ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌ | Karthik Subbaraj confirms next film with Dhanush | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

Published Sun, Jul 21 2019 3:46 AM | Last Updated on Sun, Jul 21 2019 4:49 AM

Karthik Subbaraj confirms next film with Dhanush - Sakshi

ధనుష్‌ హీరోగా ‘పిజ్జా, పేట’ చిత్రాల ఫేమ్‌ కార్తీ్తక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వై నాట్‌ స్టూడియో సంస్థ తెలిపింది. ఇందులో ఐశ్వర్యాలక్ష్మీ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ మొత్తాన్ని యూకేలో జరుపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement