
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది.
ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment