California shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం.. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌కు సమీపంలో ఉండే మాంటెరీ పార్క్‌లో నిర్వహించిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులు కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో రాత్రి సుమారు 10 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు.
ఘటన సమయంలో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని సియాంగ్ వాన్ చోయ్ కాల్పులకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఆ సమయంలో భయంతో ముగ్గురు వ్యక్తుల తన రెస్టారెంట్‌లోకి వేగంగా వచ్చి తలుపులు మూసేశారని చెప్పాడు. పక్కనే ఉన్న డ్యాన్స్ క్లబ్‌లోకి ఒక దుండగుడు భారీ గన్‌తో కాల్పులు జరుపుతున్నట్లు వారు చెప్పారని అన్నాడు. పైగా అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్షసాక్ష్యలు కూడా సాయుధుడి వద్ధ బారీ మందుగుండు ఉన్నట్లు చెబుతున్నారు. దుండగడు డ్యాన్స్ క్లబ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించి.. ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దుండగులను గుర్తించాల్సి ఉంది.
అంతకు ముందు రోజు వేలాదిమంది ఈ వేడుకకు హాజరయ్యినట్లు సమాచారం. అంతేగాదు ఈ రెండు రోజుల పండుగ కోసం సమారు 10 వేల మంది దాకా హాజరయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. లాస్ ఏంజెల్స్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో ఆసియా జనాభా ఎక్కువ.
🔴BREAKING: Mass shooting in #MontereyPark, California with reports of at least 16 people shot and at least 10 dead. pic.twitter.com/DSVU2wgT9x
— i24NEWS English (@i24NEWS_EN) January 22, 2023
(చదవండి: అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?)
Comments
Please login to add a commentAdd a comment