ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతంలోని సెరినా హోటల్లో తీవ్రవాదులు తుపాకితో గతరాత్రి స్వైర విహారం చేశారు. తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఎనిమిది మంది మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు,ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహరాల శాఖ మంత్రి శుక్రవారం ఉదయం వెల్లడించారు.
వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆ ఘాతుకానికి ఒడిగట్టిన నలుగురు యువ తాలిబన్లను హతమార్చారని తెలిపారు. ఆ దాడి జరిగిన సమయంలో ఆఫ్ఘాన్లోని భారతీయ ఉన్నతాధికారులు అదే హోటల్లో ఉన్నారని అయితే వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు.