
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం నటుడు వ్యాపారవేత్త విశాగన్‌తో సోమవారం ఘనంగా జరిగింది. మొదటి వివాహ రద్దు అనంతరం సౌందర్య ప్రేమించి పెద్దల సమ్మతితో విశాగన్‌ను వివాహం చేసుకుంది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగిన వివాహంలో రాష్ట్ర సీఎం పళణిసామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంతోపాటు పలువురు మంత్రులు చివిధ పార్టీల నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక రజనీకాంత్ ఇంటి వివాహం కావటంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు హాజరై అభినందనలు తెలిపారు.
రజనీకాంత్ స్నేహితుడు నటుడు మోహన్‌బాబు కుటుంబంతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగిన పెళ్లితంతులో సంగీత్, మెహింది అంటూ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)




