Kochadaiiyaan
-
లింగాను పట్టుకున్న కొచ్చాడియన్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ వివాదానికి ముగింపు ఇలా పలికాడో లేదో అలా మరో వివాదం చుట్టుముట్టింది. ఎడి బ్యూరో కంపెనీ రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ తమను మోసం చేశారని ఆరోపిస్తోంది. కొచ్చాడియన్ విడుదలకు ఇబ్బందుల్లో ఉన్నపుడు తాము ఆదుకున్నామని సంస్థ అధినేత అభిర్ చంద్ నహార్ చెబుతున్నారు. లతా రజనీకాంత్ హామీ ఇచ్చిన మీదటనే కొచ్చాడియన్ నిర్మాణ సంస్థ మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్‌కు పదికోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చామంటున్నారు. అంతేకాదు కొచ్చాడియన్ సినిమా తమిళనాడు హక్కులను తనకు తెలియకుండా రెట్టింపు రేటుకు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. రజనీకాంత్ కల్పించుకొని తనకు న్యాయం చేయాలని నహర్ కోరుతున్నారు. అయితే మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ ముఖ్య అధికారి జయకుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. ఫైనాన్స్ చేసిన మొత్తంలో ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించామనీ, అభిర్ చంద్ అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నాడని.. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామనీ అన్నారు. పైగా వారికి సంబంధం లేని డిస్ట్రిబ్యూషన్ హక్కులను అడగడం విడ్డరంగా ఉందన్నారు. -
మళ్లీ ఆస్కార్ బరిలో ఏఆర్ రెహ్మాన్
లాస్ఏంజల్స్: రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన మూడు చిత్రాలు 87వ అస్కార్ అవార్డుల ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నామినేషన్లు సాధించాయి. మిలియన్ డాలర్ ఆర్మ్, ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడయాన్ చిత్రాలకుగానూ రెహ్మాన్‌కు నామినేషన్లు దక్కాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనియర్ చిత్రం ద్వారా ఆయనకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో మొత్తం 114 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ అవార్డుల తుది నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటిస్తారు. అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 22 జరుగుతుంది. ** -
బిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్కు కోచ్చడయూన్
కోచ్చడయాన్ చిత్రం బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్, రాణా, సేనాలుగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన ఆమె దర్శక నైపుణ్యానికి చిత్ర ప్రముఖులు అభినందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన తొలి తమిళ చిత్రం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు (తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబ్, బోజ్‌పురి)భాషల్లో నాలుగు వేల థియేటర్లలో 3డి, 2డి ఫార్మెట్లలో ఇటీవల విడుదలయిన కోచ్చడయూన్ విశేష ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా 3డి ఫార్మెట్లో చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కోచ్చడయాన్ చిత్రాన్ని యూఎస్ తొలి ప్రముఖ హాలీవుడ్ స్టూడియో స్పెషల్ ఎఫెక్ట్ నిపుణులు ఇది ఇండియాలో రూపొందిన చిత్రమా? అంటూ ఆశ్చర్యపోతున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. కోచ్చడయాన్ చిత్రం దక్షిణాదిలో మూడవ వారంలో కూడా 350 థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిత్రాన్ని ఈ నెలాఖరున బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించడానికి ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కోచ్చడయాన్ను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
కుమార్తెకు రజనీ అభినందనలు
తన కుమార్తె ప్రతిభను జనులు పొగుడుతుండగా, ఆ ఆనందానుభూతిని పొందుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దర్శకురాలు సౌందర్యను అభినందించా రు. కన్న తండ్రి సినిమాకు కుమార్తె దర్శకత్వం చేయడం అనేది అపూర్వమైన, అరుదైన విషయం. అది ఒక అద్భుత ప్రయోగంతో చిత్ర రూపకల్పన చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు అసాధారణ విషయాలను సుసాధ్యం చేశారు. రజనీకాంత్. ఆయన రెండవ కూతురు సౌందర్య. వీరి అద్భుత సృష్టి కోచ్చడయాన్. ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. విజయం అనేది అంత సులభంగా రాదు. దానికి నిరంతర కృషి, పట్టుదల, శ్రమ అవసరం. కోచ్చడయాన్ చిత్రం రూపకల్పన వెనుక ఇవన్నీ ఉన్నాయి. చిత్రం విడుదల తల్లి పురుటి నొప్పులతో సమానం అంటారు. కోచ్చడయాన్ చిత్రం విడుదలకు ముందు చాలా ప్రతి ఘటనలను ఎదుర్కొంది. ఎన్నో వదంతులకు గురైంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితిలో విడుదల తేదీ వాయిదా పడితే చిత్రంపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అలాంటి అవరోధోలను దాటి కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ టాక్‌ను రాబట్టుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్లలో కోచ్చడయాన్ ప్రశంసల పరంపర కొనసాగుతోంది. చిత్ర యూనిట్లో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. ఒక పక్క కోచ్చడయాన్ చిత్రానికి అభినందలు వెల్లువెత్తుతుంటే మరో రజనీకాంత్ ఈ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన తన కూతురు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను, చిత్ర కళాకారులను సాంకేతిక వర్గాన్ని ప్రంశంసించారు. వదంతులను తిప్పికొట్టింది వదంతులను తిప్పికొట్టి అలాంటివి ప్రచారం చేసిన వారికి కోచ్చడయాన్ విజయం సరైన బుద్ధి చెప్పిందని రజనీ అభిమానులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్చడయాన్ బొమ్మల చిత్రం అంటూ ఎద్దేవా చేసిన వారికి చిత్ర విజయమే సమాధా నం చెప్పిం దన్నారు. చెన్నై రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు రామదాస్, రవి, సూర్య తదితరులు విడుదల చేసిన ఈ ప్రకటనలో పేర్కొంటూ తమ తలైవర్ (నాయకుడు) నటించిన కోచ్చడయాన్ విజయం సాధించిందన్నారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు రజనీ కాంత్ అభిమాన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం పైరసీకి గురికాకుండా రజనీ అభిమానులంతా అప్రమత్తంగా ఉండి అలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రజనీ అభిమానుల హంగామా
చెన్నై : కోచ్చడయాన్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల హంగామా మొదలైంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసి న చిత్రం కోచ్చడయాన్. ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి సారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్. రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆరు వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దీంతో రజనీ అభిమానుల హంగామా బుధవారం నుంచే మొదలైంది. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైదాపేటకు చెందిన రజనీ అభిమాన సంఘం నిర్వాహకుడు సైదై రవి, నందంబాక్కం షణ్ముగ పాండియన్ల ఆధ్వర్యంలో ఊరేగింపుగా గిండి నుంచి బయలుదేరి నెలై్ల, మదురై జిల్లాల్లో కోచ్చడయాన్ చిత్రం విజయం సాధించాలని పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. -
‘హీరోపంటి’తో అదరగొడతా
‘హీరో పంటి’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న టైగర్ ష్రాఫ్ తన ఆరంగేట్రం అదిరిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తాను చేసిన కఠోర సాధనే హీరోగా నిలబెడతుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ నెల 23న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ‘హీరో పంటి’ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందన్నాడు. అదే రోజు తన తండ్రి జాకీ ష్రాఫ్ విలన్‌గా నటించిన కొచ్చడియాన్ సినిమా రిలీజ్ అవుతుండటం కూడా సంతోషంగా ఉందన్నాడు. ఇది తండ్రీకొడుకుల మధ్య పోటీ అని పేర్కొన్నాడు. ‘హీరో పంటి విజయవంతం కావడం కోసం హీరోగా చాలా శ్రమించా. ఈ మూవీని ప్రేక్షకులు స్వీకరిస్తారన్న నమ్మకం ఉంది’ అని చెబుతున్నాడు టైగర్ ష్రాఫ్. తొలిసారిగా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ష్రాఫ్ ఈ సినిమా విజయవంతమైనా కాకపోయినా తనదైన ముద్ర వేయగలుగుతానని ధీమాగా చెప్పాడు. ‘ఒకరోజు టైగర్ ష్రాఫ్ గురించి ట్విట్టర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేకమంది సామాజిక అనుసంధాన వేదికలో నా పేరుపై తమాషాగా కామెంట్లు రాయడం చూశా. వాటిని చదివి నవ్వుకున్నా’నని తెలిపాడు. ఇప్పుడే ఇలా చర్చల్లో ఉంటే ప్రేక్షకులపై కొంత ఇప్పటికే ప్రభావం చూపినట్టేనని అన్నాడు. పబ్లిసిటీ అనేది పబ్లిసిటీయే. అది చెడా, మంచా అన్నది పరిగణనలోకి తీసుకోవద్దు. మన గురించి ఎవరూ మాట్లాడకపోతేనే ఆందోళన చెందాలని అన్నాడు టైగర్ ష్రాఫ్. చూపుల కన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపాడు. ‘నేనేమిటనేదిో ప్రేక్షకులకు చూపాలనుకుంటున్నా. వారికి నచ్చిన తరహాలోనే నా పాత్ర ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటనను మార్చుకుంటా. నా ప్రతిభను నిరూపించుకుంటాన’ని తెలిపాడు. ‘హీరోపంటి’ సినిమా ప్రచారం కోసం వారణాసికి వచ్చిన టైగర్ ష్రాఫ్... ఢిల్లీ, పంజాబ్, నాగపూర్‌లకు కూడా వెళ్లనున్నాడు. -
కొచ్చడయాన్ వాయిదా ఎందుకు?
కొచ్చడయాన్ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణాలేమిటన్న ప్రశ్నకు పలు అంశాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కొచ్చడయాన్. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకునే హీరోయిన్గా నటించారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం పలు విశేషాల నెలవు అని పేర్కొనవచ్చు. ఈ చిత్రాన్ని అవతార్, టిన్టిన్ వంటి హాలీవుడ్ చిత్రాల తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో రూపొందించాలని దర్శకురాలు సౌందర్య భావించారు. టీవీలో వచ్చే కార్టూన్ చిత్రాల మాదిరిగా కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనుకున్నారు. అయితే ఆమె ఊహించినట్లుగా ఇదంతా అంత సులభంగా జరగలేదు. చిత్ర బడ్జెట్ తడిసి మోపెడవడంతో చిత్రానికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మోషన్ క్యాప్చరింగ్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోదారి లేకపోవడంతో అలానే చిత్రాన్ని పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితిలో మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు పాత బాకీ చెల్లించాల్సి ఉంది. అది సెటిల్ చేస్తేనే కొచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేస్తామని పట్టుపట్టారు. ఈ సమస్య చర్చల ద్వారా ఒక కొలిక్కి రావడంతో చిత్రాన్ని తొమ్మిదో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. అలాంటి పరిస్థితిలో అనూహ్యంగా కొచ్చడయాన్ చిత్ర విడుదలకు వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనికి కారణం నిర్మాతల రుణ సమస్య పరిష్కారం కాకపోవడమేనని కోలీవుడ్ టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని మే 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
'కొచ్చడయాన్' విడుదల 23కు వాయిదా
చెన్నై: రజనీకాంత్ సినిమా 'కొచ్చడయాన్' విడుదల రెండు వారాల పాటు వాయిదా పడింది. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాంకేతిక కారణాలతో సినిమా విడుదల వాయిదా వేసినట్టు నిర్మాతలు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈనెల 9న 'కొచ్చడయాన్' ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయతే చెన్నైలో ఇప్పటికే మల్టిప్లెక్స్ ధియేటర్లలో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఈ సినిమాను నిర్మించింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. భారత దేశంలో తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ కాప్చర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో ఈ చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆలయాలను దర్శించుకోవడంతోపాటు, భారీ కటౌట్లతో చైన్నైని హోరెత్తిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొచ్చడయాన్' విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకలను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికే మల్టిప్లెక్స్ లో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. -
చెన్నైలో కొచ్చడయాన్ ఫీవర్, 13 వేల టికెట్లు అమ్మకం!
చెన్నై: చెన్నై నగరానికి 'కొచ్చడయాన్' ఫీవర్ పట్టుకుంది. తమిళనాడులో ఈ చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆలయాలను దర్శించుకోవడంతోపాటు, భారీ కటౌట్లతో చైన్నైని హోరెత్తిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొచ్చడయాన్' విడుదలకు ముందు కార్యక్రమాలు పెళ్లి వేడుకలను తలపిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికే మల్టిప్లెక్స్ లో 13 వేల టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. భారత దేశంలో తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ మోషన్ కాప్చర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడులో మొత్తం 477 థియేటర్లలో విడుదలవుతుండగా, పది దేశాల్లో 6 వేల స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్దమవుతోంది. అమెరికాలో 185 స్క్రీన్లలో విడుదలవుతోంది అని చిత్ర నిర్వహకులు తెలిపారు. ఈ చిత్రాన్ని చూడటానికి రజనీకాంత్ అభిమానులు చెన్నై నుంచి పక్క గ్రామాలకు తరలివెళ్లినట్టు సమాచారం. ఇప్పటికే అభిమానులు తొలి ఆటను చూడటానికి టిక్కెట్లను కొనుగోలు చేసి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వారాంతానికి టికెట్లన్ని అమ్మకం జరిగాయని మల్టిప్లెక్స్ యాజమాన్యం తెలిపారు. దీపికా పదుకోనె, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, ఆది పినిశెట్టి, నాజర్, శోభన తదితరులు నటించిన ఈ చితం మే 9 తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రజనీకాంత్ ఒక్క ట్వీట్ ఇస్తే.. ఇక వంద ట్వీట్స్!
చెన్నై: ట్విటర్ లో ట్వీట్స్ తో హోరెత్తే అవకాశం కనిపిస్తొంది. ఎందుకంటే ఇక నుంచి రజనీకాంత్ ఇచ్చే ఒక్క ట్వీట్ వంద ట్వీట్స్ గా మారనున్నాయి. దానికి అభిమానులను రీట్వీట్ ఇస్తే ఇంకా ఆలోచించడానికి కష్టమే. ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విటర్ లో ఆరంగేట్రం చేశారు. తాజాగా రజనీకాంత్ @SuperStarRajini అనే పేరుతో ట్విటర్ లో అకౌంట్ తెరిచారు. ట్విటర్ లో అకౌంట్ తెరువాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే విషయాలను ట్విటర్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం అని రజనీ అన్నారు. అంతేకాకుండా నా అభిమానులతో తన ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి సులభంగా కూడా ఉంటుందని రజనీ తెలిపారు. రజనీకాంత్ నటించిన కొచ్చడయాన్ చిత్రం మే 9 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రానికి ఆయన కూతురు సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించారు. -
సినిమా రిలీజంటే ఇప్పటికీ ఆయనకు దడే!
రజనీకాంత్ సినిమా అనగానే కోట్లల్లో ఖర్చు, అందుకు కొన్ని పదుల రెట్లలో వసూళ్ళు వస్తాయని సినీ వర్గాలు భావిస్తాయి. బాక్సాఫీస్ బాద్షాగా పేరున్న రజనీకాంత్‌కు మాత్రం అందరి లానే తన కొత్త సినిమా విడుదలవుతోందంటే ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందోనని ఇప్పటికీ కాస్తంత ఆందోళన చెందుతుంటారట. సాక్షాత్తూ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఈ మాట చెప్పారు. చాలా ఏళ్ళ విరామం తరువాత మళ్ళీ తన సినిమా విడుదలవుతుండడంతో, ఈ సూపర్‌స్టార్ మానసిక స్థితి ఇప్పుడు అచ్చం అలానే ఉందట. దీర్ఘకాలం శ్రమించి, కొన్ని పదుల కోట్ల రూపాయల పెట్టుబడితో తయారైన ‘కోచ్చడయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో ఆమె ఈ మాట బయటపెట్టారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల మళ్ళీ వాయిదాపడిందంటూ వస్తున్న వార్తలను లత ఖండించారు. ‘‘అవన్నీ వట్టి గాలి వార్తలు. అంతా సాఫీగా సాగుతోంది. అనుకున్నట్టుగానే ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది’’ అని ఆమె చెప్పారు. ‘‘తాను నటించిన కొత్త సినిమా రిలీజవుతోందంటే, ఆయనకు ఇప్పటికీ గుండె దడే! ఆందోళన పడుతుంటారు, ఉద్విగ్నతకు లోనవుతుంటారు. ఇప్పటికీ సినీ రంగంలో తాను ఓ విద్యార్థిననే ఆయన భావిస్తారు’’ అని లత చెప్పుకొచ్చారు. 2011లో రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి పాలైన సందర్భాన్ని గుర్తు చేసినప్పుడు, ‘‘అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంటిల్లపాదీ అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. దాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ఇక్కడ ఎంతో మంది అభిమానులు, ఆత్మీయులు ఉన్నప్పటికీ, కేవలం ఏకాంతం కోసమే విదేశానికి వెళ్ళి, చికిత్స చేయించాం. ఇక్కడ ఇంతమంది దృష్టి మీద పడుతుండడంతో, పరిస్థితులను అదుపులో పెట్టడం తమ వల్ల కాదంటూ, సాక్షాత్తూ డాక్టర్లే చికిత్స కోసం మమ్మల్ని విదేశాలకు వెళ్ళమన్నారు. చికిత్స పూర్తయి వెనక్కి వచ్చాక కూడా, మిగిలిన సంగతులన్నీ పక్కనపెట్టి, ముందుగా అన్నీ కుదురుకొనేలా చూసుకోవాలనుకున్నాం. వాస్తవాన్ని అంగీకరిస్తూ, మళ్ళీ అంతా కొత్తగా ఆరంభించాలనుకున్నాం’’ అని రజనీకాంత్ సతీమణి వివరించారు. ‘‘దేవుడి దయ, అభిమానుల ప్రార్థనల వల్ల ఇప్పుడు ఆయన బాగున్నారు. మునుపటి కన్నా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు’’ అని వివరించారు. మునుపెన్నడూ చూడని అంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తూ, భారతీయ సినీసీమలో చరిత్రాత్మకంగా నిలిచే సినిమా ఇదని లత అభిప్రాయపడ్డారు. ‘‘అందుకే, ఈ సినిమాను ఆరు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నా, అదీ తక్కువే అనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు. ‘అవతార్’ తరహా సినిమాను అందులో కేవలం నాలుగో వంతైనా లేని పరిమిత బడ్జెట్లో, పరిమిత సమయంలో తీయడం ఓ పెద్ద సవాలుగా నిలిచిందని ఈ చిత్రంలో స్వయంగా పాట కూడా పాడిన లతా రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలోని ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే, మరొక్క వారం రోజులు ఆగాల్సిందే! -
రాజమౌళి.. నీ బాహుబలి షూటింగ్ చూడాలి: రజనీ
బాహుబలి షూటింగ్ చూడాలని ఉందని సూపర్ స్టార్ట్ రజనీకాంత్ అనుమతి కోరాడని దర్శకుడు రాజమౌళి ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాజమౌళి ట్విటర్ లో పేర్కొన్నారు. బాహుబలి సెట్ కు రావాలనుకుంటున్నాను. నీ షూటింగ్ చూడాలనుకుంటున్నాను అని రజనీ సార్ అన్నారు. నా జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనల్లో ఇది ఒకటి. థ్యాంక్యూ సర్ అని అని రాజమౌళి ట్విటర్ లో తెలిపారు. మే 9 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న రజనీకాంత్ ‘విక్రమసింహ’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి, రామానాయుడు, మోహన్ బాబు, రాజమౌళి, సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రంలో దీపిక పదుకొనే, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, నాజర్, శోభన తదితరులు నటించారు. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. One of my most memorable moments: Rajini sir leaned across and said "rajamouli, I want to come to sets of Baahubali and see your shooting" — rajamouli ss (@ssrajamouli) April 19, 2014 -
మే 9న వస్తున్న కొచ్చాడయాన్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కొచ్చాడయాన్' మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు నిర్ణయించారు. ఇక ఈ తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని రజనీకాంత్ మేనేజర్ తెలిపారు. భారతీయ సినిమాలోనే మొట్టమొదటి మోషన్ కాప్చర్ ఫొటో రియలిస్టిక్ 3డి యానిమేషన్ సినిమా కొచ్చాడయాన్కు రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రూ. 125 కోట్ల ఖర్చయింది. సినిమాలో దీపికా పడుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, శోభన, ఆది ప్రధానపాత్రల్లో నటించారు. రెండు ఆస్కార్ బహుమతులు అందుకున్న ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. -
కొచ్చాడయాన్ విడుదలయ్యేనా..?
-
అంతా ఆ దేవుడి లీల!
‘‘సౌందర్య చిన్నప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ పుస్తకాలు బాగా చదివేది. అలాంటి సినిమాలు తీస్తానని చెబుతుండేది. ఇప్పుడు అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ‘కొచ్చడయాన్’ రూపొందించింది. అందరూ తనను అభినందిస్తుంటే ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అన్నారు రజనీకాంత్. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చడయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రచార చిత్రాలను ముంబయ్‌లో అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ -‘‘రజనీకాంత్, నేనూ మంచి స్నేహితులం. ఎప్పుడు కలిసినా సినిమాల గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటాం. భారతీయ సినిమా చరిత్రను ఎవరైనా రాస్తే... ‘కొచ్చడయాన్’కి ముందు ‘కొచ్చడయాన్’కి తర్వాత అని రాస్తారు’’ అని చెప్పారు. రజనీకాంత్ మాట్లాడుతూ -‘‘ ‘రోబో’ సమయంలో ముంబై వచ్చాను. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడీ వేడుకలో పాల్గొన్నాను. ‘కొచ్చడయాన్’ సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. టెక్నాలజీ గురించి నాకస్సలు అవగాహన లేదు. కానీ, ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నానంటే, అంతా ఆ దేవుడి లీల. ఇలాంటి సినిమాలు ఓ సవాల్ . ఈ సవాల్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది’’ అని చెప్పారు. హలీవుడ్ చిత్రం ‘అవతార్’ స్థాయిలో ఫొటో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. తెలుగులో ఈ చిత్రం ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కానుంది. -
అమితాబ్ అతిధిగా 'కొచ్చడయాన్' ప్రత్యేక షో!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్' చిత్రంపై ముంబైలో ఆదివారం సాయంత్రం ఓ ప్రత్యేక షోను నిర్వహించనున్నారు. రజనీ సర్ నటించిన 'కొచ్చడయాన్'పై ప్రత్యేకమైన కర్టైన్ రైజర్ కార్యక్రమం ఉంది అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఈ చిత్రంలో రజనీ సరసన దీపికా పదుకొనె జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కొచ్చడయాన్ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. A special curtain raiser event of Rajinikanth Sir's #Kochadaiiyaan will be held this evening in Mumbai. Amitabh Bachchan is the chief guest. — taran adarsh (@taran_adarsh) March 30, 2014 -
రజనీ కోసం తిరుపతికి అభిమానుల పాదయాత్ర!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారనే సంగతి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఏప్రిల్ 11 తేదిన రజనీ నటించిన 'కొచ్చడయాన్' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అభిమానులు పాదయాత్ర చేపట్టారు. కొచ్చడయాన్ చిత్రం ఘన విజయం సాధించాలని ఏప్రిల్ 2 తేదిన వెల్లూరు నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నారు. నెల్లూరు కు చెందిన రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్ రవి పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది రజనీ ఫ్యాన్స్ ఏప్రిల్ 2 తేదిన పాదయాత్రగా తిరుపతి బయలు దేరుతున్నాం. రెండేళ్ల తర్వాత కొచ్చడయాన్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా రజనీకాంత్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాం అని రవి తెలిపారు. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేషన్ చిత్రంగా 'కొచ్చడయాన్'ను సౌందర్య రజనీకాంత్ రూపొందించారు. దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటించిన ఈ చిత్రం ఆరు భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. -
కోచ్చడయాన్ ఆడియో ఆవిష్కరణ
-
రజనీకాంత్ అభిమానిని: షారుక్
సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెద్ద ఫ్యాన్ ను అని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. రజనీకాంత్ చిత్రం కొచ్చడయాన్ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. ఓ మూడు కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. అందులో ఒకటి నేను రజనీకాంత్ అభిమానిని అని షారుక్ చెప్పారు. తాను చిత్రాల్లో ప్రవేశించడానికి ముందు రజనీ సార్ నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ ను దూరంగా ఉండి చూశాను. ఆ చిత్రంలోని నటిస్టున్న తారలందరూ వారివారి పనిలో మునిగిపోగా.. ఓ పెద్ద అద్దం ముందు రజనీకాంత్ సిగరెట్ ను ఎగురవేస్తూ నోటి ద్వారా అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారని షారుక్ అన్నారు. అప్పుడు రజనీకాంత్ అంకిత భావాన్ని చూసి.. ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే అని ఆయనను చూసి నేర్చుకున్నాను అని షారుక్ తెలిపారు. ఇక మూడవ కారణం ఆయనతో ఉన్న స్నేహం అని అన్నారు. రా.వన్ చిత్ర నిర్మాణ సమయంలో సౌందర్య, లతా మేడమ్, రజనీకాంత్ లు తనకు ఎంతో సహాయం చేశారని షారుక్ పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలోని రజనీ కాంత్ కు 'లుంగీ డాన్స్' పాటను అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద స్టార్ హోదా ఉన్న షారుక్.. రజనీకాంత్ అభిమానిని అని చెప్పడం తమిళ సినీ అభిమానులను సంతోషానికి గురి చేసింది. -
తెలుగులో పాట పాడిన లతా రజనీకాంత్!
తమిళంలో ‘కొచ్చడయాన్’గానూ, తెలుగులో ‘విక్రమసింహ’గానూ రూపొందుతోన్న రజనీకాంత్ తాజా చిత్రం కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘అవతార్’ తరహాలో త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతోన్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. ‘రోబో’ తర్వాత రజనీ చేస్తున్న సినిమా ఇదే. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య దర్శకురాలు కావడం ఒక విశేషం కాగా, రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ఇందులో ఒక పాట పాడడం మరో విశేషం. లతా రజనీకాంత్ సినిమా పాట పాడటం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇళయరాజా స్వరసారథ్యంలో ఓ తమిళ సినిమాకు పాడారు. ఆ తర్వాత మళ్లీ ఆమె పాడలేదు. ఈసారి మాత్రం తమిళ వెర్షన్‌తో పాటు, తెలుగు వెర్షన్‌కి కూడా ఆమె పాడటం విశేషం. అనంత శ్రీరామ్ రాసిన ‘ఏదేమైనా సఖా’ అనే పాటను లతా పాడారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలందించారు. ఈ నెల 9న తమిళంలోనూ, 10న తెలుగులోనూ పాటలు విడుదల కానున్నాయి. -
రజనీ ఫ్యాన్స్‌కు ‘కార్బన్’ కానుక
చెన్నై, సాక్షి ప్రతినిధి : సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులను అలరించేరీతిలో ప్రముఖ మొబైల్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ ‘కార్బన్’ కోచ్చడయాన్ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్లను శుక్రవారం తమిళనాడు మార్కెట్లోకి విడుదల చేసింది. కార్బన్ ఏ 36, కార్బన్ ఏ 6 ప్లస్ అనే 2 ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందించింది. అదే విధంగా ద లెజెండ్ 2.4, ద లెజెండ్ 2.8 అనే మరో రెండు ఫీచర్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లలో కోచ్చడయాన్ పాటలు, వీడియోలు, ట్రైలర్స్, వాల్ పేపర్లు ఉంటాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడుతూ తన చిత్రంతో ఈ తరహా సిగ్నేచర్ స్మార్ట్ మొబైల్స్‌ను రూపొందించినందుకు కార్బన్ మొబైల్స్ సంస్థకు అభినందనలు తెలిపారు. సంస్థ చైర్మన్ హసీజ్ మాట్లాడుతూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం వారు ఆరునెలలు కష్టపడి ఈ యూప్స్‌ను రూపొందించారని అన్నారు. మొబైల్ రంగంలో ఈ యూప్స్ కొత్త ఒరవడిని సృష్టించగలవని వివరించారు. -
ఏప్రిల్ 11న కొచ్చాడయాన్ విడుదల
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'కొచ్చాడయాన్' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో సరికొత్త ముందడుగని సౌందర్య అంటున్నారు. గత సంవత్సరం భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో, ఈసారి దాని తదుపరి ముందడుగుగా కొచ్చాడయాన్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మన దేశంలో పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీ ఆధారంగా తీసిన పూర్తిస్థాయి తొలి సినిమా ఇదేనని, ఇతర యాక్షన్ చిత్రాల కంటే ఇది చాలా విభిన్నంగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నానని సౌందర్య అన్నారు. కొచ్చాడయాన్ సినిమాలో చాలా విభిన్నమైన పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి ఉపయోగించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించారు. రజనీకాంత్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు దీపికా పడుకొనే, శరత్ కుమార్, నాజర్, ఆది, శోభన, రుక్మిణి తదితరులు నటిస్తున్నారు. ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ భాషల్లో విడుదల చేస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 6వేల థియేటర్లలో ఇది విడుదల కానుంది. అంతర్జాతీయంగా ఇంగ్లీషులోనూ విడుదల అవుతోందని ఇరోస్ ఎండీ సునీల్ లుల్లా తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కార్బన్ మొబైల్ సంస్థ ప్రత్యేకంగా ఈ చిత్రం బ్రాండుతో పది లక్షల మొబైల్ ఫోన్లు విడుదల చేస్తోంది. వీటిని ఆడియో లాంచ్ సందర్భంగా మార్కెట్లోకి తెస్తారు. ఇందులో సినిమాకు సంబంధించిన స్క్రీన్ సేవర్లు, కొన్ని స్టిల్స్, ట్రైలర్, సిగ్నేచర్ ట్యూన్ ఉంటాయి. -
'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొచ్చడయాన్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్నారు. భారత దేశంలోనే తొలిసారిగా ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజిని ఈ చిత్రం కోసం వాడుకుంటున్నారు. అయితే కొచ్చడయాన్ చిత్రంలో రజనీకాంత్ లుక్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా రూపొందించారు. ఆయుధాలు ధరించిన రజనీ లుక్ అభిమానులపై అత్యంత ప్రభావం చూపడమే కాకుండా.. గొప్ప అంచనాలను కూడా పెంచింది. అభిమానుల్లో గొప్ప అంచనాల్ని పెంచడం రజనీ లుక్ వెనుక నీతా ఎనలేని కృషి జరిపిందని చిత్ర యూనిట్ సభ్యుల అభిప్రాయం. రజనీ ధరించిన క్యాస్టూమ్స్, ఆయుధాలకు విశేష ప్రాచుర్యం లభించింది. ఇటీవల నీతా ఓ ఇంటర్య్యూలో 'కొచ్చడయాన్ కు పనిచేయడం గొప్ప అవకాశం. అంతేకాక తన కెరీర్ లో కొచ్చడయాన్ ఓ మైలురాయిగా నిలుస్తుంది. పోటో రియలిస్టిక్ మోషన్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది' అని నీతా లూలా తెలిపారు. -
కేక పుట్టిస్తున్న రజనీ
‘రోబో’ వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతవరకూ రజనీకాంత్ సినిమా రాలేదు. దక్షిణాది ప్రేక్షకులు, ముఖ్యంగా రజనీ అభిమానులు తమ అభిమాన కథానాయకుణ్ణి వెండితెరపై చూడాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ లోటు తీర్చడానికే ‘కోచ్చడయాన్’ వస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మాట్లో ఈ సినిమా తయారవుతోంది. ఇండియాలో ఈ పరిజ్ఞానం ఉపయోగించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. రజనీ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు కావడం మరో విశేషం. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల కోసం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోచ్చడయాన్’ చిత్ర ప్రచార చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సోమవారం ఇంటర్నెట్లో విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లో నాలుగు లక్షల మంది అభిమానులు వీక్షించడం విశేషం. రజనీకాంత్ రాజు గెటప్‌లో గుర్రపుబండితో స్వారీ చేయడం, పోరుభూమిలో శత్రువులను చీల్చి చెండాడడం, స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం వంటి సన్నివేశాలు అభిమానులను కేరింతలు కొట్టిస్తున్నాయి. ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో శ్రీ లక్ష్మీ గణపతి సంస్థ విడుదల చేయనుంది. -
రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల?
ఇప్పటికే అభిమానుల భారీ అంచనాలు నెలకొన్న ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొచ్చడయాన్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజున విడుదల చేసేందుకు ప్తాన్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ వర్గాలు నుంచి విశ్వసనీయంగా సమాచారం అందింది. అనుకున్న ప్రకారం అన్ని పనులు సవ్యంగా పూర్తవుతే అభిమానులకు రజనీ కాంత్ బర్త్ డే గిప్ట్ గా కొచ్చడయాన్ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి టీజర్ సోమవారం ఆన్ లైన్ లో విడుదలైంది. కొచ్చడయాన్ టీజర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వంద కోట్ల వ్యయంతో భారత దేశంలో తొలి మోషన్ క్యాప్చర్ 3డీ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, శోభన, ఆది పినిశెట్టిలు నటించారు. -
చూడండి: రజనీకాంత్ 'కొచ్చడయాన్' మొదటి టీజర్ విడుదల
-
రజనీకాంత్ 'కొచ్చడయాన్' మొదటి టీజర్ విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొచ్చడయాన్ టీజర్ ఈరోజు విడుదలైంది. కుమార్తె సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినం చేశారు. హీరోయిన్గా దీపికా పదుకునే నటించారు. కొచ్చడయాన్ చిత్రం స్టిల్స్ ను సౌందర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ వీడియో ఇక్కడ చూడండి.