భారత్‌లో తయారై.. ఇరాక్‌లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్‌లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.
అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్‌పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్‌లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది.
గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్‌లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్‌లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్‌బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్‌వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్‌వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్‌లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది.
సిరప్ ఫలితాలపై ఇరాక్
ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు.
ఇరాక్‌లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్‌లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది.
ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు.
గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్‌లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.
మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్‌లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు.
చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో
Comments
Please login to add a commentAdd a comment