక్ ట్విట్టర్​లో ప్రకటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 18న హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో స్ట్రీమ్​ కానుంది.
 
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. కోర మీసాలతో మాస్ లుక్​లో, మరోవైపు స్టైయిల్​ కాస్టూమ్స్​తోనూ సూరాలి అనే పాత్రలో ధనుష్​​ కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్​ అందించిన పాటలు ఇదివరకే హిట్ కాగా, ట్రైలర్​తో బ్యాక్​గ్రౌండ్​ను ఆకట్టుకునేలా ఇచ్చాడు. ఓ తమిళ తంబి లండన్​లో గ్యాంగ్​స్టర్​గా ఎలా మారతాడు? అక్కడి మాఫియాను ఎలా ఆడుకుంటాడు? ఆ వెనుక ఉద్దేశం ఏంటనే? కాన్సెప్ట్​తో ఈ మూవీ తెరకెక్కింది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక కాగా, ధనుష్​కి ఇది 40వ సినిమా.


  
మలయాళ విలక్షణ నటుడు జోజూ జార్జ్​, సంచన నటరాజన్, కలైరసన్, రామచంద్రన్ దురైరాజా, సౌందరరాజా, చిన్న జయంత్, వడివక్కరసి తదితరులు ఇందులో నటిస్తుండగా, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ యాక్టర్​ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్రలో నటించాడు. పోయినేడాదే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కరోనాతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్య నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు గోల చేశాయి. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్​కే నిర్మాతలు మొగ్గుచూపారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను ఆకట్టుకోగా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా జగమే తందిరమ్​ను నిర్మించాయి. చదవండి: ధనుష్​గా క్రికెటర్​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement