ఇస్లామాబాద్: అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన తాలిబన్ అధినేత ముల్లా అక్తర్ మన్సూర్ పాకిస్థాన్‌లో బీమా పాలసీ తీసుకున్నాడని మీడియా వర్గాలు తెలిపాయి. ఫేక్ ఐడెంటిటీతో బీమా తీసుకున్న ముల్లా, రూ.3లక్షల ప్రీమియం కూడా చెల్లించినట్లు తెలిపాయి. 2016 మేలో యూఎస్ జరిపిన దాడిలో ముల్లా చనిపోయాడు. పాక్ కోర్టులో టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించిన విచారణలో ఈ బీమా సంగతి బయటపడింది. తప్పుడు ధృవీకరణలతో ముల్లా, అతని అనుచరులు ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాలు జరిపి టెర్రర్ ఫండింగ్ చేసేవారని కేసు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తాలిబన్ నేత బీమా తీసుకున్నాడని, అతని మరణానంతరం బీమాకంపెనీ రూ.3 లక్షల చెక్కును విచారణాధికారులకు ఇచ్చిందని డాన్ న్యూస్ తెలిపింది. చదవండి: నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్!
Comments
Please login to add a commentAdd a comment