LosAngels
-
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
అమెరికాలో మన రైతుబజార్లకు సమానంగా ఏమున్నాయి?
హాలీవుడ్ సినిమాలకు ప్రసిద్ధిగాంచిన లాస్ ఏంజిల్స్ మహానగరంలో నేను చూసిన ప్రదేశాల్లో నాకు సినిమా స్టూడియోల కన్నా కూడా బాగా నచ్చింది ఈబీ గిల్మోర్ ఫార్మర్స్ మార్కెట్. ఎందుకంటే..? నాకు వ్యవసాయ సహకార రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా పనిచేసిన అనుభవం ఉంది. ఎర్లీబెల్ గిల్మోర్ 1934 లో ప్రారంభించిన ఈ రైతుబజారులో వ్యవసాయ సంబంధమే కాదు అన్ని వస్తువులు పిల్లల ఆటవస్తువులు, గిఫ్ట్ ఐటమ్స్ (అవీ వారి ఉత్పత్తులేనంటారు ) వంటివి కూడా దొరకడం విశేషం. రుచికరమైన ఆహార పానీయాలు అందించే రెస్టారెంట్లకు లెక్కేలేదు. ఇక్కడికి వచ్చే జనం కొనుక్కుపోయే వాటికన్నా ఇక్కడ తినేవే ఎక్కువ. నేను గమనించిందేంటంటే, అమెరికన్లు తినేదానికన్నా వృధాగా పడేసేదే ఎక్కువ. పొద్దున్నుండి రాత్రివరకు పనిచేసే ఈ మార్కెట్ మామూలు రోజుల్లోనే కిటకిట లాడుతుంది, ఇక వీకెండ్స్‌లో చెప్పే పని లేదు. బయటి నుండి వచ్చే యాత్రీకుల రద్దీ కూడా ఎక్కువే. హాలీవుడ్ సినిమాల వాళ్ళు కూడా తరచుగా ఈ మార్కెట్ కు వస్తుంటారన్నది మరో ఆకర్షణ. ఈ ఫార్మర్స్ మార్కెట్ ప్రత్యేకత ఉత్పత్తిదారులే ఇక్కడ స్వయంగా తమ ఉత్పత్తులు అమ్ముకోవడం , ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయదారులు, అవి చౌక ధరలకు లభిస్తాయన్న వినియోగదారుల నమ్మకం. అంతేకాదు ఈ మార్కెట్‌కు సరాసరి ఫామ్ నుండి సరఫరా ఔతాయి కాబట్టి పండ్లు, కూరగాయలు తాజాగా ఉండడం. అమ్మకం దారుల మధ్య నున్న తీవ్రమైన పోటీవల్ల ఇక్కడ ఏది కొన్నా బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి. అమెరికాలో ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా మనకు లభించే కనీస సౌకర్యాలు పార్కింగ్, రెస్ట్ రూంలు, ఈ మార్కెట్లో ఏటీఎం, టెలిఫోన్ బూత్, పోస్ట్ ఆఫీసు వంటివి కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యం సందర్శకుల రక్షణ, ఎప్పుడు ఏ టెర్రరిస్ట్‌లు ఎటునుండి వచ్చి దాడి చేస్తారోనని అమెరికా వాళ్ళు నిరంతరం జాగ్రత్తగా ఉంటుంటారు, అది ఈ మార్కెట్లో స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి రైతుల మార్కెట్లకు అమెరికాలో ఈ మధ్యకాలంలో గిరాకీ ఎక్కువ అవుతుందని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. డైరెక్ట్ సేల్స్ వృద్ధి 9.6 శాతం ఉందని ఆ దేశ వ్యవసాయశాఖ వారి గణాంకాలు తెలుపుతున్నాయి. 1994 నాటికి అమెరికాలో రిజిస్టరై నడపబడుతున్న రైతుబజార్లు 1744 కాగా, 2012 నాటికి వాటి సంఖ్య 7864కు చేరింది. ఇందుకు ముఖ్య కారణం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించబడిన ఆహారపదార్థాలతో విసిగిపోయినవారు ఆర్గానిక్ ఫుడ్స్ కోసం రైతు బజార్ల వైపు చూస్తున్నారట, ఇలాంటి వాటికి ఎక్కువ ధర అయినా చెల్లించడానికి వారు వెనకాడడం లేదట. మన దేశంలో మన రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రారంభించిన రైతు బజార్లలో రైతులకు బదులు దళారులు ఎక్కువగా కనిపిస్తారు. రైతులే తమ పంటలు అమ్ముకుంటారనుకుంటే అందులో కూడా సేంద్రియ, పర్యావరణ, జీవసంబంధ పంటల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు వారి స్థానాల్లో మధ్య దళారులు కాస్తా దుకాణాలను కబ్జా చేయడం, ఏది పడితే అది అమ్మడం వల్ల బయటి మార్కెట్లకు వీటికి తేడా లేకుండాపోవడం.. ఇవన్నీ ఇక్కడి అనుభవాలు. మరి అమెరికాలో.. ఇలాంటి మార్కెట్లలో చాలా వసతులతో పాటు కొత్త విషయాలెన్నో ఉన్నాయి. ముందు ముందు మనం కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుందాం. --వేముల ప్రభాకర్ -
అమెరికాలో ఫ్లూతో 15 వేలమంది మృతి!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గల సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్లో ఇప్పటివరకు అమెరికాలో సుమారు రెండు లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు 15 వేల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడిన చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో మొత్తం 74 మంది చిన్నారులు ఇన్‌ఫ్లుయెంజాతో ఆసుపత్రిలో చేరారు. గడిచిన వారంలో 11 వేలకు పైగా భాధితులు ఆసుపత్రిలో చేరినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆరు నెలలలోపు చిన్నారులకు వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలని అధికారులు తెలిపారు. -
ఆస్కార్ మ్యూజియమ్‌లో మెమోరీస్ గుర్తు చేసుకున్న ఇండియన్ స్టార్స్
లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజియమ్లోనే హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ ‘ది గాడ్‌ఫాదర్’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్. 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా, కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్ వీడియో లాంచ్ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్ వెస్ట్మోర్ను కలిసిన కమల్‌హాసన్ తాజాగా ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్లో కమల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. -
కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి
California shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం.. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌కు సమీపంలో ఉండే మాంటెరీ పార్క్‌లో నిర్వహించిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులు కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో రాత్రి సుమారు 10 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. ఘటన సమయంలో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని సియాంగ్ వాన్ చోయ్ కాల్పులకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఆ సమయంలో భయంతో ముగ్గురు వ్యక్తుల తన రెస్టారెంట్లోకి వేగంగా వచ్చి తలుపులు మూసేశారని చెప్పాడు. పక్కనే ఉన్న డ్యాన్స్ క్లబ్‌లోకి ఒక దుండగుడు భారీ గన్‌తో కాల్పులు జరుపుతున్నట్లు వారు చెప్పారని అన్నాడు. పైగా అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్షసాక్ష్యలు కూడా సాయుధుడి వద్ధ బారీ మందుగుండు ఉన్నట్లు చెబుతున్నారు. దుండగడు డ్యాన్స్ క్లబ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించి.. ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దుండగులను గుర్తించాల్సి ఉంది. అంతకు ముందు రోజు వేలాదిమంది ఈ వేడుకకు హాజరయ్యినట్లు సమాచారం. అంతేగాదు ఈ రెండు రోజుల పండుగ కోసం సమారు 10 వేల మంది దాకా హాజరయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. లాస్ ఏంజెల్స్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో ఆసియా జనాభా ఎక్కువ. 🔴BREAKING: Mass shooting in #MontereyPark, California with reports of at least 16 people shot and at least 10 dead. pic.twitter.com/DSVU2wgT9x — i24NEWS English (@i24NEWS_EN) January 22, 2023 (చదవండి: అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?) -
Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
గత ఏడాది మేలో కరోనా ఉదృతి పెరిగినప్పుడు అమెరికాలో చాలామంది ఇళ్లకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఆ టైంలో అమెరికాకు చెందిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కరోనా కేసులు అధికంగా ఉన్న రోజుల్లో ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో 8 వారాలపాటు శవంతో గడిపింది. ఐతే ఆమెకు ఆవిషయమే తెలియదట. అసలేంజరిగిందంటే.. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో రిగాన్ బెల్లీ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఒక రోజు హఠాత్తుగా తన అపార్ట్మెంట్లో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఆ వాసనకి తలనొప్పి, రాత్రుల్లు నిద్రపట్టక ఆరోగ్యంకూడా బాగా పాడైపోయిందట. అంతేకాకుండా పురుగులు, సాలెపురుగులు విపరీతంగా పెరిగిపోయాయట. దీంతో ఆమె అపార్ట్మెంట్ మేనేజర్‌కి కంప్లైంట్ చేసింది. తనకు చనిపోయిన చేప వాసన వస్తోందని, కానీ దరిదాపుల్లో ఎక్కడా చెరువు లేకపోవడంతో, పక్కింటి కుక్క చచ్చిపోయిందేమోననే అనుమానం వ్యక్తం చేసింది. ఐతే వారిని అడిగితే కంగారు పడతారేమోనని మేనేజర్ చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కొన్ని రోజుల తర్వాత ఆ దుర్వాసన భరించలేక మేనేజర్ని రప్పించి అపార్ట్మెంట్ బ్లాక్‌ను పరిశీలించడానికి ఒక వ్యక్తిని పురమాయించారు. ఐతే పక్క అపార్ట్మెంట్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో మెట్లు కూడా ఎక్కలేకపోయాడు సదరు వ్యక్తి. మాస్టర్ కీతో ఆ ఇంటి తలుపు తీయడంతో అస్థిపంజరంగా మారిన శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె రూం మరణించిన వ్యక్తి ప్లాట్‌కి కేవలం 3 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ రూంలో పడుకుంది కూడా. ఐతే ఆమెకు అసలు అక్కడ శవం ఉందనే విషయమే తెలియదట. ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి మరణించి రెండు నెలలౌతున్నా అసలెవ్వరూ గమనించకపోవడం కొసమెరుపు. కాగా రిగాన్ బెల్లీ టిక్‌టాక్ ద్వారా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
ఇది భలే బంతి ‘బల్లీ’
-
ఇది భలే బంతి ‘బల్లీ’
లాస్ ఏంజెలిస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వినియోగదారుల ప్రదర్శనలో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బంతి రూపంలో ఉన్న ఓ చిన్న రోబోను మంగళవారం ఆవిష్కరించింది. బల్లీగా నామకరణం చేసిన ఈరోబో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దానికున్న చిన్న చక్రాల ద్వారా ఇల్లంతా తిరుగుతూ అందులో అమర్చిన కెమెరా ఇంటికి కాపలా కాస్తుంది. ఇంటికి వచ్చే , పోయే వారి గురించి యజమానిని హెచ్చరిస్తుంది. పెద్ద వాళ్లు ఇంట్లో నడిచేందుకు తోడ్పడుతుంది. అది మన ముందంటే ముందు, మన వెనకంటే వెనక నడుస్తూ కదలికలను రికార్డు చేస్తుంది. రమ్మంటే వస్తుంది. దూరంగా పొమ్మంటే పోతుంది. సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా వాయిస్ కాల్‌తో కూడా ఈ బంతి లాంటి రోబో స్పందిస్తుంది. హలో అంటే హలో చెబుతుంది. పెద్ద వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్లా కూడా పనిచేయడం ఇందులో ఉన్న ఇంకో విశేషం. ఈ రోబో టీవీ, టేప్ రికార్డర్, రేడియో లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుందీ, ఆఫ్ చేస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు కంపెనీ ఇవ్వడం ఇందులోని మరో విశేషం. శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈవో హెచ్ఎస్ కిమ్ దీన్ని ప్రదర్శించి చూపారు. -
ఒక్క రాత్రి రూ . 24 కోట్లు తగలేశాడు
శాన్ఫ్రాన్సిస్కో: ఇన్స్టాగ్రామ్ నుంచి పోటీతో స్నాప్‌చాట్ ఇబ్బందులు పడుతున్నా జల్సాలు, పార్టీల విషయంలో మాత్రం కంపెనీ సీఈవో ఇవాన్ స్పీజెల్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. లాస్ఏంజెల్స్లో న్యూ ఇయర్ పార్టీకి ఇవాన్ ఏకంగా రూ .24 కోట్లు ఖర్చు పెట్టాడు. పార్టీకి ఉద్యోగులు హాజరయ్యేందుకు వీలుగా కంపెనీకి సెలవు ప్రకటించి మరీ భారీ హంగామా చేశాడు. డీజే రాపర్ డ్రేక్ పెర్ఫామెన్స్ పార్టీకి హైలైట్‌గా నిలిచిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. స్నాప్‌చాట్ టీమ్‌తో న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామని, ఇవాన్ తన సొంత ఖర్చుతో గ్రాండ్ పార్టీ ఇచ్చాడని తెలిపాయి. ఈ మెగా ఈవెంట్ కోసం కంపెనీ చాలా ముందుగానే ప్లాన్ చేసిందని చెబుతున్నారు. 5000 మంది గెస్ట్‌లు పార్టీకి తరలివచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచీ స్నాప్‌చాట్ ఉద్యోగులు పార్టీకి హాజరయ్యారు. -
జీన్స్ వేసుకోలేకపోతున్న హీరోయిన్!
లాస్ ఏంజెల్స్: ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న దుస్తులను ధరించలేకపోతున్నందుకు తెగ బాధపడిపోతోంది నటి ఒలివా విల్డే. తన కాళ్లు బాగా సన్నగా ఉండటంతో జీన్స్‌ను ధరించలేకపోతున్నానని తెలిపింది ఈ 32 ఏళ్ల సుందరి. నేటి కాలంలో ఆహారంలో వచ్చిన మార్పుల తనపై బాగా ప్రభావాన్ని చూపాయని బాధను వ్యక్తం చేసింది. జీన్స్ సన్నగా పొడుగ్గా ఉన్నవాళ్లకు మాత్రమే.. తాను ఎప్పుడైనా బాయ్‌ఫ్రెండ్ జీన్స్ వేసుకోవడానికి ప్రయత్నించినా కుదరడంలేదని వివరించింది.