అఫ్గాన్‌లో తాలిబన్‌ దాడి; 60 మంది మృతి | New Taliban Attacks Kill Dozens of Afghan Soldiers and Police Officers | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో తాలిబన్‌ దాడి; 60 మంది మృతి

Published Tue, Sep 11 2018 3:47 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

New Taliban Attacks Kill Dozens of Afghan Soldiers and Police Officers - Sakshi

మజర్‌ ఎ షరీఫ్‌: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి 60 మంది భద్రత దళాలను పొట్టనబెట్టుకున్నారు. ఈ మేరకు అఫ్గాన్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. సర్‌–ఏ–పుల్‌లో మిలిటరీ బేస్‌ను తాలిబన్లు స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. ప్రావిన్షియల్‌ రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదనపు బలగాలు పంపకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆ ప్రాంత పోలీస్‌ చీఫ్‌ అబ్దుల్‌ ఖయూమ్‌ హెచ్చరించారు. ప్రతిదాడిలో 39 మంది తాలిబన్లు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement