లింగాను పట్టుకున్న కొచ్చాడియన్ | Latha Rajinikanth accused of fraud | Sakshi
Sakshi News home page

లింగాను పట్టుకున్న కొచ్చాడియన్

Published Mon, Mar 23 2015 1:30 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

లత రజనీకాంత్(ఫైల్)

లత రజనీకాంత్(ఫైల్)

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ వివాదానికి ముగింపు ఇలా పలికాడో లేదో అలా మరో వివాదం చుట్టుముట్టింది. ఎడి బ్యూరో కంపెనీ రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ తమను మోసం చేశారని ఆరోపిస్తోంది.  కొచ్చాడియన్ విడుదలకు ఇబ్బందుల్లో ఉన్నపుడు తాము  ఆదుకున్నామని సంస్థ  అధినేత అభిర్ చంద్ నహార్  చెబుతున్నారు.  

లతా రజనీకాంత్  హామీ ఇచ్చిన  మీదటనే కొచ్చాడియన్ నిర్మాణ సంస్థ  మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్కు పదికోట్ల  రూపాయలు  అప్పుగా  ఇచ్చామంటున్నారు.  అంతేకాదు కొచ్చాడియన్ సినిమా తమిళనాడు హక్కులను తనకు తెలియకుండా రెట్టింపు రేటుకు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.  రజనీకాంత్ కల్పించుకొని తనకు  న్యాయం చేయాలని నహర్ కోరుతున్నారు.

అయితే మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ ముఖ్య అధికారి జయకుమార్ ఈ ఆరోపణలను ఖండించారు.   ఫైనాన్స్ చేసిన మొత్తంలో ఇప్పటికే తొమ్మిది కోట్ల  రూపాయలను చెల్లించామనీ, అభిర్ చంద్ అధిక వడ్డీ డిమాండ్  చేస్తున్నాడని.. ఈ విషయంలో   పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామనీ అన్నారు.  పైగా వారికి  సంబంధం లేని డిస్ట్రిబ్యూషన్  హక్కులను అడగడం విడ్డరంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement