Indian pharma company
-
'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO అలర్ట్
భారత్‌లో తయారై.. ఇరాక్‌లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్‌లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్‌పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్‌లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్‌లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్‌లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్‌బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్‌వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్‌వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్‌లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది. సిరప్ ఫలితాలపై ఇరాక్ ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇరాక్‌లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్‌లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు. గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్‌లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్‌లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో -
WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు
జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్‌లో ఆందోళనలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది. ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
ప్రపంచమంతా పంపిణీ చేయగలదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసి పంపిణీ చేయగల సత్తా భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా టీకాకు సంబంధించి భారత్‌లో ఎన్నో కీలక ఘట్టాలు పూర్తయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా ఫార్మా ఇండస్ట్రీకి ఉందని ఆయన కొనియాడారు. ‘కోవిడ్–19: వైరస్‌పై భారత్ యుద్ధం’పేరుతో గురువారం డిస్కవరీ ప్లస్ చానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీలో గేట్స్ మాట్లాడారు. అతి పెద్ద దేశం, కిక్కిరిసిన జనాభా, పట్టణాల్లో జనసాంద్రత వంటి అంశాల వల్ల కరోనా వైరస్‌తో భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. టీకాల తయారీలో భారత్‌కు మించిన దేశం లేదన్నారు. సీరం వంటి అతి పెద్ద సంస్థలు సహా ఎన్నో ఫార్మా కంపెనీల సహకారంతో ప్రపంచ దేశాలకు టీకాలను పంపిణీ చేయగలదని గేట్స్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. వివిధ రకాల పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బిహార్లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గేట్స్ వివరించారు. -
ఫలితాల్లో సిప్లా సూపర్
ముంబై : దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేసి మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 43.7 శాతం పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.375 కోట్లగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.261 కోట్లు మాత్రమే. కంపెనీ కేవలం రూ.370 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా కంపెనీ నికర అమ్మకాలు కూడా రూ.3550.02 కోట్లకు పెరిగినట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3069.89 కోట్లగా ఉన్నాయి. కంపెనీ ఆర్జించిన ఇతర ఆదాయాలతో లాభాలు పెరిగాయి. దేశంలో ఐదవ అతిపెద్ద డ్రగ్ మేకర్‌గా ఉన్న సిప్లాకు ఎక్కువ రెవెన్యూలు భారత్ నుంచే వచ్చాయి. ఈ కంపెనీ అమెరికా, యూకేలో కూడా తన ఉనికిని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
చౌక ధరల్లో ఔషధాలు అందించాలి..
రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ న్యూఢిల్లీ: ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరల్లో అందించాలని భారత ఫార్మా కంపెనీలకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ సూచించారు. ఫార్మా రంగంలో విధానాలను, నిబంధనాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. బల్క్‌డ్రగ్‌ల దిగుమతులపై చైనాపై అధికంగా ఆధారపడుతున్నామని, ప్రభుత్వం దీనికి పరిష్కారం అన్వేషిస్తుందని పేర్కొన్నారు. దేశీయంగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తిని చేపట్టే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తికి అనువైన వాతావరణాన్ని భారత్ సృష్టించుకోవలసిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ వి.కె. సుబ్బురాజ్ చెప్పారు.ఆర్ఐఎస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఫార్మా రంగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. కానీ బల్క్‌డ్రగ్స్, మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైననే అధికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. బల్క్‌డ్రగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించారు.