మళ్లీ ఆస్కార్ బరిలో ఏఆర్ రెహ్మాన్ | AR Rahman in contention for Oscar again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆస్కార్ బరిలో ఏఆర్ రెహ్మాన్

Published Sat, Dec 13 2014 8:05 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

ఏఆర్ రెహ్మాన్

ఏఆర్ రెహ్మాన్

లాస్ఏంజల్స్: రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన మూడు చిత్రాలు 87వ అస్కార్ అవార్డుల ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నామినేషన్లు సాధించాయి. మిలియన్ డాలర్ ఆర్మ్, ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడయాన్ చిత్రాలకుగానూ రెహ్మాన్‌కు నామినేషన్లు దక్కాయి. 2009లో స్లమ్డాగ్ మిలియనియర్ చిత్రం ద్వారా ఆయనకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.

ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో మొత్తం 114 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ అవార్డుల తుది నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటిస్తారు. అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 22 జరుగుతుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement