రజనీ అభిమానుల హంగామా | Rajinikanth fans first day first show hungama | Sakshi
Sakshi News home page

రజనీ అభిమానుల హంగామా

Published Thu, May 22 2014 11:01 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

రజనీ అభిమానుల హంగామా - Sakshi

రజనీ అభిమానుల హంగామా

చెన్నై : కోచ్చడయాన్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల హంగామా మొదలైంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసి న చిత్రం కోచ్చడయాన్. ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి సారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్.

రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆరు వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దీంతో రజనీ అభిమానుల హంగామా బుధవారం నుంచే మొదలైంది. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైదాపేటకు చెందిన రజనీ అభిమాన సంఘం నిర్వాహకుడు సైదై రవి, నందంబాక్కం షణ్ముగ పాండియన్‌ల ఆధ్వర్యంలో ఊరేగింపుగా గిండి నుంచి బయలుదేరి నెలై్ల, మదురై జిల్లాల్లో కోచ్చడయాన్ చిత్రం విజయం సాధించాలని పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement