ఫలితాల్లో సిప్లా సూపర్
ఫలితాల్లో సిప్లా సూపర్
Published Wed, Feb 8 2017 6:09 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ముంబై : దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేసి మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 43.7 శాతం పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.375 కోట్లగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.261 కోట్లు మాత్రమే. కంపెనీ కేవలం రూ.370 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేశారు.
అదేవిధంగా కంపెనీ నికర అమ్మకాలు కూడా రూ.3550.02 కోట్లకు పెరిగినట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3069.89 కోట్లగా ఉన్నాయి. కంపెనీ ఆర్జించిన ఇతర ఆదాయాలతో లాభాలు పెరిగాయి. దేశంలో ఐదవ అతిపెద్ద డ్రగ్ మేకర్గా ఉన్న సిప్లాకు ఎక్కువ రెవెన్యూలు భారత్ నుంచే వచ్చాయి. ఈ కంపెనీ అమెరికా, యూకేలో కూడా తన ఉనికిని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Advertisement
Advertisement