
కాలాల మాదిరి హీరోయిన్లకు ఒక సీజన్ ఉంటుందనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో మాదిరే కోలీవుడ్‌లో కూడా ఇప్పుడు యువ హీరోయిన్ల సీజన్ నడుస్తోందనే చెప్పవచ్చు. ప్రేమలు చిత్రానికి ముందు మమితా బైజూ(Mamitha Baiju) చిన్న చిన్న పాత్రల్లోనే నటించింది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం ప్రేమలు చిత్రమే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినా, ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్‌కు జంటగా ఇరండు వానం చిత్రంలో నటిస్తోంది.

అదేవిధంగా డ్రాగన్ చిత్ర హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు సమాచారం. కాగా తాజాగా ధనుష్‌తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్ మమితా బైజూను వరించినట్లు తెలిసింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కుబేర చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్రను పోషించగా, రష్మిక మందన్నా నాయకిగా నటించారు.
ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీన్ని పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించినున్నారని, ఈ క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రాన్ని డా.ఐసరి గణేశ్ తన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకుడికి దీటుగా కథానాయకి పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు నటి మమితాబైజూను ఎంపిక చేసినట్లు ప్రచారం సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం
Comments
Please login to add a commentAdd a comment