Blast Hits in a Shiite Muslim Mosque in Northern Afghanistan - Sakshi
Sakshi News home page

ఆప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. పదుల సంఖ‍్యలో మరణాలు

Published Thu, Apr 21 2022 3:52 PM | Last Updated on Thu, Apr 21 2022 5:05 PM

Bomb Blast In Northen Afghanistan Mosque - Sakshi

కాబూల్‌: వరుస బాంబు పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్‌ అతలాకుతలం అవుతోంది. దేశ రాజధాని కాబూల్ సహా మరో ఐదు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాగా, ఓ ప్రార్థనా మందిరంలో భారీ పేలుడు సంభవించడంతో 18 మంది మృతి చెందినట్టు సమాచారం. 20 మందికి పైగా సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

దీంతో క్షతగాత్రులను స్థానికంగా ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన‍్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాలిబన్లు అలర్ట్‌ అయ్యారు.
ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా విక్టరీ.. పుతిన్‌ రెస్పాన్స్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement