సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ ఫార్మా దిగ్గజం సిప్లా కీలక అనుమతిని సాధించింది. ఉబ్బసం వ్యాధి నివారణకు ఎక్కువగా ఉపయోగపడే ఇన్హేలర్ మందునకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని సాధించింది. సిప్లా సంస్థ తొలి జనరిక్ మందు ప్రోవెంటిల్ హెచ్‌ఎఫ్‌ఎ (అల్బుటెరోల్ సల్ఫేట్) 90ఎంసీజీకు ఈ అనుమతి లభించింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించి మొట్ట మొదటి అనుమతిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల సంబంధిచిన వ్యాధులకు ఈ మందునకు ప్రాచుర్యం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. తమ నిబద్ధతను తాజా అనుమతి పునరుద్ధాటిస్తుందనీ, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను విస్తరించడం కొనసాగిస్తామని సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమాంగ్ వోహ్రా అన్నారు. అంతేకాదు రవాణాలు నిలిచిపోయిన ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈ మందును కొంత మేర ఉచితంగా పంపిణీ చేయాలని యోచిస్తున్నామని కూడా చెప్పారు.
ఉబ్బసం వ్యాధి నివారణ కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రోవెంటిల్ హెచ్‌ఎఫ్‌ఎ ఇన్ హేలర్‌ను రివర్సిబుల్ అబ్ స్ట్రక్టివ్ ఎయిర్‌వే వ్యాధి ఉన్న నాలుగు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న రోగులలో బ్రోంకోస్పాస్మ్ చికిత్స లేదా నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి శరవేగంగా విస్తురిస్తున్న సమయంలో అల్బుటెరోల్ ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌ను ఎఫ్ డీఏ గుర్తించిందని సంస్థ కమిషనర్ స్టీఫెన్ ఎం హాన్ వెల్లడించారు. ఫిబ్రవరి 24 న పెరిగో ఫార్మా తయారు చేసిన ప్రోఅయిర్ హెచ్‌ఎఫ్‌ఎ జెనరిక్‌కు ఆమోదం తెలిపింది ఎఫ్‌డిఎ ఇటీవలి నెలల్లో ఆమోదించిన రెండవ జెనెరిక్ అల్బుటెరోల్ సల్ఫేట్ ఇది. ఫిబ్రవరి 2020 తో ముగిసిన 12 నెలల కాలానికి ప్రోవెంటిల్ హెచ్ ఎఫ్ఏ అమ్మకాలు సుమారు 153 మిలియన్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ సహా సౌత్ ఆఫ్రికా , అమెరికా ముఖ్య కేంద్రాలుగా 80 కి పైగా దేశాల్లో 1500 వైద్య పరికరాలను, ఔషదాలను అందిస్తున్న సంస్థ సిప్లా. దీంతో గురువారం నాటి మార్కెట్లో సిప్లా షేరు భారీగా లాభపడుతోంది. (అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో వెంటిలేటర్)
Comments
Please login to add a commentAdd a comment