
శాన్‌ఫ్రాన్సిస్కో: ఇన్‌స్టాగ్రామ్ నుంచి పోటీతో స్నాప్‌చాట్ ఇబ్బందులు పడుతున్నా జల్సాలు, పార్టీల విషయంలో మాత్రం కంపెనీ సీఈవో ఇవాన్ స్పీజెల్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. లాస్‌ఏంజెల్స్‌లో న్యూ ఇయర్ పార్టీకి ఇవాన్ ఏకంగా రూ .24 కోట్లు ఖర్చు పెట్టాడు. పార్టీకి ఉద్యోగులు హాజరయ్యేందుకు వీలుగా కంపెనీకి సెలవు ప్రకటించి మరీ భారీ హంగామా చేశాడు.
డీజే రాపర్ డ్రేక్ పెర్‌ఫామెన్స్ పార్టీకి హైలైట్‌గా నిలిచిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. స్నాప్‌చాట్ టీమ్‌తో న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నామని, ఇవాన్ తన సొంత ఖర్చుతో గ్రాండ్ పార్టీ ఇచ్చాడని తెలిపాయి. ఈ మెగా ఈవెంట్ కోసం కంపెనీ చాలా ముందుగానే ప్లాన్ చేసిందని చెబుతున్నారు. 5000 మంది గెస్ట్‌లు పార్టీకి తరలివచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచీ స్నాప్‌చాట్ ఉద్యోగులు పార్టీకి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment