Taliban attack
-
ఆఫ్గాన్‌లో దారుణం.. 80 మంది బాలికలపై విషప్రయోగం
అఫ్గానిస్థాన్‌లో దారుణం జరిగింది. దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. సర్ ఎ పుల్ ప్రావిన్సు, సంగ్చారక్ జిల్లాలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లో ఈ దాడులు జరిగాయి. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. వ్యక్తిగత కక్షతోనే ఈ దారుణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించినట్లు విద్యా శాఖ అధికారి మహమ్మద్ రహమానీ వెల్లడించారు. ఈ ఘటనలో దుండగులు ఉపయోగించిన విషపదార్థం ఎంటో తెలియలేదు. చికిత్స పొందుతున్న బాలికల గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కాగా.. తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో బాలికలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. స్కూళ్లు, కళాశాలల్లో బాలికలపై దాడులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి:తీవ్రంగా చలించిపోయా: బైడెన్ -
Afghan: అఫ్గన్ కేంద్రంగా దాడులు జరగనివ్వం
కాబూల్: అఫ్గాన్‌ను ఉగ్రశిబిరాలకు అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్ నేతృత్వంలోని నూతన అఫ్గాన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పష్టంచేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమిర్ ఖాన్ తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తమ తాత్కాలిక తాలిబన్ ప్రభుత్వం ఎంతకాలం మనుగడలో ఉండనుందో, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారో లేదో తదితర అంశాలపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చదవండి: క్వారంటైన్లోకి పుతిన్ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. అల్–ఖాయిదా తదితర ఉగ్రసంస్థలతో ఇకపై సంబంధాలను తెంచుకుంటా మని గత ఏడాది అమెరికాతో చర్చల సందర్భంగా తాలిబన్లు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ మేరకు, అఫ్గాన్ గడ్డపై ఉగ్రసంస్థల కార్యకలాపాలను జరగనివ్వబోమని ఆమిర్ ఖాన్ స్పష్టంచేశారు. ఉగ్రసంస్థల పట్ల నూతన ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపై ఇలా ఒక కేబినెట్ మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి. -
తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్‌లో ఆందోళనలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది. ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!) అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్‌షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1 — Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021 -
ఏ క్షణాన ఏ వార్త వినాల్సివస్తుందో.. రషీద్‌ఖాన్
Rashid Khan అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అరాచక పాలనతో రాజ్యమేలుతున్న వేళ ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం కుటుంబానికి అందుబాటులో లేకుండా పోయిన రషీద్ ఖాన్.. తన కుటుంబం ఏమౌతుందోననే భయాందోళనలో మునిగిపోయాడు. తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఆవేదన చెందాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రషీద్ యూకేలో ఉండిపోవడం.. తన కుటుంబసభ్యులు మాత్రం అఫ్గన్‌లో ఉండడంతో వారికేమైనా జరుగుతుందేమోనని కలవరపడుతున్నాడు.తాలిబన్ల అరాచక పాలన తట్టుకోలేక ఆ దేశ ప్రజలు ప్రాణ భయంతో వేరే చోటికి తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇదే విషయమై రషీద్ పీటర్సన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ''అఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రషీద్‌తో చర్చించా. ఈ విషయమై అతను చాలా బాధపడుతున్నాడు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాడు. రషీద్‌కు కుటుంబం అంటే ప్రాణమని.. వారిని విడిచి ఉండలేడని.. అందుకే తన వాళ్లకు ఏం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాబుల్ విమానాశ్రయానికి విమానాలు నిలిచిపోయాయి. దీంతో తన కుటుంబాన్ని అఫ్గన్ నుంచి తరలించిలేక కుమిలిపోతున్నాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని రషీద్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమని.. వారు మద్దతిస్తారని.. మా కార్యకలపాలకు అడ్డుపడరని అఫ్గన్ క్రికెట్ సీఈవో హమీద్ షీన్వారీ మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. -
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
-
అమ్యూజ్మెంట్ పార్కులో తాలిబన్ల ఎంజాయ్
కాబూల్: అఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్ని తలుచుకుని రోదిస్తున్నారు. ఓ వైపు తాలిబన్ల రాక్షసపాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనాలు ఇబ్బడిముబ్బడిగా విమానాశ్రాయాలు, రోడ్ల మీదకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తుండగా.. మరోవైపు ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబూల్‌ని ఆక్రమించిన తర్వాత తాలిబన్ల గుంపు తీరిగ్గా అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆ వివరాలు.. కాబూల్ నగరాన్ని ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఈ సిటీలోని అమ్యూజ్మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. భుజాలపై రైఫిళ్లను అలానే పెట్టుకుని ఈ పార్కుల్లోని ఎలెక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు తాలిబన్లు. వీరిలో కొందరు ఫైటర్లు దేశంలో చిక్కుబడిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట. భాషా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ట్రాన్స్ లేటర్లుగా మారి ఆ సమస్యను తీర్చారట. ఇలా ఉండగా కాబూల్‌లోని పార్లమెంట్ భవనంలో తాలిబన్లు తిష్ట వేసిన దృశ్యాల వీడియోలు, మజారే షరీఫ్‌లో మాజీ అఫ్గన్ సైనికాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో వీరు తిరుగాడుతున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
అఫ్గన్‌లో మహిళల రక్షణపై మలాలా ఆందోళన
లండన్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేజి క్కించు కోవడంపై పాకి స్తానీ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(24) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలోని మహిళలు, మైనారిటీలు హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతు న్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ట్విట్టర్లో ఆమె..‘అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం చూసి షాక్‌కు గురయ్యాను. ఈ పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీలు, హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను’ అన్నారు. ‘ప్రపంచదేశాలు జోక్యం చేసుకుని అక్కడ తక్షణమే కాల్పుల విరమణ అమలయ్యేలా చూడాలి. శరణార్ధులు, పౌరులకు భద్రత కల్పించి, మానవతాసాయం అందజేయాలి’ అని ఆమె కోరారు. బాలికలు చదువుకోవాలంటూ పాక్‌లోని స్వాత్ ప్రాంతం లో ఉద్యమం చేపట్టిన మలాలాపై 2012లో తాలి బన్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె పాకిస్తాన్లో, అనంతరం యూకేలో చికిత్స పొందారు. ప్రస్తుతం యూకేలోనే ఉంటున్నారు. ఆమె పాకిస్తాన్ వస్తే చంపేస్తామంటూ తాలిబన్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అఫ్గాన్‌లో స్థిరత్వం ఏర్పడాలి: రైజీ కాబూల్: తాలిబన్ వశమైన అఫ్గనిస్తాన్‌లో స్థిరమైన పాలన ఏర్పడాలంటూ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైజీ ఆకాంక్షించారు. అఫ్గన్‌లో స్థిరత్వం ఏర్పడేందుకు ఇరాన్ సహకరిస్తుందని, అదే తమ ప్రధమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అఫ్గన్ తమకు సోదరుడి వంటిదన్నారు. అమెరికన్ ఆర్మీ వైఫల్యం కావడంతోనే అఫ్గాన్‌ను విడిచి వెళ్లిందని వ్యాఖ్యానించారు. అమెరికా బలగాల నిష్క్రమణ వల్ల అఫ్గన్‌కు తిరిగి జీవం పోసేందుకు, స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు అవకాశం దక్కిందన్నారు. అధికారికంగా 8 లక్షల మంది, అనధికారికంగా 20 లక్షల మంది అఫ్గన్లు ఇరాన్లో శరణార్థులుగా ఉన్నారు. రక్షణ బాధ్యత అఫ్గన్లదే అమెరికా భద్రతా సలహాదారు సలివన్ వాషింగ్టన్/కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ నిందించారు. అఫ్గన్‌లో మూడో దశాబ్ది సంఘర్షణలోకి అమెరికా అడుగు పెట్టాలని అధ్యక్షుడు జో బైడెన్ కోరుకోవడం లేదని తెలిపారు. రెండు దశాబ్దాల పాటు అఫ్గన్ రక్షణ కోసం అమెరికా వందల కోట్ల డాలర్లు వెచ్చించిందని, అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇకపై స్వదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అఫ్గన్ సైన్యానిది, అక్కడి ప్రజలదేనని తేల్చిచెప్పారు. రాజధాని కాబూల్ విషయంలో తాలిబన్లతో పోరాటం వద్దని అఫ్గన్ సైనికులే నిర్ణయించుకున్నారని, అందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాలిబన్లపై సొంతంగా పోరాటం సాగించడానికి అఫ్గన్ సైన్యం సిద్ధంగా లేదన్నారు. కాబూల్‌లో పరిణామాలు కలచి వేస్తున్నప్పటికీ బైడెన్ నిర్ణయంలో మార్పు ఉండబోదని వివరించారు. -
అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం: ‘బైడెన్ రాజీనామా చేయాల్సిందే’
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ ఆక్రమణ కోసం కాచుకున్న తాలిబన్లకు అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో అవకాశం లభించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం రావడానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడనే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ జో బైడెన్ తక్షణమే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకోడానికి అవకాశం కల్పించారని, బైడెన్ హాయంలో అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమని మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోవడానికి అనుమతించినందుకు జో బైడెన్ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాక అమెరికాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, హెచ్-1బీ ఇమ్మిగ్రేషన్ విధానం, ఆర్ధిక, పాలనాపరమైన విధానాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, అఫ్గాన్ నుంచి సైన్యాల ఉపసంహరణకు ట్రంప్ హయాంలోనే బీజం పడింది. దోహా వేదికగా 2020 ఫిబ్రవరిలోనే తాలిబన్లతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు ట్రంప్. భద్రత విషయంలో తాలిబన్ల నుంచి హామీ లభించడంతో అమెరికా, మిత్రరాజ్యాల సైన్యాలను 2021 మే నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన జో బైడెన్.. అఫ్గాన్ నుంచి సైన్యం ఉపసంహరణ గడువును సెప్టెంబరు 1కి పొడిగిస్తూ ఎటువంటి షరతులు విధించలేదు. బైడెన్ నిర్ణయంపై ట్రంప్ పలుసార్లు విమర్శలు చేశారు. ఒకవేళ తాను తిరిగి అధికారంలోకి వచ్చుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, బలగాల ఉపసహరణ చాలా విజయవంతంగా జరిగేదని ట్రంప్ ఎదురుదాడి చేశారు. ‘‘అఫ్గానిస్తాన్ విషయంలో జో బైడెన్ చర్యలు చాలా గొప్పవి.. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఓటమిగా మిగిలిపోతాయి’’ అని ట్రంప్ విమర్శించాడు. ఇక అఫ్గానిస్తాన్‌లో బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్ సర్కార్‌పై అమెరికాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్ విల్సన్ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. -
అఫ్గాన్‌పై బిగుస్తున్న తాలిబన్ల పట్టు.. సగం దేశంపై ఆధిపత్యం
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాతోపాటు యూరప్ దేశాల సైనిక బలగాల ఉపసంహరణ మొదలయ్యింది. ఆగస్టు చివరికల్లా తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ఆయా దేశాలు గతంలోనే ప్రకటించాయి. దీంతో అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ తీవ్రవాదుల గుప్పిట్లోకి వెళ్లిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సగం దేశం వారి పెత్తనం కిందకు వచ్చింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రవాదులే అధికారం చెలాయిస్తున్నారు. అత్యంత కీలకమైన ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించారు. ఇప్పుడు పెద్ద నగరాలపై వారి కన్ను పడింది. పశ్చిమ, దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని హెరాత్, లష్కర్ ఘా, కాందçహార్ నగరాలపై ఆధిపత్యం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భద్రతా సిబ్బందితో హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే, అఫ్గాన్ భద్రతా సిబ్బంది ఈ మూడు నగరాలను ఇంకెంత కాలం కాపాడగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. త్వరలోనే హెరాత్, లష్కర్ ఘా, కాందçహార్ తాలిబన్ల వశం కావడం తథ్యమని స్థానికులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో తాలిబన్లు హతం! హెరాత్, లష్కర్ ఘా, కాందహార్‌లో ఆదివారం భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ కొనసాగింది. శనివారం లష్కర్ ఘాలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలోకి తీవ్రవాదులు దూసుకొచ్చారు. రాత్రి సమయంలో వెనక్కి మళ్లినట్లు తెలిసింది. తాలిబన్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్, అమెరికా సేనలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈ దాడుల్లో పదుల సంఖ్యలో తాలిబన్లు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హెల్మాండ్ ప్రావిన్స్ రాజధాని లష్కర్ ఘాలో గతంలో తాలిబన్లతో జరిగిన పోరాటంలో పెద్ద సంఖ్యలో అమెరికా, బ్రిటిష్ సైనికులకు మరణించారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగరంలో తీవ్రవాదులు ఆయుధాలతో సంచరిస్తున్న వీడియోలను తాలిబన్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. తాలిబన్లు కొన్ని ఇళ్లను ఆధీనంలోకి తెచ్చుకొని, అక్కడే మాటు వేశారని స్థానికులు చెబుతున్నారు. వారిని అక్కడి నుంచి తరిమికొట్టడం కష్టమేనని, అతిత్వరలో భారీ హింసాకాండ, రక్తపాతం జరిగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి కాందçహార్ ఎయిర్‌పోర్టుపై ఆదివారం తెల్లవారుజామున తాలిబన్లు రాకెట్లతో దాడికి దిగారు. దీంతో రన్‌వే దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య ఘర్షణతో ఇప్పటికే కాందహర్ నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. నగరంలో గంట గంటకూ పరిస్థితి దిగజారుతోందని గుల్ అహ్మద్ అనే స్థానికుడు చెప్పాడు. కాందçహార్లో గత 20 ఏళ్లలో ఈ స్థాయి ఘర్షణ జరుగుతుండడం ఇదే తొలిసారి అని వెల్లడించాడు. కాందహార్‌ను తాత్కాలిక రాజధానిగా మార్చుకోవాలని తీవ్రవాదులు భావిస్తున్నట్లు తెలిపాడు. హెరాత్‌లో పరిస్థితి అదుపులోనే.. అఫ్గాన్‌కు ఆర్థికంగా ఆయువుపట్టు లాంటి సిటీ హెరాత్. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కొంత అదుపులోనే ఉంది. తీవ్రవాదులపై సైన్యం పైచే యి సాధిస్తోంది. తాలి బన్ల భరతం పట్టేం దుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. యాంటీ–తాలిబన్ కమాండర్ ఇస్మాయిల్ ఖాన్ హెరాత్‌లో విధుల్లో నిమగ్నమయ్యారు. తీవ్రవాదులను ఎదుర్కొనేందు కు ఆయన సాధారణ ప్రజల ను సమీకరిస్తున్నారు. నగరం వెలు పల ఉన్న తాలిబన్ల స్థావరాలపై సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. -
తాలిబన్ల దాడులు; 16 మంది భద్రతా సిబ్బంది మృతి
అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని సాల్మా డ్యామ్ సమీపంలో తాలిబన్ల దాడుల్లో 16 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని చిస్తి జిల్లాలోని హెరాత్ ప్రావిన్స్‌ను తాలిబన్లు తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడి చెక్‌పాయింట్ సహా ఆ ప్రదేశాలను తమ వశం చేసుకున్న తాలిబన్లు భద్రతా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 16 మంది సిబ్బంది మృతి చెందగా, మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతకాలంగా సాల్మా డ్యామ్ వద్ద భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అతి పెద్ద ప్రాజెక్టును చేపడుతుంది. -
ఆప్ఘనిస్తాన్‌లో పేలుడు..ఇద్దరు పోలీసులు హతం
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ దక్షిణ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రావిన్సు పరిధిలోని కందహార్లో రోడ్‌సైడ్ బాంబును పోలీసు వాహనం ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ పేలుడు ఘటన వెనుక ఎవరున్నారన్న దానిపై ఆప్ఘనిస్తాన్ అధికారులు కానీ తాలిబన్ ఇస్టామిస్ట్ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రాజకీయ పరిష్కార మార్గం దిశగా రెండు వైపులా చర్చలు కొనసాగుతున్నాయి. ఇకవైపు చర్చలు అంటూ శాంతియుతంగా మాట్లాడుతునే..మరోవైపు దేశ వ్యాప్తంగా తాలిబన్ దాడులు చేస్తోంది. దీంతో ఆప్ఘనిస్తాన్ వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండంతో భద్రతా దళాలు నిఘా ఉంచారు. (కాబూల్:యూనివర్సిటీపై ఉగ్రదాడి: 19 మంది మృతి) -
మరోసారి రెచ్చిపోయిన తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కారు బాంబుతో దాడి చేసి లోపలికి ప్రవేశించి భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు. ఉత్తర అఫ్గనిస్తాన్‌లోని సమంగన్ ప్రావిన్స్ రాజధాని ఐబక్‌లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ప్రధాన విభాగమైన నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్‌పై దాడి జరిగిందని, కారు బాంబుతో ముష్కరులు విరుచుకుపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి మహ్మద్ సెదిక్ అజీజీ తెలిపారు. ఇక ఈ విషయం గురించి సమంగన్ గవర్నర్ అబ్దుల్ లతీఫ్ ఇబ్రహీమి మాట్లాడుతూ.. 10 మంది భద్రతా బలగాల సభ్యులు మరణించారని తెలిపారు. అంతేగాకుండా భద్రతా సిబ్బందితో పాటు సామాన్య పౌరులకు గాయాలయ్యాయని.. మొత్తంగా 54 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్ సంస్థ ప్రకటించింది. (అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి) కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అమెరికా తాలిబన్లతో ఈ ఏడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని... అంతేగాక జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ నేపథ్యంలో దశల వారీగా తాలిబన్లను విడుదల చేసేందుకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మార్చిలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్లు ఇటీవల వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆదివారం కుందుజ్ ప్రాన్స్‌లోని చెక్పాయింట్ల వద్ద దాడులకు తెగబడటంతో 14 మంది భద్రతా బలగాల సిబ్బంది మృతి చెందారు. -
అది అమెరికా విమానం.. మేమే కూల్చేశాం!
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో సోమవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కూలిన విమానం అమెరికా సైన్యానికి చెందినదని తాలిబన్ గ్రూపు ప్రకటించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ గ్రూపు అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఘాంజీ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తామే కారణమని పేర్కొన్నాడు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో మంటలు చెలరేగి విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనాస్థలమైన దేహ్ యాక్ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున ఈ ఘటన గురించిన వివరాలు సేకరించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తాలిబన్ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైనిక స్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో విమానాన్ని కూల్చేశామని పేర్కొంది. కాగా అమెరికా సైనికాధికారులు మాత్రం తాలిబన్ల వ్యాఖ్యలను కొట్టిపడేశారు. విమాన ప్రమాద ఘటనపై అమెరికా సైన్యం విచారణ జరుపుతోందని.. ఈ ఘటనలో తాలిబన్ల ప్రమేయం ఉందా లేదా అన్న విషయం త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైంది ఆఫ్గనిస్తాన్ జాతీయ విమాన సంస్థ అరియానా ఆఫ్గాన్‌కు చెందిన పౌర విమానం అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా... సదరు విమానం ఆఫ్గనిస్తాన్ గగనతలంపై నిఘా నిర్వహించే అమెరికా సైన్యానికి చెందినదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు తామే కారణమంటూ తాలిబన్లు ముందుకు రావడం గమనార్హం. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై.. ఇరాన్ తరచుగా రాకెట్ దాడులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆఫ్గనిస్తాన్‌లో విమాన ప్రమాదం! @pajhwok reporter Saifullah Maftoon visited the area in #Ghazni province, where an Aircraft crashed today, #Taliban said few US force officers were killed in this incident. #Afghanistan pic.twitter.com/vJ1fB2kspb — Pajhwok Afghan News (@pajhwok) January 27, 2020 -
అఫ్గాన్‌లో తాలిబన్ దాడి; 60 మంది మృతి
మజర్ ఎ షరీఫ్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి 60 మంది భద్రత దళాలను పొట్టనబెట్టుకున్నారు. ఈ మేరకు అఫ్గాన్ అధికారులు సోమవారం వెల్లడించారు. సర్–ఏ–పుల్లో మిలిటరీ బేస్‌ను తాలిబన్లు స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. ప్రావిన్షియల్ రాజధానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అదనపు బలగాలు పంపకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆ ప్రాంత పోలీస్ చీఫ్ అబ్దుల్ ఖయూమ్ హెచ్చరించారు. ప్రతిదాడిలో 39 మంది తాలిబన్లు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారని చెప్పారు. -
తాలిబన్ దాడి..12 మంది మృతి
కాబూల్ : తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ జిల్లా గవర్నర్‌తో పాటు మరో 11 మంది చనిపోయారు. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్‌లోని గజిని ప్రావిన్స్‌లో గురువారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగింది. ఖవాజా ఒమరి జిల్లాలోని చెక్‌పోస్టుపై తాలిబన్ ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సుమారు 4 గంటల పాటు కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటన జారీ చేశారు. అలాగే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
తాలిబన్ల దాడిలో 14మంది విదేశీయులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై తాలిబన్లు శుక్రవారం రాత్రి జరిపిన దాడిలో 14 మంది విదేశీయులు చనిపోయారు. ఒక టెలికం అధికారి, ముగ్గురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో సాయుధులైన నలుగురు దుండగులు హోటల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కొందరిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్లోని కొన్ని గదులకు నిప్పంటించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు హెలికాప్టర్ ద్వారా భవనం పైనుంచి ప్రవేశించి ఉగ్రవాదులతో తలపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనకు తామే కారణమంటూ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ప్రకటించుకుంది. -
పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి
కాబుల్ : అప్ఘనిస్థాన్ పోలీసు ఉన్నత కార్యాలయాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఓ ఉగ్రవాది కారు బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడగా పలువురు సాయుధులు కాల్పులతో తెగబడ్డారు. ఈ దాడిని తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటించింది. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు? ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం పక్తియా ప్రావిన్స్‌లోని గార్డెజ్ ప్రాంతంలో పోలీసుల శిక్షణ కేంద్రం ఉంది. అక్కడే పోలీసుల హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వాటినే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ప్రస్తుతానికి అత్యవసర సమయాల్లో స్పందించే బృందం ఉగ్రవాదులను కట్టడి చేసే పనిలో ఉందని తెలిపారు. -
ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి
► 15 మంది సైనికుల మృతి కాందహార్: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారీ తాలిబాన్లు రెచ్చిపోయారు. రెండు రోజుల క్రితం పది మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శుక్రవారం ఆర్మీ బేస్‌పై దాడి చేసి మరో 15 మంది సైనికులను కాల్చి చంపారు. కాందహార్ ప్రావిన్సు షావలీ కోట్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మృతుల సంఖ్య ఇరవై వరకు ఉంటుందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిపిన దాడిలో పది మంది సైనికులు చనిపోయారు. తాజా ఘటనలో నేపథ్యంలో తాలిబాన్లు మరింత బలం పుంజుకున్నారని స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. -
బుల్లెట్లకు ఒక్క ఏడాదిలో 3,645మంది బలి
కాబుల్: తమ దేశ పౌరులు ప్రాణాలుకోల్పోతుండటంపట్ల అఫ్ఘనిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా ఏనాడు ఆయుధాల ముఖాలు చూడని, అల్లర్లకు దిగని అమాయకులైన ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారని పేర్కొంది. 2015 సంవత్సరంలో తమ దేశ పౌరులకు జరిగిన నష్టం వివరాలను అఫ్ఘనిస్థాన్ అధ్యక్ష భవనం విడుదల చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రభుత్వానికి అందించగా దానిపట్ల ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2014తో పోల్చుకుంటే 2015లో ఎక్కువమంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. దాదాపు 11 వేలమంది ఈ దాడుల భారిన పడగా వారిలో 3,645 మంది పౌరులు మరణించగా, 7,457 మంది క్షతగాత్రులయ్యారు. 2014తో పోలిస్తే ఈ మరణ రేటు 4శాతం పెరిగింది. ఈ నివేదికపై అధ్యక్ష భవనం స్పందిస్తూ 'ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పౌరులు తమ జీవించే హక్కును కోల్పోతున్నారు. శాంతియుతంగా జీవించే మానవ హక్కులను పొందలేక పోతున్నారు. తాలిబన్లు మహిళలను, బాలికలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వారి జీవించే హక్కును కాలరాస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. -
'వర్సిటీపై దాడి'కి వీసీ కూడా బాధ్యుడే
'సరిహద్దు గాంధీ' బిరుదాంకితుడు, బచా ఖాన్ గా ఖ్యాతిగడించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరుమీద నెలకొల్పిన విశ్వవిద్యాలయంలో రక్తపుటేరులు పారించిన తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్ ప్రపంచం ఖండించింది. జనవరి 20న జరిగిన ఉగ్రదాడిపై ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రాథమిక నివేదికను సమర్పించిన ఆ కమిటీ దాడి ఘటనలో వర్సిటీ పెద్దల బాధ్యతారాహిత్యం స్పష్టంగా బయటపడిందని పేర్కొంది. వర్సిటీ భద్రతపై వీసీ ఫజల్ ఉర్ రహీమ్ మర్వత్, సెక్యూరిటీ ఇన్ చార్జి అష్ఫ్రాక్ అహ్మద్ ల నిర్లక్ష్యం వల్లే ఉగ్రవాదులు లోపలికి సులువుగా చొరబడగలిగారని, 21 మంది మరణాలకు వారు కూడా బాధ్యులేనని, తక్షణ వారిని విధుల నుంచి తొలిగించాలని దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 'వర్సిటీ ప్రాంగణంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారుగానీ వాటిని పర్యవేక్షించే కేంద్రీయ వ్యవస్థ ఏర్పాటును విస్మరించారు. ఒకవేళ ఆ వ్యవస్థ పనిచేసి ఉంటే ఉగ్రవాదుల చొరబాటును సులువుగా నివారించే వీలుండేది. విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో వర్సిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు' అని నివేదికలో పొందుపర్చారు. -
విమానాశ్రయంపై తాలిబన్ల దాడి.. 37 మంది మృతి
కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 37 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సాధారణ పౌరులతో పాటు అఫ్ఘాన్ సెక్యూరిటీ దళాల సభ్యులు కూడా ఉన్నారు. చాలా సేపటి నుంచి భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని, మొత్తం 10 మంది తాలిబన్లను భద్రతా దళాలు కాల్చి చంపాయని అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. గడిచిన 24 గంటల్లో కాందహార్ ఎయిర్‌పోర్టు మీద తాలిబన్లు దాడి చేయడం ఇది రెండోసారి. మంగళవారం కూడా తాలిబన్లు కాందహార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, ముగ్గురు పోలీసు అధికారులను హతమార్చారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. తాజా దాడిలో.. భారీ భద్రతతో ఉండే విమానాశ్రయ ప్రాంగణంలోని కీలక ప్రాంతానికి చేరుకున్న కొంతమంది ఉగ్రవాదులు.. తొలుత ఆ ప్రాంగణంలో ఉన్న ఓ స్కూలు, నివాస ప్రాంతంలో పొజిషన్లు తీసుకున్నారని అధికారులు చెప్పారు. ఒకవైపు ఇస్లామాబాద్‌లో ఆసియా ప్రాంతీయ భద్రతా సదస్సు జరుగుతుండగానే మరోవైపు అఫ్ఘాన్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామిక్ ఉగ్రవాదుల చొరబాట్లతో పోరాడేందుకు తమకు మరింత ప్రాంతీయ మద్దతు కావాలని సదస్సులో అఫ్ఘాన్ అద్యక్షుడు అష్రఫ్ ఘనీ కోరారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 అసాల్ట్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. వాళ్లందరినీ హతమార్చిన తర్వాత.. అఫ్ఘాన్ ప్రత్యేక బలగాలు అక్కడ మోహరించి మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నాయి. స్థానికులు ఎవరినీ ఉగ్రవాదులు బందీలుగా చేయకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. -
అఫ్ఘాన్‌లో నలుగురు భారతీయుల మృతి
తాలిబన్ ఉగ్రవాదులు అఫ్ఘాన్ రాజధాని కాబూల్ నగరంలోని ఓ గెస్ట్‌హౌస్‌లోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు భారతీయులతో పాటు ఓ అమెరికన్ మరణించారు. విదేశీయులు ఎక్కువగా సందర్శిస్తూ ఉండే ఆ గెస్ట్‌హౌస్‌లోనే భారత రాయబారి కూడా ఉండి ఉంటారన్న అనుమానంతోనే తాలిబన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో (అఫ్ఘాన్ కాలమానం) ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సమాచారం అందిన కొద్దిసేపటికే అఫ్ఘాన్ జాతీయ భద్రతాదళం, ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగులపై కాల్పులు జరిపి, గెస్ట్‌హౌస్‌లో బందీలుగా ఉన్నవారిని విడిపించే ప్రయత్నం చేశారు. దాడిలో నలుగురు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం ఎంతమంది మరణించారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. తొలుత మొత్తం 9 మంది మరణించారని, వారిలో ఇద్దరు భారతీయులున్నారని అన్నారు. కానీ తర్వాత మృతుల్లో భారతీయుల సంఖ్య నాలుగని తేలింది. -
'పెషావర్' చిన్నారులకు అంత్యక్రియలు
పెషావర్ : పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 132 మంది చిన్నారులతో సహా మొత్తం 141 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పెషావర్ దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ .... షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేపట్టిన పోరులో మీకు తోడుగా ఉంటామని మోదీ.. షరీఫ్‌కు భరోసా ఇచ్చారు. -
పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ
పెషావర్‌లోని పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్లు చేశారు. ఇది ఏమాత్రం ఆలోచన లేని, అసలు మాట్లాడేందుకు కూడా వీల్లేనంత దారుణమైన దాడి అని, అమాయకులైన చిన్న పిల్లల ప్రాణాలను వాళ్లు తీసేశారని మోదీ చెప్పారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులను చిదిమేయడం దారుణమన్నారు. తమ సంబంధీకులను కోల్పోయిన ప్రతి ఒక్కరికి మోదీ తన మనఃపూర్వక సంతాపం తెలిపారు. వారి బాధను తానూ పంచుకుంటున్నానని, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు.