కమల్‌హాసన్, ఏఆర్ రెహమాన్
లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజియమ్‌లోనే హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ ‘ది గాడ్‌ఫాదర్’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్. 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా, కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్ వీడియో లాంచ్ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్ వెస్ట్‌మోర్‌ను కలిసిన కమల్‌హాసన్ తాజాగా ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్‌లో కమల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment