తాలిబన్‌ దాడి..12 మంది మృతి | 12 Killed In Afghan Taliban Attack | Sakshi
Sakshi News home page

తాలిబన్‌ దాడి..12 మంది మృతి

Published Thu, Apr 12 2018 12:01 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

 12 Killed In Afghan Taliban Attack  - Sakshi

ఘటన జరిగిన ప్రాంతం

కాబూల్‌ : తాలిబన్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ జిల్లా గవర్నర్‌తో పాటు మరో 11 మంది చనిపోయారు. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్‌లోని గజిని ప్రావిన్స్‌లో గురువారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగింది. ఖవాజా ఒమరి జిల్లాలోని చెక్‌పోస్టుపై తాలిబన్‌ ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సుమారు 4 గంటల పాటు కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తాలిబన్‌ ఉగ్రవాదులు ప్రకటన జారీ చేశారు. అలాగే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement