
కాన్స్ చిత్రోత్సవాల్లో కమల్, ఏఆర్ రెహ్మాన్
తమిళ సినిమా: కాన్స్ చిత్రోత్సవాల్లో తమిళ కళాశిఖరాలకు రెడ్ కార్పెట్ స్వాగత గౌరవం లభించింది. మంగళవారం నుంచి ఫ్రాన్స్‌లో 75వ కాన్స్ చిత్రోత్సవాల సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇందులో పలు భారతీయ సినిమాలతో పాటు విదేశీ చిత్రాలు ప్రదర్శింపబడుతూ కను విందు చేస్తున్నాయి.
కాగా ఈ చిత్రోత్సవంలో ఏఆర్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన లీ మస్క్, మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన రాకెట్, పార్థీపన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇరవిన్ నిళల్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అదే విధంగా కమలహాసన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్ చిత్ర ట్రైలర్‌ను విస్టా వేర్స్, లోటస్ మెటా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి బుధవారం ప్రదర్శించారు.