bomb blast in mosque
-
మానవ బాంబు విధ్వంసం.. 50 మంది దుర్మరణం
బాంబు దాడులతో అప్ఘనిస్తాన్ అట్టుకుడుతోంది. తాజాగా అప్ఘన్ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు. మరో వందమంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని అప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. కాగా, రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదులో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. నమాజ్ ముగుస్తుందన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మసీదులో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే కనిపించారని స్థానికులు తెలిపారు. అప్పటికే ప్రార్ధన చేస్తున్నవారిలో కలిసిపోయిన మానవబాంబు తనను తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు. కాగా, ఈ మానవ బాంబుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. గతవారం మజర్ ఈ షెరీఫ్ పట్టణంలోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌కు స్పీడుగా సహాయం -
ఆప్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: వరుస బాంబు పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్ అతలాకుతలం అవుతోంది. దేశ రాజధాని కాబూల్ సహా మరో ఐదు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాగా, ఓ ప్రార్థనా మందిరంలో భారీ పేలుడు సంభవించడంతో 18 మంది మృతి చెందినట్టు సమాచారం. 20 మందికి పైగా సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను స్థానికంగా ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాలిబన్లు అలర్ట్ అయ్యారు. ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా విక్టరీ.. పుతిన్ రెస్పాన్స్ ఇదే.. -
అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
జలాలాబాద్: శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మసీదులో జరిగిన ఒక భారీ పేలుడులో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్ రాష్ట్రంలో, జలాలాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలోని హస్కమినలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మసీదు పై కప్పు కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్నారు. 36 మంది గాయపడ్డారని, వారిని జలాలాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, తూర్పుఅఫ్గానిస్తాన్‌లో తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రసంస్థలు చురుకుగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందంటూ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసిన మర్నాడే ఈ దాడి జరిగింది. ఈ జూలైలో గతమెన్నడూ లేనంత హింస చోటు చేసుకుందని, ఐరాస గణాంకాలు సేకరించడం ప్రారంభించిన తరువాత, ఒక నెలలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక సంఖ్యలో పౌరులు మరణించడం ఈ జూలైలోనేనని ఐరాస ఆ నివేదికలో పేర్కొంది. -
మసీదులో బాంబు పేలుడు; 28 మంది మృతి
కాబూల్ : ప్రార్ధనలకు వెళ్లేవారే లక్ష్యంగా శుక్రవారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్ హస్కా మినా జిల్లాలోని ఓ మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కుప్పకూలిపోయింది. తాలిబన్, ఐసిస్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటనకు బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు. మృత దేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా, 32 మంది మృత్యువాత పడగా, 50 మంది క్షతగాత్రులు ఉన్నారని ఆసుపత్రి వైద్యుడు ఒకరు వెల్లడించారు. అయితే అధికారికంగా 28 మంది మృతిచెందినట్లు నంగార్ హర్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి అతుల్లా ఖొయానీ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. కాగా, జులై - సెప్టెంబర్ మాసాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల సంఖ్య పెరిగిందని ఐక్యరాజ్యసమితి గురువారం ప్రకటించింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాంబు దాడుల సంఖ్య 42 శాతం పెరిగిందని ఆ ప్రకటనలో ఉంది. ఈ దాడులను ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి టాడామిచి యమామోటో ఖండించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, పౌరుల ప్రాణాలు తీయడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
కువైట్ మసీదులో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
గల్ఫ్ దేశం కువైట్ రాజధాని కువైట్ నగరంలోని ఓ షియా మసీదులో ప్రధానమైన ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. దాంతో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రంజాన్ మాసంలోని శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడని భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ చెబుతోంది. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలోనే ఈ ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదులోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అల్-ఇమామ్-అల్-సదీక్ మసీదులో ఈ దాడి జరిగింది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా, యెమెన్ దేశాల్లో ఇలాంటి దాడులే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇంతకుముందు తెలిపింది.