
అఫ్గానిస్థాన్‌లో దారుణం జరిగింది. దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. సర్ ఎ పుల్ ప్రావిన్సు, సంగ్చారక్ జిల్లాలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో ఈ దాడులు జరిగాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. వ్యక్తిగత కక్షతోనే ఈ దారుణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించినట్లు విద్యా శాఖ అధికారి మహమ్మద్ రహమానీ వెల్లడించారు.
ఈ ఘటనలో దుండగులు ఉపయోగించిన విషపదార్థం ఎంటో తెలియలేదు. చికిత్స పొందుతున్న బాలికల గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కాగా.. తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో బాలికలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. స్కూళ్లు, కళాశాలల్లో బాలికలపై దాడులు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి:తీవ్రంగా చలించిపోయా: బైడెన్