taliban chief
-
Taliban: అజ్ఞాతం వీడిన తాలిబన్ చీఫ్, 10 నిమిషాల ఆడియో?
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అఖుంద్జాదా అజ్ఞాతం వీడకపోవడంతో అతను మరణించాడని వదంతులు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ తమ నేత కాందహార్‌లోని జామై దరూల్ అలూమ్ హకీమియా మదర్సాను సందర్శించినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే అఖుంద్జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అఖుంద్జాదా మతపరమైన బోధనలు మాత్రమే చేస్తున్నాడు. అయితే తాలిబన్ నాయకత్వానికి అల్లా దీవెనలు ఉండాలని చెబుతున్నాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన పోరాటంలో మరణించిన తాలిబన్ల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశాడు. 2016 అమెరికా డ్రోన్ దాడుల్లో అప్పటి తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్ హతం అయ్యాక అఖుంద్జాదా తాలిబన్లకు చీఫ్ అయ్యాడు. (చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు) -
మత గురువు నుంచి తాలిబన్ చీఫ్‌గా..
కాబూల్: ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కచ్లాక్ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది. 2016లో తాలిబన్ పగ్గాలు అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్ మిలటరీ కోర్టులో అఖుంద్జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్ అధినేత ముల్లా మన్సూర్ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్ అధినేతగా అఖుంద్జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్జాదా కుమారుడు అబ్దుర్ రెహమాన్ అలియాస్ హఫీజ్ ఖలీద్(23) అప్పటికే తాలిబన్ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్ మరణించాడు. కనిపించడం అత్యంత అరుదు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ తరహాలోనే అఖుంద్జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్‌లో ఆందోళనలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది. ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
తాలిబన్ నేతకు పాక్‌లో బీమా
ఇస్లామాబాద్: అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన తాలిబన్ అధినేత ముల్లా అక్తర్ మన్సూర్ పాకిస్థాన్‌లో బీమా పాలసీ తీసుకున్నాడని మీడియా వర్గాలు తెలిపాయి. ఫేక్ ఐడెంటిటీతో బీమా తీసుకున్న ముల్లా, రూ.3లక్షల ప్రీమియం కూడా చెల్లించినట్లు తెలిపాయి. 2016 మేలో యూఎస్ జరిపిన దాడిలో ముల్లా చనిపోయాడు. పాక్ కోర్టులో టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించిన విచారణలో ఈ బీమా సంగతి బయటపడింది. తప్పుడు ధృవీకరణలతో ముల్లా, అతని అనుచరులు ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు జరిపి టెర్రర్ ఫండింగ్ చేసేవారని కేసు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తాలిబన్ నేత బీమా తీసుకున్నాడని, అతని మరణానంతరం బీమాకంపెనీ రూ.3 లక్షల చెక్కును విచారణాధికారులకు ఇచ్చిందని డాన్ న్యూస్ తెలిపింది. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్! -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్‌కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్‌లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
పక్కనే ఉన్నా పసిగట్టలేకపోయారు..
న్యూయార్క్ : తాలిబన్ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ అలియాస్ ముల్లా ఒమర్ అమెరికా సైనిక శిబిరాలకు అత్యంత చేరువలోని రహస్య గదిలో ఉన్నా అమెరికన్ దళాలు గుర్తించలేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్‌లోని అమెరికా శిబిరాలకు నడక దూరంలోనే ముల్లా ఒమర్ ఏళ్ల తరబడి నివసిస్తున్నారని ఈ పుస్తకం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపింది. గతంలో ముల్లా తలదాచుకున్న ఈ ఇంటిపై అమెరికా దళాలు సోదాలు చేపట్టినా ఇందులో ఆయన కోసం నిర్మించిన రహస్య గదిని అవి పసిగట్టలేకపోయాయని పుస్తకంలోని అంశాలను ప్రచురించిన గార్డియన్, వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనాలు వెల్లడించాయి. అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి అనంతరం ఒమర్ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది. కాగా అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ మాదిరిగానే ఒమర్ సైతం పాకిస్తాన్లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. 2006 నుంచి ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా వార్తలు అందిస్తున్న డచ్ జర్నలిస్ట్ బెటే డామ్ ప్రచురించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు దుమారం రేపుతున్నాయి. -
పాక్ తాలిబన్ చీఫ్ ఫజ్లుల్లా హతం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లాను అమెరికా వైమానిక దళం హతమార్చింది. అఫ్గానిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో జరిపిన డ్రోన్ దాడుల్లో అతడు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ అధికారి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు. 2012లో పాకిస్తాన్ బాలిక మలాలాపై దాడి జరిగిన సమయంలో ఫజ్లుల్లా స్వాత్ లోయలో తాలిబన్ కార్యకలాపాలకు ఇన్చార్జిగా వ్యవహరించాడు. 2013లో ఆ సంస్థకు చీఫ్ అయిన తరువాత అమెరికా, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా ఎన్నో దాడులకు కుట్ర పన్నాడు. అందులో 2014 నాటి.. 130 మంది చిన్నారులు సహా మొత్తం 151 మందిని బలిగొన్న పెషావర్ హైస్కూల్ దాడి ఘటన కూడా ఉంది. 2010లో న్యూయార్క్‌లోని టైమ్స్‌స్క్వేర్ వద్ద కారుబాంబుతో దాడి చేయడానికి ఆ సంస్థ ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఫజ్లుల్లా తలపై 5 మిలియన్ డాలర్ల(రూ. 34 కోట్లు) రివార్డు ఉంది. 2009లో పాకిస్తాన్‌లోని కైబర్–పఖ్తూన్‌క్వా ప్రావిన్స్‌లో తన అనుచరులందరూ హతమయ్యాక.. అఫ్గానిస్తాన్‌కు పారిపోయాడు. అక్కడి నుంచే పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడు. రేడియోలో రెచ్చగొట్టే ప్రసంగాలు.. ఒక సీనియర్ ఉగ్ర నాయకుడు లక్ష్యంగా దాడులు చేశామని గురువారం అమెరికా రక్షణ శాఖ ప్రకటించినా.. మరణించిన ఉగ్రవాది పేరును మాత్రం వెల్లడించలేదు. ‘జూన్ 13న కునార్ ప్రావిన్స్‌లో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక ఉగ్రనేత లక్ష్యంగా అమెరికా వైమానిక బలగాలు దాడులు చేశాయి’ అని లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ చెప్పారు. అయితే ఫజ్లుల్లా మృతిని శుక్రవారం అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి మొహమ్మద్ రద్మానిష్ ధ్రువీకరించారు. కునార్ ప్రావిన్స్‌లోని నురుగుల్ కాలే గ్రామ సమీపంలో అమెరికా బలగాల డ్రోన్ దాడిలో ఫజ్లుల్లాతో పాటు మరో నలుగురు తాలిబన్ కమాండర్లు మరణించారని ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తెలిపింది. ఫజ్లుల్లా, అతని అనుచరులు ఇఫ్తార్ విందు చేసుకునే సమయంలో డ్రోన్ విమానం బాంబుల వర్షం కురిపించిందని మరికొన్ని నివేదికలు వెల్లడించాయి. ఫజ్లుల్లా మృతిని తాలిబన్ ఇంకా ధ్రువీకరించలేదు. 2010, 2014లలోనూ ఫజ్లుల్లా మృతిచెందినట్లు వార్తలు వెలువడినా, ఆ తరువాత అవి అబద్ధాలని తేలింది. ప్రైవేట్ రేడియోల్లో విస్తృతంగా ప్రసంగించి రెచ్చగొట్టే ఫజ్లుల్లాకు రేడియో ముల్లా, మౌలానా రేడియో అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే అతను అఫ్గానిస్తాన్ పారిపోయాక ఆ రేడియో స్టేషన్లను మూసివేశారు. రంజాన్ మాసంలో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న సమయంలో తాజా దాడి జరగడం గమనార్హం. ఆ ఒప్పందాన్ని గౌరవిస్తామని, కానీ, అమెరికా ఉగ్ర వ్యతిరేక పోరుకు దానితో సంబంధంలేదని నాటో అధికారి తెలిపారు. -
'తాలిబన్ చీఫ్‌తో పుతిన్ భేటీ అయ్యాడు'
లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అఫ్ఘానిస్తాన్‌లోని ఓ తాలిబన్ కమాండెర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సౌర్తో గోప్యంగా సమావేశమైనట్టు ఇంగ్లండ్‌కు చెందిన ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరికట్టడానికి సాయం చేయాల్సిందిగా పుతిన్ తాలిబన్లను కోరినట్టు వెల్లడించాడు. గత సెప్టెంబర్‌లో తజకిస్థాన్‌లోని ఓ మిలటరీ స్థావరంలో ఓ రాత్రి పుతిన్..తాలిబన్ చీఫ్‌ను డిన్నర్ సమావేశానికి పిలిచారని చెప్పాడు. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులో ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో ఐఎస్ ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తాలిబన్ కమాండర్ చెప్పాడు. ఐఎస్ కార్యకాలపాలను నిర్మూలించేందుకు సాయం చేస్తే తాలిబన్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆయుధాలు అందజేస్తామని రష్యా హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను తాలిబన్ తోసిపుచ్చింది. ఐఎస్‌ను ఎదుర్కోవడానికి రష్యాతో తమ ప్రతినిధులు సమావేశం కాలేదని తాలిబన్ చెప్పింది. మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్‌లో రష్యా విమానం కూల్చివేత వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కుట్రదారుడని కేజీబీ (ఇప్పటి ఎఫ్ఎస్బీ) ఏజెంట్ బోరిస్ కార్పిఖోవ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను అమానుషులుగా ముద్ర వేసేందుకు, వారి అంతానికి పలు దేశాల సంఘీభావాన్ని కూడగట్టుకునేందుకు పుతిన్ ఈ దారుణ కుట్రకు తెర లేపారన్నది కార్పిఖోవ్ వాదన. అయితే ఈ వాదనలను రష్యా ఖండించింది. తాజాగా తాలిబన్ కమాండర్.. పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
పెషావర్ కంటే తీవ్రమైన దాడి చేస్తాం: తాలిబన్ చీఫ్
పెషావర్: గత సంవత్సరం డిసెంబర్ నెలలో పెషావర్ లో సృష్టించిన విధ్వంసం కంటే ఈసారి తీవ్రమైన దాడిని చేస్తామని తాలిబన్లు హెచ్చరించారు. దీనికి సంబంధించిన తాలిబన్ చీఫ్ మౌలానా ఫజుల్లాహ్ పేరుతో విడుదల అయిన వీడియో తాజాగా కలకలం రేపుతోంది.' పెషావర్ లో భారీ విధ్వంసం సృష్టించాం. ఈసారి అంతకంటే తీవ్రమైన దాడి చేస్తాం' అని ఆ వీడియో ద్వారా సోమవారం హెచ్చరికలు జారీ చేశాడు. 2014 వ చివర్లో పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబాన్లు పాల్పడిన ఘాతకంలో 148 మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16 వ తేదీన చేసిన తాలిబన్ల దాడిలో ఎక్కువ మంది విద్యార్థులు మరణించారు. -
తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !
-
తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !
పాకిస్థాన్ : పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వచ్చాయి. పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆర్మీ స్కూల్‌పై తీవ్రవాదుల దాడిలో 148 మంది హతమైన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పెషావర్ ఘటన అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని స్వాత్ లోయని తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం ద్రోణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్నా పాక్ పెద్దలు.. పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,..ద్రోణి దాడులతో మట్టుపెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి.