deads
-
కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి
California shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం.. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌కు సమీపంలో ఉండే మాంటెరీ పార్క్‌లో నిర్వహించిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులు కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో రాత్రి సుమారు 10 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. ఘటన సమయంలో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని సియాంగ్ వాన్ చోయ్ కాల్పులకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఆ సమయంలో భయంతో ముగ్గురు వ్యక్తుల తన రెస్టారెంట్లోకి వేగంగా వచ్చి తలుపులు మూసేశారని చెప్పాడు. పక్కనే ఉన్న డ్యాన్స్ క్లబ్‌లోకి ఒక దుండగుడు భారీ గన్‌తో కాల్పులు జరుపుతున్నట్లు వారు చెప్పారని అన్నాడు. పైగా అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్షసాక్ష్యలు కూడా సాయుధుడి వద్ధ బారీ మందుగుండు ఉన్నట్లు చెబుతున్నారు. దుండగడు డ్యాన్స్ క్లబ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించి.. ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దుండగులను గుర్తించాల్సి ఉంది. అంతకు ముందు రోజు వేలాదిమంది ఈ వేడుకకు హాజరయ్యినట్లు సమాచారం. అంతేగాదు ఈ రెండు రోజుల పండుగ కోసం సమారు 10 వేల మంది దాకా హాజరయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. లాస్ ఏంజెల్స్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే మాంటెరీ పార్క్‌లో ఆసియా జనాభా ఎక్కువ. 🔴BREAKING: Mass shooting in #MontereyPark, California with reports of at least 16 people shot and at least 10 dead. pic.twitter.com/DSVU2wgT9x — i24NEWS English (@i24NEWS_EN) January 22, 2023 (చదవండి: అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే?) -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
-
బ్రిటన్‌లో ఇద్దరు భారతీయుల మృతి
లండన్: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొనడంతో భారత సంతతికి చెందిన ఇద్దరు మైనర్లు మృతిచెందిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్ (10), పవన్‌వీర్ సింగ్ (23 నెలలు) మృతిచెందారు. అన్నదమ్ములైన వీరిద్దరూ తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వోల్వర్హామ్టన్ వద్ద వారి కారును ఆడీ ఎస్3 కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ బెంట్లీ కారు డ్రైవర్‌తో రేసింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ రేసింగ్‌లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉండగా.. బెంట్లీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడీ, బెంట్లీ కార్లు మితిమీరిన వేగంతో వెళ్తుండగా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్‌ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్‌కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు. పీజీ చదువుతున్న ఆన్సీ.. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్‌తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్‌చర్చ్‌లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్‌కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. -
పాక్ కాల్పుల్లో 7 నెలల్లో 52 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. -
అఫ్గాన్‌లో తాలిబన్ దాడి; 60 మంది మృతి
మజర్ ఎ షరీఫ్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి 60 మంది భద్రత దళాలను పొట్టనబెట్టుకున్నారు. ఈ మేరకు అఫ్గాన్ అధికారులు సోమవారం వెల్లడించారు. సర్–ఏ–పుల్లో మిలిటరీ బేస్‌ను తాలిబన్లు స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. ప్రావిన్షియల్ రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదనపు బలగాలు పంపకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆ ప్రాంత పోలీస్ చీఫ్ అబ్దుల్ ఖయూమ్ హెచ్చరించారు. ప్రతిదాడిలో 39 మంది తాలిబన్లు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారని చెప్పారు. -
మన్యంపై మృత్యునీడ
ప్రాణాంతక వ్యాధుల నీడన గిరిజనం అంతుచిక్కని వ్యాధులకు బలవుతున్న వైనం తాజాగా కాళ్లవాపుతో ఓ గిరిజనుడి మృతి ఐదుకు చేరిన ‘కాళ్లవాపు’ మరణాలు కదిలిన జిల్లా యంత్రాంగం అంతుచిక్కని వ్యాధికి అడవి బిడ్డలు బలైపోతున్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్యగా మొదలైన కాళ్ల వాపు.. రోజురోజుకూ ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా ఏజెన్సీలోని వీఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) .. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎట్టకేలకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. బాధితుల తరలింపునకు చర్యలు వీఆర్ పురం : కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అడిషనల్ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్ తెలిపారు. కాళ్లవాపుతో మరణించిన కారం రామారావు స్వగ్రామమైన చినమట్టపల్లిలో మంగళవారం వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. కాళ్లవాపుlలక్షణాలున్న వారు రక్త నమూనాలు ఇచ్చేందుకు కానీ, పరీక్షలు చేయించుకునేందుకు కానీ నిరాకరిస్తే.. నిర్బంధంగానైనా ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ వ్యాధి లక్షణాలున్న కొంతరిని రేఖపల్లి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. పోలవరం (భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్(స్పెషలాఫీసర్) పి.శ్రీరామచంద్రమూర్తి, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ పాల్గొన్నారు. గిరిజనుడిని బలిగొన్న ‘కాళ్లవాపు’ కాకినాడ సిటీ : జిల్లాలోని విలీన ప్రాంతమైన వీఆర్‌పురం మండలం చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) కాళ్ల వాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. కాళ్లవాపు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న రామారావును అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఏఎంసీ–1లో వెంటిలేటర్‌పై ఉంచి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వీఆర్‌పురం మండలంలో నలుగురు మరణించగా, తాజాగా రామారావు మృతితో కాళ్లవాపు వ్యాధి మరణాల సంఖ్య ఐదుకు చేరింది. 29 మంది డిశ్చార్జి కాళ్లవాపు వ్యాధితో బాధపడుతున్న 32 మంది గిరిజనులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని ఈ నెల 8, 9 తేదీల్లో జీజీహెచ్‌కు తరలించగా, ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్య సేవలందించారు. వీరిలో 29 మంది ఆరోగ్యం మెరుగుపడడంతో, మంగళవారం ఆస్పత్రిలో సీఎస్ఆర్ఎంఓ టీఎస్ఆర్ మూర్తి నేతృత్వంలో వైద్యులు విశాఖ నుంచి వచ్చిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ మహేష్, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ లకో్ష్మజీనాయుడు, మెడిసిన్ చీఫ్ డాక్టర్ సీఎస్ఎస్ శర్మ సమావేశమై చర్చించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో 29 మందిని డిశ్చార్జి చేసి, ప్రత్యేక వాహనంలో ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ బృందం రాక కాగా రెండు రోజుల్లో నేషనల్ లేబొరేటరీ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. ముంపు మండలాల్లో కాళ్ల వాపు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి, శాంపిళ్లను సేకరిస్తుందని తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాం చింతూరు : ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు మెరుగు పరుస్తామని, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలీన మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. చింతూరులో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, డిప్యుటేషన్‌పై స్టాఫ్‌నర్సులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి అధికంగా ఉందని, వీరిలో 19 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్టు తెలిపారు. వీరిలో నలుగురికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండగా, వీరిలో ఒకరు మంగళవారం మరణించినట్టు చెప్పారు. కొందరు గిరిజనులు తాగుతున్న నాటుసారాను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. చింతూరులో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఏజెన్సీలో ప్రతి మండలానికి ఒక డాక్టర్‌తో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నాటుమందులు ఆశ్రయించి ప్రాణాపాయం కొనితెచ్చుకోవద్దని కోరారు.