Cipla
-
అంచనాలను అందుకున్న సిప్లా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్‌లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమంగ్ వోహ్రా మాట్లాడారు. యూఎస్ మార్కెట్లో వివిధ పోర్ట్‌ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది. కలిసొచ్చిన లెనలిడోమైడ్ ముఖ్యంగా లెనలిడోమైడ్ డ్రగ్‌ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది. -
మోల్నుపిరావిర్ వైరస్‌ను ఏమార్చి, హతమారుస్తుంది.. ఇంతకూ ఆ పేరెలా వచ్చింది?
కల్లోల కరోనా సోకకుండా టీకాలు చాలావరకు అడ్డుకుంటాయి. కానీ కరోనా సోకిన వారికి నిర్ధిష్టమైన వైద్యం పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఔషధాల కాంబినేషన్లను, యాంటీ వైరల్ మందులను వాడి కరోనా రోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా సోకిన వారి చికిత్స కోసం ఫైజర్, మెర్క్ సంస్థలు మాత్రలు తయారుచేశాయి. మెర్క్ తయారీ మోల్నుపిరావిర్ మాత్ర (‘EIDD 2801’’) కు భారత్‌లో తాజాగా అనుమతులు లభించాయి. కరోనాకు కళ్లెం వేయడంలో ఇది ఉపయోగపడుతుందని, కరోనా వల్ల ఆస్పత్రి పాలవకుండా చాలావరకు కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. భారత్‌లో దీన్ని సిప్లా తదితర సంస్థలతో కూడిన కన్సార్టియం వేర్వేరు పేర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కొత్త మాత్ర కథా కమామీషు చూద్దాం.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు? కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి దీన్ని వాడే వీలు లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఇవి బాగా ముదిరి మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్న(హైరిస్కు) వ్యక్తులకు మాత్రమే డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు వృద్దులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే వీటిని సిఫార్సు చేస్తారు. ఇక 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ మందు వాడకూడదు. ఇది వారిలో ఎముకల వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులకు కూడా దీన్ని సిఫార్సు చేయరు. వీరికి ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిపాలై చికిత్స పొందేవారికి దీని వాడకం కూడదు. ఎప్పుడు ఆరంభించాలి? కరోనా పాజిటివ్ వచ్చాక లక్షణాలు బయటపడుతున్న ఐదురోజుల్లోపు దీని వాడకం ఆరంభించాలి. దగ్గు, తలనొప్పి, జ్వరం, వాసన లేకపోవడం, నొప్పుల్లాంటి సంకేతాలు కరోనా తొలిరోజుల్లో ఉంటాయి. ఈ దశలోనే వీటని డాక్టర్ సిఫార్సుతో వాడాల్సి ఉంటుంది. ఎంత డోసేజ్? ఈ మాత్రలు 200 ఎంజీ రూపంలో లభిస్తాయి. ప్రతి 12 గంటలకు ఒకసారి నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు తీసుకోవడంతో కోర్సు పూర్తవుతుంది. అంటే మొత్తం కోర్సులో 40 క్యాప్సుల్స్ (ఐదు రోజులు– రోజుకు 8 మాత్రలు) వాడాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజులకు మించి దీన్ని వాడకూడదని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సహా దాదాపు అన్ని కోవిడ్ వేరియంట్లపై ఇది ప్రభావం చూపగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నాయి? కరోనా లక్షణాలు బయటపడ్డవారు (ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోనివారు) ఆస్పత్రి పాలయ్యే రిస్కును, చనిపోయే ప్రమాదాన్ని ఈ మందు వాడకంతో దాదాపు 30– 50 శాతం తగ్గించవచ్చని క్లినికల్ డేటా ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీన్ని కేవలం కరోనా సోకిన తర్వాత మాత్రమే వాడాలని, టీకాలకు బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుందని భావించవద్దని నిపుణుల హెచ్చరిక. ప్రతికూలతలు ఈ మాత్ర వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడంపై పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమీ మ్యాజిక్ పిల్ కాదని, దీనివల్ల జరిగే మేలు పరిమితమని ప్రొఫెసర్ విలియం షాఫ్నర్ హెచ్చరించారు. దీని వాడకం వల్ల కొన్నిసార్లు డయేరియా, వికారం, వాంతులు, తలతిరగడం వంటి ప్రతికూలతలు కనిపించవచ్చు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో దీన్ని 18 ఏళ్లు లోపువారికి, గర్భిణులకు, ఆస్పత్రిపాలైనవారికి వాడకూడదు. ఈ ఔషధానికి వైరస్ కణాల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఈ శక్తి మానవ కణాలపై కూడా చూపే ప్రమాదం ఉందని, దీనివల్ల మానవ కణాల్లో అనవసర మార్పులు వచ్చి క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాల్లేవు. ఏ దేశాల్లో అనుమతించారు? ఇప్పటివరకు ఈ ఔషధానికి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత్‌లో అనుమతి లభించింది. ధ్వంస రచన... ► ఉత్పరివర్తనాల్లో ఈ మందు కలగజేసే మార్పులతో వైరస్‌లోని మొత్తం మ్యుటేషన్ ప్రక్రియ తప్పులతడకగా మారడాన్ని ‘‘ఎర్రర్ కెటాస్ట్రోఫ్’’ లేదా ‘‘లీథల్ మ్యుటాజెనిసిస్’’ అంటా రు. ఈ విధ్వంసం కారణంగా అతిధేయి శరీరంలో వైరల్ లోడు క్రమంగా తగ్గిపోతుంది. ► సాధారణంగా రెమిడెసివిర్ లాంటి యాంటీ వైరల్ మందులు సదరు వైరస్‌లో పత్రికృతి (రిప్లికేషన్) ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నివారిస్తాయి. టీకాలు అతిధేయి శరీరంలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పెంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకుంటాయి. వీటితో పోలిస్తే మోల్నుపిరావిర్ పనిచేసే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ► ఇది వైరస్ రిప్లికేషన్ ప్రక్రియలో అవసరపడే ఎంజైములను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో వైరస్ కణాల్లో తప్పుడు ఉత్పరివర్తనాలు ఆరంభమవుతాయి. వీటివల్ల రోగి శరీరంలో వైరస్ సంఖ్య పెరగడం ఆగిపోతుంది, ప్రతికృతి చెందిన వైరస్లు బతికినా అవి బలహీనంగా ఉండి వెంటనే నశించిపోవడం జరుగుతుంది. ► సింపుల్‌గా చెప్పాలంటే ఒక యంత్రంలో కీలక భాగాన్ని మారిస్తే దాని పనితీరు పూర్తిగా ధ్వం సమైనట్లే ఈ ఔషధం వైరస్‌పై పనిచేస్తుంది. ► శాస్త్రీయ భాషలో చెప్పుకుంటే ఈ ఔషధం వైరస్‌లోని ఆర్‌డీఆర్‌ఏ (ఆర్ఎన్ఏ డైరెక్టెడ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్) ఎంజైమ్‌ను ప్రేరేపించి వైరల్ ఆర్ఎన్ఏలో పలు తప్పుడు మ్యుటేషన్లను కలిగిస్తుంది. ► ఆర్ఎన్ఏ నిర్మాణంలో అడినైన్, గ్వానైన్, యురాసిల్ (యురిడిన్), సైటోసిన్ అవసరమవుతాయి. వీటిని ఆర్ఎన్ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ► మోల్న్యుపిరావిర్కు ఈ బిల్డింగ్ బ్లాక్స్‌లోని సైటిడిన్ (ఎన్‌హెచ్‌సీ– టీపీ) లేదా యురిడిన్ లాగా కనిపించే శక్తి ఉంది. దీంతో ఆర్‌డీఆర్‌ఏ ఎంజైమ్ దీన్ని వైరస్ ఆర్ఎన్ఏలో నిజమైన సైటిడిన్ లేదా యురిడిన్ బదులు ప్రవేశపెడుతుంది. ► వైరస్ రిప్లికేషన్‌ను ప్రూఫ్ రీడింగ్ చేసే ఎక్సో న్యూక్లియేజ్ ఎంజైమ్‌లు కూడా ఈ తప్పును గ్రహించలేవు. దీంతో నిజమైన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న ఆర్ఎన్ఏ బదులు మోల్నుపిరావిర్ ఉన్న ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. ► ఇలా మారిన ఆర్ఎన్ఏ పలు తప్పుడు ఉత్పరివర్తనాలకు కారణమై పైన చెప్పుకున్న ఎర్రర్ కెటాస్ట్రోఫ్కు దారి తీస్తుంది. ఆ పేరే ఎందుకంటే.. అవెంజర్స్ సినిమాలు చూసినవారికి అందులో థోర్ పాత్ర, ఆ హీరో చేతిలోని శక్తులున్న ఆయుధం.. సుత్తి గుర్తుండే ఉంటాయి. ఈ సుత్తికి మొల్నిర్ అని పేరు. అలాగే యాంటీ వైరల్ మందులకు చివర ‘అవిర్’ అంత్య ప్రత్యయం (సఫిక్స్) పెడతారు. కోవిడ్ వేరియంట్లపై థోర్ ఆయుధం లాగా విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో కొత్త మాత్రకు మోల్నుపిరావిర్ అని పేరు పెట్టినట్లు మెర్క్ కంపెనీ ఆర్ అండ్ డి అధిపతి డీన్ లీ చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గుడ్‌న్యూస్: మోడర్నాకు గ్రీన్ సిగ్నల్, 90 శాతం సమర్థత
-
గుడ్‌న్యూస్: మోడెర్నా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి పరిమితం చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ మోడెర్నా దిగుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ముంబైకి చెందిన సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిïÙల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్ వ్యాక్సిన్ల తర్వాత త్వరలో మోడెర్నా ప్రజలకు అందుబాటులోకి రానుంది. మోడెర్నా వ్యాక్సిన్ భారతీయ భాగస్వామి సిప్లా ఇచి్చన దరఖాస్తును పరిశీలించి అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను వాడేలా డీసీజీఐ నిర్ణయం తీసుకుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ మంగళవారం తెలిపారు. ఈ వ్యాక్సిన్ త్వరలోనే దిగుమతి అవుతుందన్నారు. దీంతోపాటు, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను కూడా దేశంలోకి ఆహా్వనించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వం తన కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ద్వారా భారతదేశానికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించిందన్న విషయాన్ని మోడెర్నా సంస్థ జూన్ 27న డీసీజీఐకి తెలిపింది. ఈ విషయంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతి కోరింది. కాగా, సోమవారం అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ తరపున వ్యాక్సిన్ల దిగుమతి, మార్కెటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని సిప్లా సంస్థ కోరింది. అయితే మోడెర్నాకు ఇచ్చే అనుమతి అత్యవసర పరిస్థితులలో పరిమిత ఉపయోగం కోసం ఉద్దేశించిందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతానికి, యూఎస్ ఎఫ్‌డీఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ లేదా డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు సీడీఎల్ వద్ద బ్యాచ్‌ల వారీ పరీక్షను మినహాయించాలని డీసీజీఐ నిర్ణయించింది. చదవండి : Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
కోవిడ్ యాంటీబాడీ కాక్టెయిల్ వచ్చేసింది
న్యూఢిల్లీ : కోవిడ్ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే యాంటీబాటీ కాక్టెయిల్ ఔషధాలు త్వరలో ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తుండగా తాజాగా ఇండియాలోను అనుమతులు వచ్చాయి. ఇటీవల ఈ యాంటిబాడీ కాక్టెయిల్కి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఒక డోసులో 600 మిల్లీ గ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీ గ్రాముల ఇమ్డెవిమాబ్ మెడిసన్స్ ఉంటాయి. 12 ఏళ్లుపై బడిన వారికే యాంటిబాటీ కాక్టెయిల్ కిట్ మందులు 12 ఏళ్ల పైబడి 40 కిలోల మించి బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అదే విధంగా మందులు ఉపయోగించే సమయానికి రోగిలలో ఆక్సిజన్ లెవల్స్ 90 శాతానికి పైగా ఉండాలని యాంటీబాడీస్ కాక్టెయిల్ను అందిస్తోన్న రోచే ఫార్మసీ సంస్థ సూచిస్తోంది. ఈ కిట్ ఉపయోగించిన వారిలో 70 శాతంత మంది నాలుగు రోజుల్లో కోలుకున్నారని ఆ సంస్థ చెబుతోంది. రోచే సంస్థ రూపొందించిన ఈ ఔషధాలను సిప్లా సంస్థ ఇండియాలో పంపిణీ చేస్తోంది. ఒక డోసు ఖరీదు రూ. 59,750 యాంటీబాడీ కాక్టైల్ ఇండియాలో సానుకూల ఫలితాలు ఇస్తుందనే నమ్మకం ఉందంటోంది రోచే ఫార్మసీ సంస్థ. రోగిలో వ్యాధి ముదరకుండా తమ ఔషధం అడ్డుకుంటుందన్నారు. అంతేకాదు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే రోగు కోలుకునే అవకాశం మెరుగవుతుందన్నారు. కోవిడ్ చికిత్సలో భాగంగా ఒక్కో పేషెంట్ ఒక డోసు మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కో డోస్ ఖరీదును రూ 59,750 రూపాయలుగా నిర్ణయించారు. ఇద్దరు రోగులకు సరిపడా ఔషధాలు ఉన్న కిట్‌ని రూ.1,19,500లకి అందిస్తున్నారు. హైరిస్క్ తప్పిస్తుంది కరోనా సెకండ్ వేవ్‌లో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలతో బాధపడుతున్న రోగుల్లో ఉన్నట్టుండి పరిస్థితి విషమిస్తోంది. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లడం, చికిత్స అందివ్వడం కష్టంగా మారింది. స్వల్ప మధ్యస్థాయి లక్షణాలు ఉన్నప్పుడే ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాలను ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. దీంతో హై రిస్క్ నుంచి బయటపడే వీలుందని వైద్య నిపుణులు అంటున్నారు. -
అడ్వాన్స్డ్ ఎంజైమ్- సిప్లా.. భళిరా భళి
ట్రేడర్ల షార్ట్ కవరింగ్, వరుస నష్టాల కారణంగా దిగివచ్చిన బ్లూచిప్స్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్‌చేసి 37,150ను అధిగమించగా.. నిఫ్టీ 185 పాయింట్లు ఎగసి 10,990 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ దాదాపు 4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఓపెన్ మార్కెట్ ద్వారా నలందా ఇండియా ఈక్విటీ ఫండ్ 3.75 శాతం వాటాకు సమానమైన అడ్వాన్స్డ్ ఎంజైమ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డేటా వెల్లడించింది. షేరుకి రూ. 263.80 ధరలో అడ్వాన్స్డ్ ఎంజైమ్‌కు చెందిన 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను నలందా కొనుగోలు చేసింది. ఇందుకు నలందా ఇండియా రూ. 111 కోట్లు వెచ్చించింది. దీంతో అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 317ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 303 వద్ద ట్రేడవుతోంది. సిప్లా లిమిటెడ్ మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సిప్లా లిమిటెడ్ వెల్లడించింది. ఇది బయోజెన్స్ టెక్‌ఫిడెరా ఔషధానికి జనరిక్ వెర్షన్‌గా పేర్కొంది. డైమెథల్ ఫ్యూమరేట్ డీఆర్ క్యాప్సూల్స్‌గా పిలిచే వీటిని 120 ఎంజీ, 240 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధానికి 3.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 28,000 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 765 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 773 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 819కు చేరువకావడం గమనార్హం! -
సిప్లా- తేజస్ నెట్వర్క్స్ .. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం సిప్లా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజస్ నెట్వర్క్స్ వెల్లడించింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. సిప్లా లిమిటెడ్ షేరు 52 వారాల గరిష్టానికి చేరగా.. తేజస్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిప్లా నికర లాభం 27 శాతం పెరిగి రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం బలపడి రూ. 4346 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. దేశీ బిజినెస్ 10 శాతం వృద్ధితో రూ. 1608 కోట్లకు చేరినట్లు సిప్లా పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు మరింత అధికంగా 64 శాతం జంప్‌చేసి రూ. 457 కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లింది. రూ. 793కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం కాగా.. గత 6 నెలల్లో ఈ షేరు 74 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. తేజస్ నెట్వర్క్స్ మౌలిక సదుపాయాల దిగ్గజం ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ నుంచి GPON ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొడక్టుల సరఫరా కోసం ఆర్డర్ లభించినట్లు తేజస్ నెట్వర్క్స్ తాజాగా పేర్కొంది. రూ. 66 కోట్ల విలువైన ఈ ఆర్డర్లో భాగంగా గరిష్ట పనితీరు చూపగల మెట్రో ఇథర్నెట్ స్విచెస్‌ను సైతం సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో తేజస్ నెట్వర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 64 సమీపంలో ఫ్రీజయ్యింది. -
కోవిడ్-19 : మార్కెట్లోకి సిప్లా ఔషధం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్‌ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ సిప్లా త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుందని శాస్ర్తీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్ఐఆర్ ఈ మందును అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే కెమికల్స్‌తో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్ఐఆర్ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది. ఈ మందు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని సీఎస్ఐఆర్ పేర్కొంది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్దవంతంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే డ్రగ్ తయారీదారులు పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైనదని సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడి స్వల్ప, మధ్యస్థ లక్షణాతో బాధపడే రోగుల చికిత్సలో ఫవిపిరవిర్ మంచి ఫలితాలను అందిస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. చదవండి : పెళ్లింట కరోనా కలకలం.. -
సిప్లా- ఆర్ఐఎల్.. రికార్డుల హోరు
సెంటిమెంటు బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా జంప్ చేసింది. 35,211ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 158 పాయింట్లు బలపడి 35,890 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ప్రయోగాత్మక ఔషధం రెమ్డిసివిర్ తయారీ, విక్రయాలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ నుంచి అనుమతి లభించినట్లు సిప్లా లిమిటెడ్ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 692ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 665 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందించిన రెమ్‌డెసివిర్‌కు జనరిక్ ఔషధ తయారీ, విక్రయాలకు అనుమతి లభించినట్లు సిప్లా పేర్కొంది. సెప్రెమీ పేరుతో ఈ ఔషధాన్ని అత్యవసర ప్రాతిపదికన మాత్రమే వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. అమెరికాలో కరోనా వైరస్ సోకిన రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అనుమతిని గిలియడ్ పొందింది. ఈ ఔషధానికి గిలియడ్ నుంచి నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్స్‌ను సిప్లా గత నెలలోనే సంపాదించిన విషయం విదితమే. రిలయన్స్ జోరు డిజిటల్, టెలికం అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ సంస్థలపెట్టుబడులు వెల్లువెత్తిన నేపథ్యంలో జోరందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత 2.6 శాతం ఎగసి రూ. 1804ను అధిగమించింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ప్రస్తుతం 0.5 శాతం లాభంతో రూ. 1768 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ షేరు 104 శాతం దూసుకెళ్లింది. మార్చి 23న ఈ షేరు రూ. 884 వద్ద కనిష్టానికి చేరాక ర్యాలీ బాట పట్టింది. గత మూడు రోజుల్లోనే ఆర్ఐఎల్ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. తద్వారా తాజాగా రూ. 11 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీ 150 బిలియన్ డాలర్ల విలువను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం! -
కరోనా: ఎమర్జెన్సీ డ్రగ్‌కు భారత్ అంగీకారం
న్యూఢిల్లీ: మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని కరోనాను నివారించడం ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు కోవిడ్‌ను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారు చేయడంలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కరోనా రోగులకు అత్యవసర పరిస్థితిలో రెమ్డిసివిర్ ఔషధాన్ని వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. "ఎమర్జెన్సీ సమయాల్లో ఈ ఔషధాన్ని వినియోగించేందుకు జూన్ 1న అనుమతులిచ్చాం. అయితే ఐదు డోసులు మాత్రమే ఇవ్వాలి" అని డ్రగ్స్ కంట్రోలర్ జెనరల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ మందు మొదటి క్లినికల్ ట్రయల్స్‌లోనే కోవిడ్ పేషెంట్లపై మెరుగైన ప్రభావం చూపినట్లు తేలింది. దీంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీని వినియోగానికి గత నెలలోనే ఆమోదం తెలిపింది. (విస్తృత ప్రయోగ దశకు కరోనా టీకా) అయితే అత్యవసర సమయంలోనే దీన్ని వినియోగించాలని పేర్కొంది. అటు జపాన్ ప్రభుత్వం కూడా అత్యవసర ప్రాతిపదికన కోవిడ్-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగిస్తోంది. యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్‌తో నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాలను చేసుకుంది. ఫలితంగా ఈ కంపెనీలు రెమ్డిసివిర్ను దేశీయంగా తయారు చేసి అందుబాటులోకి తేనుంది. ఇదిలా వుండగా మంగళవారం నాటికి దేశంలో 1,98,706 కరోనా కేసులు నమోదయ్యాయి. (దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్ ఔషధం!) -
దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్ ఔషధం!
అమెరికాలో కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశీయంగా విక్రయించేందుకు అనుమతించమంటూ విదేశీ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తాజాగా దరఖాస్తు చేసుకుంది. ఈ ఔషధంపై క్లినికల్ పరీక్షలు పూర్తికాకపోయినప్పటికీ అత్యవసర ప్రాతిపదికన(ఈయూఏ) యూఎస్ఎఫ్డీఏ అనుమతించింది. ఈ బాటలో దేశీయంగానూ రెమ్‌డెసివిర్ ఔషధ మార్కెటింగ్‌కు అనుమతించమంటూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)కు తాజాగా గిలియడ్ సైన్సెస్ దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై నిపుణుల కమిటీ సూచనలమేరకు సీడీఎస్‌సీవో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఔషధంపై ప్రీక్లినికల్, క్లినికల్ పరీక్షల డేటాను గిలియడ్ సైన్సెస్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 7న జపనీస్ ఆరోగ్య శాఖ సైతం అత్యవసర ప్రాతిపదికన కోవిడ్-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగించేందుకు అనుమతించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. దేశీ కంపెనీలు యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్‌తో నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాలను చేసుకుంది. ఫలితంగా సిప్లా, హెటెరో ల్యాబ్స్ ఇప్పటికే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని దేశీయంగా తయారు చేసి విక్రయించేందుకు అనుమతించమంటూ దేశీ ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేశాయి. కోవిడ్-19 రోగులకు వెంటనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వవలసి ఉన్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే ఈ ఔషధాన్ని వినియోగించేందుకు అనుమతించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి చికిత్సకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించడం ద్వారా ప్రయోజనం కలుగుతున్నట్లు న్యూఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. అయితే దేశీయంగా క్లినికల్ పరీక్షలు ముగించుకున్నాక మాత్రమే ఔషధాలకు అనుమతి లభిస్తుందని విశ్లేషకులు తెలియజేశారు. పలు దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తాయని, ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురుకావడంతో యూఎస్ఎఫ్డీఏ తాత్కాలిక ప్రాతిపదికన కొంతమేర సడలింపులను ఇచ్చినట్లు వివరించారు. -
కరోనా : కీలక అనుమతిని సాధించిన సిప్లా
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ ఫార్మా దిగ్గజం సిప్లా కీలక అనుమతిని సాధించింది. ఉబ్బసం వ్యాధి నివారణకు ఎక్కువగా ఉపయోగపడే ఇన్హేలర్ మందునకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని సాధించింది. సిప్లా సంస్థ తొలి జనరిక్ మందు ప్రోవెంటిల్ హెచ్ఎఫ్ఎ (అల్బుటెరోల్ సల్ఫేట్) 90ఎంసీజీకు ఈ అనుమతి లభించింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించి మొట్ట మొదటి అనుమతిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిచిన వ్యాధులకు ఈ మందునకు ప్రాచుర్యం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. తమ నిబద్ధతను తాజా అనుమతి పునరుద్ధాటిస్తుందనీ, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను విస్తరించడం కొనసాగిస్తామని సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమాంగ్ వోహ్రా అన్నారు. అంతేకాదు రవాణాలు నిలిచిపోయిన ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈ మందును కొంత మేర ఉచితంగా పంపిణీ చేయాలని యోచిస్తున్నామని కూడా చెప్పారు. ఉబ్బసం వ్యాధి నివారణ కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రోవెంటిల్ హెచ్ఎఫ్ఎ ఇన్ హేలర్‌ను రివర్సిబుల్ అబ్ స్ట్రక్టివ్ ఎయిర్‌వే వ్యాధి ఉన్న నాలుగు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న రోగులలో బ్రోంకోస్పాస్మ్ చికిత్స లేదా నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి శరవేగంగా విస్తురిస్తున్న సమయంలో అల్బుటెరోల్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌ను ఎఫ్ డీఏ గుర్తించిందని సంస్థ కమిషనర్ స్టీఫెన్ ఎం హాన్ వెల్లడించారు. ఫిబ్రవరి 24 న పెరిగో ఫార్మా తయారు చేసిన ప్రోఅయిర్ హెచ్ఎఫ్ఎ జెనరిక్‌కు ఆమోదం తెలిపింది ఎఫ్‌డిఎ ఇటీవలి నెలల్లో ఆమోదించిన రెండవ జెనెరిక్ అల్బుటెరోల్ సల్ఫేట్ ఇది. ఫిబ్రవరి 2020 తో ముగిసిన 12 నెలల కాలానికి ప్రోవెంటిల్ హెచ్ ఎఫ్ఏ అమ్మకాలు సుమారు 153 మిలియన్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ సహా సౌత్ ఆఫ్రికా , అమెరికా ముఖ్య కేంద్రాలుగా 80 కి పైగా దేశాల్లో 1500 వైద్య పరికరాలను, ఔషదాలను అందిస్తున్న సంస్థ సిప్లా. దీంతో గురువారం నాటి మార్కెట్లో సిప్లా షేరు భారీగా లాభపడుతోంది. (అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్) -
ఫార్మా జోరు, లుపిన్, సిప్లా లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజాలు గురువారం నాటి నష్టాల మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. ఫార్మా రంగ కంపెనీలకు అవకాశాలు పెరగనున్న అంచనాల దీంతో దేశీ ఫార్మా రంగ దిగ్గజాలు లుపిన్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్ కౌంటర్లు తాజాగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోగల ప్లాంటుకి యూఎస్ఎఫ్డీఏ నుంచి లోపాలులేని గుర్తింపు ఈఐఆర్ లభించినట్లు తాజాగా వెల్లడించింది. ఈ యూనిట్లో ఫిబ్రవరి 10-14 మధ్య యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. తద్వారా ఎలాంటి లోపాలూ బయటపడకపోవడంతో ఈఐఆర్ అందుకున్నట్లు లుపిన్ ఎండీ నీలేష్ గుప్తా తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాల ప్రయాణంలో తమకు మరో ముందడుగు అని గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో లుపిన్ షేరు 10.3 శాతం దూసుకెళ్లి రూ. 639 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 666 వరకూ ఎగసింది. ఆస్త్మా, తదితర ఊపిరి తిత్తుల వ్యాధుల చికిత్సలో వినియోగించగల ఔషధం మూడో దశ క్లినికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్లు హెల్త్‌కేర్ దిగ్గజం సిప్లా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఫ్లుటికసోన్ ప్రపోర్షనేట్ జనరిక్‌తోపాటు.. సాల్మెటరోల్ ఇన్హేలేషన్ పౌడర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధం అడవిర్ డిస్కస్ 110/50 ఎంసీజీకు సరిసమానంగా పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఈ ఔషధానికి అమెరికాలో వార్షికంగా దాదాపు 3 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సిప్లా షేరు దాదాపు 8 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 448 వరకూ ఎగసింది. కాగా ఆరంభం నుంచి నష్టాల మధ్య కొనసాగుతున్న కీలక సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.సెన్సెక్స్ ప్రస్తుతం 609 పాయింట్లు క్షీణించి 27663 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 8100 వద్ద కొనసాగుతోంది. -
కోవిడ్ కట్టడికి తలో చెయ్యి!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్ దేశాలు, భారత్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన వంద లాది మంది శాస్త్రవేత్తలు కోవిడ్ మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లగా, వైరస్‌లను నియంత్రించడంలో అనుభవమున్న ఫార్మా కంపెనీలు, ఇతర సంస్థల సాయంతో వివిధ దేశాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందన్నది శాస్త్రవేత్తల మాట. చైనా ఏం చేస్తోందంటే.. కోవిడ్ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్ సైన్సెస్‌లో ఈ పని జరుగుతోంది. ఇక్కడ వ్యాక్సిన్ తయారైందని, క్లినికల్ ట్రయల్స్ కోసం వలంటీర్ల వైపు చూస్తోందని తెలుస్తోంది. చైనాకు చెందిన మరో సంస్థ 133.3 మిలియన్ డాలర్లతో ఓ జర్మన్ కంపెనీతో వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. ఈ వైరస్ బయటపడడానికి ముందే తమ పరిశోధనలను చైనా దొంగిలించే ప్రయత్నం చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. యూరోప్ దేశాలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా, అమెరికాకు చెందిన మోడర్నా అనే కంపెనీ ఈ వైరస్ జన్యుకోడ్ వెలుగులోకి వచ్చిన 42 రోజుల్లోనే ఓ వ్యాక్సిన్‌ను తయారుచేసి 45 మంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి విజయవంతం అయిందన్న వార్తలొస్తున్నాయి. చైనాకు చెందిన క్యాన్సినో అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను కూడా అక్కడి ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించింది. క్యూర్వేక్, బయో ఎన్‌టెక్, ఇనోవియో, శానోఫి ఫ్రాన్స్, రోచే, ఎలీలిల్లీ, జాన్సన్ అండ్ జాన్సన్, నోవావ్యాక్స్ లాంటి కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేశాయని జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. మనమూ ముందు వరుసలోనే.. భారతదేశంలోనూ కోవిడ్ నడ్డి విరిచే వ్యాక్సిన్ తయారీ ముమ్మరమైంది. ఇందుకు ఈ రంగంలో అనుభవమున్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో పలు వైరస్‌లను నియంత్రించిన వ్యాక్సిన్లు కోవిడ్‌ను కూడా నియంత్రించగలవా అనే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి. -
6 నెలల్లో ఔషధం..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తోపాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. కరోనా వైరస్‌కు విరుగుడుగా పనిచేయగలవన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన మూడు మందులను తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయి. రెమిడెస్విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్ అనే మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. (మరో ముగ్గురికీ కరోనా) ఈ మూడు మందులపై ఒకట్రెండు క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, వేర్వేరు కారణాల వల్ల మార్కెట్లోకి రాని వాటిని అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉండటం విశేషమని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రెమిడెస్‌విర్‌ను గిలియాడ్ అనే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిందని, జపనీస్ కంపెనీ అభివృద్ధి చేసిన ఫెవిపిరవిర్పై పేటెంట్ హక్కులు కూడా లేవని ఆయన తెలిపారు. రెమిడెస్‌విర్‌పై చైనా ఇప్పటికే వెయ్యి మంది రోగులతో ప్రయోగాలు నిర్వహించిందని గుర్తుచేశారు. క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని మందులను నిశితంగా పరిశీలించడం ద్వారా తాము ఈ మూడు మందులను కరోనాతోపాటు ఇతర వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఉపయోగించవచ్చన్న అంచనాకు వచ్చామని చెప్పారు. (14 రోజులు ఇంట్లోనే ఉండండి) సిప్లా అధినేత డాక్టర్ హమీద్ మంగళవారం ఐఐసీటీకి మెయిల్ పంపుతూ ఈ మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని, ఇందుకు తగ్గట్లుగా తాము వాటిని ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రెండు మందులను (రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్) కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని ఆయన వివరించారు. ఆ తరువాత కొన్ని ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు. ఈ మందుల తయారీకి కావాల్సిన అన్ని రకాల రసాయనాలు ఐఐసీటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1980లలో హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రపంచాన్ని కబళిస్తున్న సమయంలో ఐఐసీటీ, సిప్లా అత్యంత చౌకగా యాంటీ రెట్రో వైరల్ మందులను అభివృద్ధి చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. పిచికారీ మందు తయారీ సులువే... కరోనా వైరస్‌కు విరుగుడుగా బహరంగ ప్రదేశాల్లో పిచికారీ చేసేందుకు వీలైన మందుపై ఐఐసీటీ మదింపు చేసిందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ (రెండు శాతం గాఢత), పెరాసిటిక్ యాసిడ్ (0.2 శాతం గాఢత)లను నీటితో కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల ఉపరితలాలపై ఉండే వైరస్లు ఎనిమిది నుంచి పది నిమిషాల్లో నశించిపోతాయని చెప్పారు. దీంతోపాటు కరోనా వైరస్ ఉనికిని నిర్ధారించే కిట్లలో కీలకమైన ఎంజైమ్ (రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్టేస్) ఉత్పత్తిని ఐఐసీటీ చేపట్టిందని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ (ఎన్ఐవీ) వద్ద ఉన్న ప్రైమర్‌తో కలిపి దీన్ని వ్యాధి నిర్ధారణ కిట్లలో ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే ) మనమూ తయారు చేయొచ్చు ఆరుబయట.. ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్‌ను చంపేయాలని అనుకుంటున్నారా? మీకు కావాల్సిందల్లా హైడ్రోజన్ పెరాక్సైడ్, పెరాసిటిక్ యాసిడ్ రసాయనాలే. హైడ్రోజన్ పెరాక్సైడ్ మార్కెట్లో రెండు గాఢతల్లో లభిస్తుంది. 4% గాఢత ఉన్న దాన్ని వాడే పక్షంలో ప్రతి లీటర్ నీటికి ఆరు ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి. ఇది కాకుండా 30% గాఢత ఉన్న దాన్ని వాడుతున్నట్లయితే ఒక లీటర్ నీటికి 0.82 ఎంఎల్ వాడాలి. ఇక పెరాసిటిక్ యాసిడ్ విషయానికి వస్తే దీన్ని ప్రతి లీటర్‌కు 0.42 ఎంఎల్ చొప్పున వాడా ల్సి ఉంటుంది. మొత్తమ్మీద చూస్తే ఒక లీటర్ నీరు తీసుకొని దానికి 6 ఎంఎల్ (4% గాఢత) హైడ్రోజన్ పెరాక్సైడ్, 0.42 ఎంఎల్ పెరాసిటిక్ యాసిడ్ కలిపి కావాల్సిన చోట పిచికారీ చేసుకోవాలి. ఈ మందుతో వైరస్ లేవైనా 10 నిమిషాల్లో నాశన మవుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (భారత్‌లో మూడో మరణం ) -
సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్లదక్షిణాఫ్రికా రాండ్ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సిప్లా షేర్ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది. -
ఫలితాల్లో సిప్లా సూపర్
ముంబై : దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేసి మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలను 43.7 శాతం పెంచుకుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.375 కోట్లగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు రూ.261 కోట్లు మాత్రమే. కంపెనీ కేవలం రూ.370 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా కంపెనీ నికర అమ్మకాలు కూడా రూ.3550.02 కోట్లకు పెరిగినట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3069.89 కోట్లగా ఉన్నాయి. కంపెనీ ఆర్జించిన ఇతర ఆదాయాలతో లాభాలు పెరిగాయి. దేశంలో ఐదవ అతిపెద్ద డ్రగ్ మేకర్‌గా ఉన్న సిప్లాకు ఎక్కువ రెవెన్యూలు భారత్ నుంచే వచ్చాయి. ఈ కంపెనీ అమెరికా, యూకేలో కూడా తన ఉనికిని నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత ఏడు సెషన్‌లోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో కోలుకున్న స్టాక్‌మార్కెట్లు, మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి. ఈక్విటీ బెంచ్ మార్కు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కిందకి దిగజారింది. నిఫ్టీ తన కీలకమార్కు 7950నుంచి పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 237.70 పాయింట్ల నష్టంలో 25,803 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్ల నష్టంలో 7,909 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎస్బీఐ, టాటా మోటార్స్ల్లో నెలకొన్న నష్టాలతో సెన్సెక్స్ నష్టాల్లో కొనసాగుతోందని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ సైతం రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరెబుల్స్లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా 67.82 వద్ద ప్రారంభమైంది. ఆయిల్ ధరలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని తెలిసింది. లిబియా ఉత్పత్తిని పెంచాలన్న నేపథ్యంలో ఒపెక్ అవుట్‌పుట్‌లో కోతకు ఎలా ప్లాన్ చేయబోతుందోనని మార్కెట్లు దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెప్పారు. 10 నెలల కనిష్టానికి వచ్చిన బంగారం ధరలపై కొనుగోలుదారులు లబ్ది పొందాలని కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 37 రూపాయల లాభంతో 27,005 వద్ద కొనసాగుతోంది. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
చాణక్య సూత్రాలు పాటిస్తే వ్యాపార విజయం
సాక్షి, అమరావతి: చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను పాటిస్తే ఎటువంటి వ్యాపారంలోనైనా విజయం సాధించవచ్చని చాణక్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ లీడర్షిప్ (సీఐపీఎల్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ రాధాకృష్ణ పిళై ్లతెలిపారు. చాణక్యుడు చెప్పిన ఏడు సూత్రాలను అమలు చేస్తే విజయం పథంలో దూసుకుపోవచ్చన్నారు. గురువారం విజయవాడలో సీఐఐ యంగ్ ఇండియా ‘చాణక్యాస్ సెవెన్ పిల్లర్స్ ఆఫ్ బిజినెస్’ అంశంపై రాధాకష్ణతో ఇష్టాగోష్ఠి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్టమైన నాయకత్వం, కిందిస్థారుు మేనేజ్మెంట్, మార్కెటింగ్ వ్యూహం, ట్రెజరీ, నిపుణులైన సిబ్బంది, స్నేహితులు, కన్సల్టెంట్లను ఏ మేరకు ఉపయోగించుకున్నామన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుందన్నారు. అదే విధంగా ప్రతిఒక్కరు స్థానిక సంస్కతిని అర్థం చేసుకొని దాని ప్రకారం వ్యాపార వ్యూహాలను రచించుకోవాలన్నారు. -
నిరాశపర్చిన సిప్లా...కొత్త సీఈవోగా ఉమాంగ్ వోరా
న్యూఢిల్లీ: వరుసగా ఫార్మా దిగ్గజాలు శుక్రవారం ఫలితాలను నమోదు చేశాయి. ఒకవైపు సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను నమోదు చేయగా, మరో ఫార్మా జెయింట్ సిప్లా ఊహించిన దానికంటే తక్కువ త్రైమాసిక లాభాన్ని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో దేశీ అయిదవ అతి పెద్ద ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. రూ.376 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనా వేయగా....కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో నికర లాభం 44 శాతం క్షీణించి , రూ. 365 (54.59 మిలియన్ డాలర్లు) కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇది రూ. 649కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 6 శాతం తగ్గి రూ. 3594 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా)లో 42 శాతం కోత పడటంతో రూ. 611 కోట్లకు దిగింది. ఇబిటా మార్జిన్లు కూడా 27.5 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే పన్ను వ్యయాలు రూ. 242 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు తగ్గాయి. ఇక ఇతర ఆదాయం రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. ఎండీ, గ్లోబల్ సీఈవో సుభాను సక్సేనా పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ పేర్కొంది. సక్సేనా స్థానంలో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉమాంగ్ వోరా సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించినట్టు తెలిపింది. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కంది. కాగా, ట్రేడింగ్ ముగిసేసరికి సిప్లా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 517 వద్ద నిలిచింది. -
దీపావళి నుంచి తగ్గనున్న ఔషధాల ధరలు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నుంచి మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఈమేరకు 18 నూతన బ్రాండ్లకు చెందిన నిత్యావసర ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) నియంత్రణ విధించింది. ఈ ఔషధాలు రానున్న 15 రోజుల్లో మార్కెట్లో విడుదలకానున్నాయి. ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డీపీసీవో)-2013లోని పారాగ్రాఫ్ 5 పరిధిలోకి ఈ నూతన ఔషధాలను తీసుకొస్తూ.. వాటి ధరలు ఇష్టానుసారం పెంచకుండా పరిమితులు విధించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఔషధాల ఎమ్మార్పీ ధరల ఆధారంగా వాటి గరిష్ఠ రిటైల్ ధరను ఎన్పీపీ నిర్ణయించింది. ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీలు సిప్లా, మెర్క్, ఫ్రాంకో ఇండియన్, అలెబిక్ ఫార్మా, యూనిచెమ్ మొదలైన వాటి నుంచి ఈ ఔషధాలు మార్కెట్లోకి రానున్నాయి. ఎన్పీపీ నిర్దేశించిన ప్రకారం ఆయా సంస్థలు ధరలు నిర్ణయించకపోతే.. చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అంతేకాకుండా అధికంగా వసూలుచేసిన మొత్తానికి డిపాజిట్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా ఆదేశంలో పేర్కొంది.