Indian Pharma sector
-
సరైన ‘నియంత్రణ’తోనే దివ్యౌషధం
భారత్‌లో తయారైన మందులు తీసుకోవడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కొంతమంది మరణించినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశ ఫార్మా రంగంలో నాణ్యతా ప్రమాణాలపై సర్వే ప్రారంభించింది. విమర్శకులు చాలాకాలం నుంచి చేస్తున్న ఆరోపణలు కఠిన వాస్తవమని ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికీ స్పష్టంగా తెలిసింది. దీనివల్ల వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వ సంస్థల కళ్లు విచ్చుకున్నాయని చెప్పాలి. లేదా చాలాకాలంగా తెలిసిన విషయాలను వీరు అసలు పట్టించుకోలేదని అయినా అనుకోవాలి. సర్వే చెప్పిన అంశాల్లో ఒకటి – దేశంలో నాణ్యత ప్రమాణాలను పాటించడంపై అస్సలు శ్రద్ధ లేదు అన్నది. నిబద్ధత, తగిన శిక్షణ లేకపోవడం అన్నవి సరేసరి. నాణ్యతా ప్రమాణాల లోపాల ఫలితంగానే నాసిరకం ఔషధాలు భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. మందులు చౌకగా లభిస్తాయన్న ఢంకా బజా యింపునకూ ఇవే కారణాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ఇంకా మొదలు కావాల్సి ఉన్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సర్వే జరపడమే కొంత ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సంస్థలు ఇప్పుడు ఒక్కతీరుగా ఆలోచించడం మొదలుపెట్టాయి. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన చర్యలపై స్పష్టతా ఏర్పడింది. మితిమీరిన జోక్యం... దేశ ఫార్మా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందీ అంటే అది మితిమీరిన ప్రభుత్వ జోక్యమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన పలు సంస్థలు ఫార్మా రంగంలో జోక్యం చేసుకుంటూంటాయి. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూంటారు. తద్వారా అసలు ప్రయోజనం దెబ్బతింటూ ఉంటుంది. స్థానికంగా తయారయ్యే మందులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లైసెన్సులు జారీ చేస్తూంటాయి. దీనివల్ల చాలా మందుల నాణ్యత అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతూంటుంది. ఫార్మా రంగంపై నియంత్రణ సుస్పష్టంగా ఉన్నప్పుడే నాణ్యతను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. నాణ్యమైన మందులు లేకపోతే ఈ ఆధునిక యుగంలో మరింత ఎక్కువ కాలం జీవించడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలోనూ ఫార్మా రంగం ప్రాముఖ్యత ఏమిటన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. భారత్‌కు ప్రపంచ ఫార్మా రాజధాని అనే పేరుంది. జెనెరిక్ మందులతో అన్ని దేశాల్లోనూ అవస రార్థులకు మందులు (పేటెంట్ హక్కులు లేనివి) అందుబాటులో ఉండేందుకు కారణమైంది భారత్! ప్రాణాంతక హెచ్ఐవీ నియంత్రణలో ఈ జెనెరిక్ ఔషధాలది చారిత్రాత్మక పాత్ర. భారతీయ ఫార్మా కంపెనీల జెనెరిక్ ఉత్పత్తుల్లేకపోతే ఈ రోజు అమెరికా సహా పలు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చరిత్రను తరచి చూస్తే... భారతీయ ఫార్మా రంగం సాధించిన ఘన విజయాలకు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. 1970లలో ప్రాసెస్ పేటెంట్లకు కట్టుబడుతూనే... ప్రాడక్ట్ పేటెంట్లకు భారత్ ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏర్పాటు వల్ల పశ్చిమ దేశాల్లో పేటెంట్ హక్కులున్న ఖరీదైన మందులను కూడా ప్రత్యా మ్నాయ మార్గాల ద్వారా చౌకగా తయారు చేసే వీలేర్పడింది. ఫలితంగానే భారత్ మోతాదుల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫార్మా పరిశ్రమగా అవతరించగలిగింది. విలువ ఆధారంగా చూస్తే మాత్రం మనది 14వ స్థానం. భారత ఫార్మా రంగం మార్కెట్ విలువ 5,000 కోట్ల డాలర్లు కాగా ఇందులో సగం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ప్రపంచ టీకా డిమాండ్‌లో 60 శాతాన్ని భారత్ పూరిస్తోందంటే పరిస్థితి ఏమిటన్నది తెలుస్తుంది. అమెరికా జెనెరిక్ మందుల డిమాండ్‌లో 40 శాతం భారత్ ద్వారా తీరుతోంది. యూకే ఔషధా లన్నింటిలో 25 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌లో తయారయ్యే మందుల నాణ్యతపై ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కారాదు. ఈ రకమైన నమ్మకం ఉన్నందునే గాంబియాలో మన మందుల వాడకం వల్ల పిల్లలు కొందరు మరణించారన్న వార్త కలకలం రేపింది. ఆ వెంటనే ఉజ్బెకిస్తాన్,శ్రీలంక... చివరకు అమెరికా నుంచి కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది. మనకు మాత్రం నష్టం లేదా? మందుల కంపెనీల్లో చాలా సందర్భాల్లో కల్తీలను గుర్తించేందుకు అవసరమైన పరికరాలు, తగిన అర్హతలున్న సిబ్బంది కొరత ఉంటుంది. డైఎథిలీన్ గ్లైకాల్ వంటివి అంధత్వానికి కారణమవుతాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎగుమతుల కోసం ఉద్దే శించిన అన్ని దగ్గుముందులను ప్రభుత్వ పరిశోధన శాలల్లో పరీక్షించాలని ఒక ఆదేశం జారీ చేసింది. కానీ ఇదేమంత సత్ఫలితాలు చూపలేదు. ఎందుకంటే ఫార్మా విషయాలను వాణిజ్య శాఖ పర్యవేక్షించే పరిధి లేకపోవడం. అంతేకాకుండా... వాణిజ్య శాఖ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తింది. అదేమిటంటే, ఇలాంటి కల్తీ దగ్గు మందుల కారణంగా భారతీయ రోగులకు హాని జరగడం లేదా అని! జమ్మూలో అదే జరిగింది. 2019 డిసెంబరు 2020 జనవరి మధ్య కాలంలో కల్తీ దగ్గుమందు వేసుకోవడం వల్ల దాదాపు 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇంకో చిత్రమైన ఘటన జరిగింది. 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ స్థానంలో డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మోటిక్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఇప్పు డున్న వివాదాస్పద అంశాలు వేటికీ ఇందులో చోటు లేకుండా పోయింది. ఫార్మా రంగం సంస్కరణలు లక్ష్యంగా తీసుకొచ్చే ఏ కొత్త చట్టమైనా లైసెన్సింగ్ ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఔషధ నియంత్రణ ఏకరీతిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో డ్రగ్ రెగ్యులేటర్స్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకే ఒక్క డ్రగ్ రెగ్యులేటింగ్ వ్యవస్థ... ఈ వ్యవస్థకు సలహా సూచనలు అందించేందుకు రెండు స్టాట్యుటరీ వ్యవస్థలు ఉంటే సరిపోతుంది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం కూడా స్వతంత్ర సంస్థగా ఉండాలి. దీనివల్ల మంత్రుల ఆమోదం లేకుండానే డ్రగ్ కంట్రోలర్ అవసర మైనప్పుడు నిపుణులను నియమించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యతిరేక పవనాలు... ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా కొన్ని కఠిన మైన చర్యలకు సిద్ధమవుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలకు నాణ్యత విషయంలో ఇప్పటికే అగ్రరాజ్యం బోలెడన్ని సార్లు హెచ్చ రికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకం కానుంది. ఆఫ్రికా దేశాలు కొన్ని కూడా అమెరికా మాదిరిగానే ఆలోచిస్తూండటం గమనార్హం. ఇంకో ముఖ్య విషయం... ఫార్మా రంగ పరీక్షలకు సంబంధించి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ఐటీ వేదిక సృష్టి వెంటనే జరగాలి. గత సమాచారం, ప్రస్తుత పరిణామాలన్నింటికీ ఈ వేదిక ఒక రెఫరెన్ ్స పాయింట్లా ఉండాలి. పరిశ్రమ వర్గాలతోపాటు నియంత్రణ సంస్థలు, ఈ అంశంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ వేదికను ఉపయోగించుకుని తమ సామర్థ్యాన్ని మెరుగుపరచు కోవచ్చు. ఆన్ లైన్ ప్రభుత్వ సేవల రంగంలో భారత్‌కు ఉన్న అను భవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద సంగతి కానేకాదు. ఫార్మా రంగ సంస్కరణల విషయంలో వాంఛనీయమైన పరిణామం ఏదైనా ఉందంటే అది ఇటీవలి కాలంలో సంబంధిత మంత్రి చేసిన ఒక ప్రకటన. ‘‘ఫార్మా రంగ నియంత్రణ అనేది సహ కార సమాఖ్య తీరులో సాగాలి’’ అన్న ఆయన మాటలు ఆచరణలోకి వస్తే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడమే కాకుండా... ఒకరికి ఒకరు ఆసరాగా నిలవడం ద్వారా మరింత బలోపేతం కావచ్చు కూడా. పార్టీల మధ్య తీవ్రమైన వైరం నెలకొన్న... త్వరలోనే పార్లమెంటరీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్న నేపథ్యంలో ఈ మాత్రం మార్పు ఆహ్వానించదగ్గదే! సుబీర్ రాయ్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సెప్టెంబర్‌లో ఫార్మా వృద్ధి స్వల్పం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా మార్కెట్ వృద్ధి సెప్టెంబర్‌లో 2.1 శాతానికే పరిమితమైంది. 2022 సెప్టెంబరులో పరిశ్రమ ఏకంగా 13.2 శాతం వృద్ధి సాధించింది. ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డి్రస్టిబ్యూటర్స్ ప్రకారం.. అధిక బేస్, పరిమాణం పెరుగుదలలో సవాళ్ల కారణంగా దేశీయ ఔషధ రంగం 2023 సెప్టెంబర్‌లో వరుసగా ఐదవ నెలలో తక్కువ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ధర, కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా మొత్తం వృద్ధి సాధ్యమైంది. 2023 జనవరి–సెప్టెంబరులో దాదాపు స్థిరంగా 5–6 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా రేటింగ్స్ ఫార్మా మార్కెట్ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10–11 శాతం ఉంటుందని అంచనా వేసింది. పరిమాణం 2022 సెప్టెంబర్‌లో 4.5 శాతం పెరిగితే, గత నెలలో 5.6 శాతం క్షీణించింది. ధరలు గతేడాది 6.6 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.8 శాతం దూసుకెళ్లాయి. నూతన ఉత్పత్తుల పెరుగుదల 2022 సెప్టెంబర్‌లో 1.9 శాతం ఉంటే, గత నెలలో ఇది 2.9 శాతం నమోదైంది. మొత్తంగా భారతీయ ఫార్మా మార్కెట్ సగటు వృద్ధి సంవత్సరానికి 6.5 శాతం వద్ద ఆరోగ్యంగా ఉంది. -
Israel-Palestine war: ఫార్మాపై ప్రభావం తక్కువే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత ఫార్మాపై పడే అవకాశం లేదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. దేశం నుంచి ఇజ్రాయెల్‌కు 2022–23లో ఎగుమతైన ఔషధాల విలువ రూ.766 కోట్లు. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం కంటే అధికం. దేశీయ మార్కెట్ నుంచి బల్క్ డ్రగ్స్ (ఏపీఐ), డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఆ దేశానికి సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఫార్మా రంగంలో వాణిజ్యం తక్కువగా ఉన్నందున.. ఫార్మాస్యూటికల్ వ్యాపారంపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ‘ఔషధ తయారీ రంగంలో ఇజ్రాయెల్ బలంగా ఉంది. అలాగే అధిక నియంత్రణ కలిగిన ఫార్మా మార్కెట్ ఆ దేశం ప్రత్యేకత. సహజంగానే యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఉంటాయి’ అని అభిప్రాయపడ్డారు. -
వృద్దివైపు పరుగులు పెడుతున్న ఫార్మా - పెరుగుతున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నియంత్రిత మార్కెట్లకు పెరుగుతున్న ఎగుమతులు, దేశీయంగా స్థిరమైన వృద్ధి నమోదవుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని కోసం 186 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం చేసింది. రూ. 3.7 లక్షల కోట్ల పరిశ్రమ వార్షిక ఆదాయంలో వీటి వాటా దాదాపు సగం ఉంటుంది. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అనుమతించిన మేరకు ధరలను పెంచడం కూడా పరిశ్రమ ఆదాయ వృద్ధికి దోహదపడగలదని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ డానీ తెలిపారు. అమ్మకాల పరిమాణం 3–4% మేర పెరిగేందుకు ప్రస్తుతమున్నవి, కొత్తగా ప్రవేశపెట్టే ఔషధాలు తోడ్పడగలవని వివరించారు. ముడివస్తువులు, లాజిస్టిక్స్ వ్యయాలు, అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిడి తగ్గుదలతో ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహణ లాభదాయకత 50–100 బేసిస్ పాయింట్లు పెరిగి 21 శాతానికి చేరవచ్చని తెలిపారు. అమెరికాలో ధరలపరమైన ఒత్తిడి, ముడి వ్యయాల పెరుగుదల కారణంగా వరుసగా రెండేళ్ల పాటు మార్జిన్లు తగ్గినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. ‘ఆసియాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఒక మోస్తరుగా ఉండగా, ఈసా రి మెరుగుపడవచ్చు. ఆఫ్రికా దేశాల దగ్గర విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వంటి అంశాల కారణంగా అక్కడికి ఎగుమతుల్లో మందగమనం కొనసాగే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. -
ఫార్మా అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్‌చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్ మేనేజ్మెంట్) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణనాథ్ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు. జూన్ నుంచీ స్పీడ్ గతేడాది(2022) జూన్ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది. విభాగాలవారీగా ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్‌చేయగా.. యాంటీఇన్ఫెక్టివ్స్ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్ మేనేజ్మెంట్ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్ఎస్) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. కంపెనీల జోరిలా ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్‌ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్ 28 శాతం, సిప్లా, ఎఫ్డీసీ 27 శాతం, అలెంబిక్ ఫార్మా 24 శాతం, గ్లెన్‌మార్క్ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్ ఇండియా, ఆల్కెమ్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జీఎస్కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్ 13 శాతం, టొరెంట్ ఫార్మా, లుపిన్ 9 శాతం, ఎరిస్ లైఫ్‌సైన్సెస్ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్ లైఫ్‌సైన్సెస్ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్ ఫార్మా, ఫైజర్ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి. -
అమెరికాలో ఒత్తిళ్లు.. దేశీ ఫార్మాకు ధరల కష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి దేశీ ఫార్మా సంస్థలకు వచ్చే ఆదాయం ఒక మోస్తరుగానే వృద్ధి చెందనుంది. అక్కడి మార్కెట్లో ఔషధాల ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొనడమే ఇందుకు కారణం కానుంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలు ప్రకటించింది. తాము పరిశీలించిన ఎనిమిది దిగ్గజ ఫార్మా కంపెనీలకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చే ఆదాయాలు 0.2 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ఉత్పత్తుల ధరలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి–కనిష్ట టీన్స్ (రెండంకెల) స్థాయిలో పడిపోవడం ఇందుకు కారణమని వివరించింది. గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో రేట్ల పతనం కొనసాగడం వల్ల సమీప భవిష్యత్తులోనూ ఆదాయాలపై ఒత్తిడి నెలకొనవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి భారతీయ ఫార్మా కంపెనీలకు వచ్చే ఆదాయాలు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. ఇతర వ్యయాల భారం.. ముడి వస్తువుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా వ్యయాలు భారీగా పెరగడం .. సరఫరాపరమైన అవాంతరాలు మొదలైన అంశాల కారణంగా మార్జిన్లపై పడే ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాలకు అనుమతుల ప్రక్రియ వేగం మందగించిందని, 2022 ఆర్థిక సంవత్సరంలో ధరలపరమైన ఒత్తిళ్లు ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపాయని వివరించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ మళ్లీ ప్లాంట్ల తనిఖీలను మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో భారతీయ ఫార్మా కంపెనీలు చెప్పుకోతగ్గ స్థాయిలో చెల్లించి, లిటిగేషన్లను సెటిల్ చేసుకుంటూ ఉండటం కూడా వాటి ఆదాయాలపై ప్రభావం చూపుతోందని ఇక్రా వివరించింది. ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మొదలైనవి తరచుగా నిఘా పెట్టే రిస్కులు భారత ఫార్మా కంపెనీలకు ఉన్నట్లు పేర్కొంది. -
తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్‌లో ఆందోళనలు
హైదరాబాద్: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది. ఆ దేశానికి ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ తెలిపారు. 2020–21లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు -
నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి ? ప్రపంచ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతామండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా ? ’’అని మోదీ నిలదీశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్య దేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరు. ఈ నాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం’’అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే, ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం గత 75 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, రక్తపుటేరులు ప్రవహించాయన్న ప్రధాని దానిని దీటుగా ఎదుర్కోవాలంటే యూఎన్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, ఆయుధాల సరఫరా, డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తన గళాన్ని గట్టిగా వినిపించాలని, శాంతి భద్రతలు, సయోధ్య అంశాలకు మద్దతు పలకాలన్నారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఇప్పటివరకు భారత్ 50 వరకు శాంతి మిషన్లను ప్రపంచం నలుమూలలకి పంపించిందని, జగతి సంక్షేమమే భారత్ ఆకాంక్ష అని మోదీ అన్నారు. కరోనాపై పోరాటంలో ఐరాస పాత్ర ఏది ? గత తొమ్మిది నెలల నుంచి ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ ఉంటే, కలసికట్టుగా పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలేంటని మోదీ ప్రశ్నించారు. కరోనాపై యూఎన్ నుంచి గట్టి ప్రతిస్పందన కూడా కరువైందని అన్నారు. కరోనా కష్ట కాలంలో భారత్‌లో ఫార్మా రంగం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించిందని, 150కి పైగా దేశాలకు వివిధ రకాలైన ఔషధాలను సరఫరా చేశామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో అతి పెద్ద దేశమైన భారత్ అందరి అవసరాలు తీర్చేలా కరోనా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలను సంక్షోభం నుంచి బయటపడేయగలదని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై భారత్ మూడో దశ ప్రయోగాల్లో ఉందని తెలిపారు. -
టీకా రేసులో భారత్ జోరు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ భారత్ తన జోరు చూపిస్తోంది. వివిధ దేశాల్లో 150కి పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతూ ఉంటే భారత్ కూడా తన సత్తా చాటుతోంది. మన దేశంలో టీకా అభివృద్ధి రేసులో 7 ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఆ ఏడూ ఇవే.. భారత్ బయోటెక్, సెరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటెక్, బయోలాజికల్ ఈ , ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్వాక్స్ స్వదేశీ ఫార్మా సంస్థలు కోవిడ్ టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి. ఏ సంస్థ పరిశోధనలు ఎంతవరకు ? ► హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు మొదటి, రెండో దశ ప్రయోగాలకు అనుమతులు లభించాయి. గత వారమే మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టింది. ► దేశంలోనే వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 3 దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉంది. ఈ ఏడాది చివరికి టీకాను అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ అంటోంది. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ కోడాజెనిక్స్‌తో పాటు మరిన్ని దేశాలు చేస్తున్న పరిశోధనల్లో ‘సెరమ్’ పాల్గొంటోంది. ► జైడస్ కేడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్–డి టీకా మరో 7 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతోంది. ► పనాసియా బయోటెక్ కంపెనీ అమెరికాకు చెంది రెఫానా ఇంక్ కంపెనీతో కలిసి ఐర్లాండ్‌లో జాయింట్ వెంచర్‌ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ముం దుంది. రెఫానా భాగస్వామ్యంతో ఈ కంపెనీ 50 కోట్ల టీకా డోసుల్ని సిద్ధం చేసే పనిలో ఉంది. వచ్చే ఏడాదికి టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ► నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కి అనుబంధంగా నడిచే ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి కానీ ఆ సంస్థల పరిశోధనలు ఎంతవరకు వచ్చాయో అధికారిక సమాచారం లేదు. -
భారత్‌కు ఆ సత్తా ఉంది: బిల్‌గేట్స్
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. భారత్‌తో సహా పలు దేశాల్లో ఇప్పటికే మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఫార్మా రంగాన్ని ఆకాశానికెత్తారు. తమ దేశానికే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సత్తా భారత్‌కు ఉందని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్‌లో ఇప్పటికే చాలా ముఖ్యమైన పరిశోధనలు జరిగాయని.. ఇతర వ్యాధుల కోసం ఉపయోగించిన పలు కాంబినేషన్లతో కరోనాకు వ్యాక్సిన్ రూపొందించడానికి భారత్ ఫార్మా కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ‘ఇండియాస్ వార్ ఎగెనెస్ట్ ది వైరస్’ అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం డిస్కవరీ చానెల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం అవుతుంది. (వ్యాక్సిన్ అందరికీ పంచాలి: ట్రూడో) బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం భారతదేశం మీద కూడా భారీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ. అలానే పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగానే ఉంటుంది. భారతదేశంలో డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లోని ఫార్మా కంపెనీలు ప్రపంచానికి అవసరమయిన వ్యాక్సిన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఉత్పత్తి అయినంత భారీగా వ్యాక్సిన్లు ప్రపంచంలో మరెక్కడా తయారు కాలేదు. ఇదే కాక బయో ఈ, భారత్(బయోటెక్) వంటి ఎన్నో ప్రసిద్ధ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. తన ప్రజలకే కాక మొత్తం ప్రపంచానికి సరిపడా కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్ సొంతం’ అన్నారు బిల్ గేట్స్. అంతేకాక భారత్ ‘కొయిలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్’(సీఈపీఐ)లో చేరడం పట్ల గేట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీల కూటమి. (ఈ మందులు నిల్వ ఉంచండి) -
'భారత ఫార్మా రంగం ప్రపంచానికే ఆస్తిగా మారింది'
-
'మన ఫార్మా రంగం ప్రపంచానికే ఆస్తిగా మారింది'
ఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత ఫార్మా రంగం సత్తా తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపత్తు వేళ భారత ఫార్మా రంగం దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఆస్తిగా మారిందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకు మందులు సమకూర్చుస్తున్న ఘనత భారత్‌దేనన్నారు. గురువారం బ్రిటన్ వేదికగా నిర్వహించిన ‘ఇండియా గ్లోబల్ వీక్-2020’ సదస్సులో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ వైరస్‌పై ప్రపంచం సాగిస్తున్నపోరులో భారత్ భాగస్వామ్యం అయ్యిందన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి జరుగుతున్నఅంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత ఫార్మా సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. (ఆన్లైన్ క్లాసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు) వ్యాక్సిన్ తయారీ భారత్ బాధ్యత అని ప్రపంచంలో 2/3వంతు చిన్నారులకు వ్యాక్సిన్ అవసరమని తెలిపారు. టీకాను కనుగొంటే దాని అభివృద్ధి, ఉత్పత్తిలో భారత్ పాత్ర క్రియాశీలకంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. భారతీయులు సహజ సంస్కర్తలని చరిత్రే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించిన చరిత్ర భారత్‌కు ఉందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో భారత్ అసమాన పోరాటం చేస్తోందని, ప్రజా ఆరోగ్య సంరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ సాధనకు కృషి చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.(భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా!) ‘పునరుజ్జీవన భారతదేశం, కొత్త ప్రపంచం’ నినాదంతో ఇండియా గ్లోబల్ వీక్-2020 సమావేశాలు బ్రిటన్ వేదికగా గురువారం నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది ఇందులో పాల్గొనున్నారు. 75 సెషన్లలో 30 దేశాలకు చెందిన 250మంది ప్రపంచ ప్రతినిధులు ప్రసంగించనున్నారు. -
ఫార్మా ఎగుమతులు జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా రంగం మంచి జోరు మీద ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో దేశం నుంచి ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. 2018తో పోలిస్తే 2019 ఆగస్టులో ఎక్స్‌పోర్ట్స్ 0.19 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబరు నెలలో ఎగుమతులు గాడినపడ్డాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్ 8.72 శాతం అధికమై రూ.12,600 కోట్లకు చేరుకున్నాయి. జూలైలో ఏకంగా 21.74 శాతం అధికమై రూ.12,047 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబరు క్వార్టరులో 9.37 శాతం వృద్ధితో రూ.36,442 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. కాగా, మార్కెట్ రిసర్స్ సంస్థ ఏఐవోసీడీ–అవాక్స్ ప్రకారం సెప్టెంబరు క్వార్టరులో దేశీయ ఔషధ పరిశ్రమ 11.5 శాతం వృద్ధి సాధించింది. 22 బిలియన్ డాలర్ల దిశగా.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు రెండంకెల వృద్ధి సాధించాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్ 10.28% అధికమై రూ.71,694 కోట్లకు చేరుకున్నాయి. 2019–20లో ఎగుమతులు 22 బిలియన్ డాలర్లు (రూ.1,54,000 కోట్లు) నమోదు చేస్తాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) అంచనా వేసింది. ద్వితీయార్థంలోనూ పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. దీంతో అంచనాలకు తగ్గట్టుగా ఎగుమతులు నమోదవుతాయని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎక్స్‌పోర్ట్స్ రూ.1,33,980 కోట్లు. ఆరోగ్య సేవలపై వ్యయం తగ్గించుకోవడానికి చాలా దేశాలు తక్కువ ధరలో లభించే జనరిక్ డ్రగ్స్‌కు మళ్లుతున్నాయి. అలాగే యూఎస్ మార్కెట్ రికవరీ, ధరలు స్థిరపడడం, చైనా నియంత్రణ పరమైన నిర్ణయాలు ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేయనున్నాయని రవి ఉదయ భాస్కర్ తెలిపారు. మోస్తరుగా లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో ఫార్మా కంపెనీల లాభాలు మోస్తరుగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంత క్రితం మూడు త్రైమాసికాలు లాభాల్లో వృద్ధి కొనసాగింది. అమ్మకాల్లో 9–12 శాతం వృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులకు ప్రధాన కేంద్రం అయిన యూఎస్ మార్కెట్ 10–11 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త ఉత్పత్తుల అనుమతులు తగ్గడం యూఎస్ అమ్మకాలపై ప్రభావం చూపనుంది. ఇక డాక్టర్ రెడ్డీస్‌కు అయిదారు కొత్త ఉత్పత్తుల అమ్మకాలు తోడు కానున్నాయి. మార్చి త్రైమాసికంలో దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సన్ ఫార్మాకు కలిసిరానుంది. సెన్సిపార్ జనరిక్ డ్రగ్స్‌కు పోటీ పెరగడంతో దీని ప్రభావం సిప్లాపై ఉండనుంది. పెగ్ఫిల్గ్రాస్టిక్ అనే ఔషధం బయోకాన్ అమ్మకాలు పెరిగేందుకు తోడవనుంది. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా, ఐపీసీఏ వంటి కంపెనీలకు దేశీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపనుంది. యూఎస్‌లో ధర నియంత్రణలతో ఈ కంపెనీల మార్జిన్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు నియంత్రణ సంస్థల అడ్డంకులనూ ఇవి ఎదుర్కొంటున్నాయి. టోరెంట్, అరబిందో, గ్లెన్‌మార్క్, లుపిన్ వంటి సంస్థలు వార్నింగ్ లెటర్లను అందుకున్నాయి. -
దేశీ ఫార్మాకు ఎఫ్‌డీఏ జ్వరం..!
భారతీయ ఫార్మా కంపెనీలకు కామధేనువుగా ఉన్న అమెరికా... ఇప్పుడు చేదు గుళికలా మారుతోంది. అక్కడి ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)పరంగా చిక్కులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్లాంట్లలో తయారీ ప్రమాణాలు, ఔషధాల నాణ్యతకు సంబంధించి .. ఇటీవలి కాలంలో ఎఫ్‌డీఏ నుంచి వచ్చే హెచ్చరికలతో కంపెనీలకు షాక్‌లమీద షాక్ తగులుతోంది. గతేడాది 7 లెటర్స్ రాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 12 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపారాలకు రిస్కులను తగ్గించుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ప్రధాన ఔషధాల ఉత్పత్తి, సరఫరాకు ఒకే సైటుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి దిగుమతులపై నిషేధం వర్తించేలా నోటీసులేమైనా వస్తే .. ఇబ్బందిపడకుండా ప్రత్యామ్నాయంగా తయారీ సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. తమ దేశానికి దిగుమతయ్యే ఔషధాల నాణ్యత, వాటి తయారీ ప్రమాణాలను ఎఫ్‌డీఏ తరచూ సమీక్షిస్తుంది. ఆయా ఔషధాలు తయారయ్యే ప్లాంట్లలో తనిఖీలు నిర్వహిస్తుంది. అక్కడ పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, ఉల్లంఘనల తీవ్రతను బట్టి వివిధ స్థాయుల్లో నోటీసులు ఇస్తుంటుంది. అధికారికంగా తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలుంటే ఓఏఐ కింద, స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన చర్యలుంటే వీఏఐ కింద, ఎలాంటి చర్యలు అవసరం లేకపోతే ఎన్ఏఐ కింద వర్గీకరిస్తూ తదనుగుణంగా లేఖలు పంపుతుంది. సాధారణంగా ఓఏఐ స్థాయి ఉల్లంఘనలు ఉంటే.. వార్నింగ్ లెటర్లు వస్తుంటాయి. సదరు ప్లాంటులో తయారు చేసే ఔషధాలకు సంబంధించి పేటెంట్లేమైనా పెండింగ్‌లో ఉన్న పక్షంలో.. ఈ వార్నింగ్ లెటర్ల ప్రతికూల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. తెలంగాణలోని అరబిందో ఫార్మా ఏడో యూనిట్‌కు సంబంధించి జారీ చేసిన ఫారం 483 (తనిఖీ నివేదిక వంటిది)లో ఎఫ్‌డీఏ ఏడు అంశాలను ప్రస్తావించింది. ఈ సైటు నుంచి 33 ఔషధాల తయారీకి అరబిందో చేసుకున్న దరఖాస్తులు ఎఫ్‌డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 483లో ప్రస్తావించిన తీవ్రమైన అంశాలకు సంబంధించి ఎఫ్‌డీఏ నుంచి మరిన్ని సూచనలు రావొచ్చని, తదుపరి వార్నింగ్ లెటర్.. ఆపై మరీ పరిస్థితి దిగజారితే దిగుమతి అలర్టులూ రావొచ్చని బ్రోకరేజి సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. అయితే, అరబిందోకు ప్రత్యామ్నాయంగా చాలా ప్లాంట్లు ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా టోరెంట్‌కు లెటర్.. గురువారం టోరెంట్ ఫార్మాకు చెందిన ఇంద్రాద్ (గుజరాత్) ప్లాంటుకు ఇలాంటి వార్నింగ్ లెటరే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి 16 దాకా ఈ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌డీఏ ఆ తర్వాత దీన్ని జారీ చేసింది. ఔషధాల తయారీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నట్లు టోరెంట్ వెల్లడించింది. 2019 మార్చి 11–19 మధ్య దహేజ్ ప్లాంటులో కూడా ఇలాంటి ఉల్లంఘనలే కనిపించాయని, పలు సైట్లలో ఇలాంటివి బైటపడటం కంపెనీ యాజమాన్య వైఫల్యాన్ని తెలియజేస్తోందని ఎఫ్‌డీఏ వ్యాఖ్యానించింది. వీటిని సరిదిద్దుకోకపోతే ఇంద్రాద్ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రీకాల్స్తో సందేహాలు .. వాస్తవానికి.. దేశీ ఫార్మా కంపెనీలు పలు ఔషధాల బ్యాచ్‌లను గతేడాది వివిధ అంశాల కారణంగా వెనక్కి తెప్పించడం ఎఫ్‌డీఏ దృష్టిలో పడిందని విశ్లేషకులు తెలిపారు. అందుకే తనిఖీలను మరింతగా పెంచిందని పేర్కొన్నారు. 2018లో భారతీయ కంపెనీలు 58 రీకాల్స్ ప్రకటించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 87 శాతం అధికమని విశ్లేషకులు తెలిపారు. అంతే కాకుండా.. 2015–18 మధ్య కాలంలో జనరిక్ ఔషధాలకు అనుమతులు పెరగడంతో పోటీ కూడా తీవ్రంగా పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ చెప్పారు. దీనితో ఎఫ్‌డీఏ తనిఖీలు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశీ ఫార్మా కంపెనీలకు అత్యధికంగా 2017లో 16, 2015లో 17 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఎఫ్‌డీఏ తనిఖీలకు సంబంధించి ఇప్పటిదాకా 12 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ప్రత్యామ్నాయ సైట్లపై కసరత్తు.. ఇలాంటి పరిణామాలు ఎదురైతే వ్యాపారం దెబ్బతినకుండా చూసుకునేందుకు ఫార్మా కంపెనీలు కొన్నాళ్లుగా వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఒకే ప్లాంటుపై ఆధారపడకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయ వనరులను కూడా అభివృద్ధి చేసుకోవడం కొనసాగిస్తున్నట్లు సిప్లా గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కేదార్ ఉపాధ్యే తెలిపారు. అహ్మదాబాద్ దగ్గర్లోని మొరాయాలోని క్యాడిలా హెల్త్‌కేర్ ప్లాంటుకు 2015 డిసెంబర్లో వార్నింగ్ లెటరు వచ్చింది. అప్పటికి అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో ఆ ప్లాంటు వాటా 60 శాతం దాకా ఉండేది. లెటర్స్ దరిమిలా ఆ ప్లాంటులో కార్యకలాపాలు స్తంభించి, వ్యాపారం దెబ్బతినకుండా క్యాడిలా మొరాయా ప్లాంటులో తయారయ్యే 9 ఉత్పత్తులను ఇతర ప్లాంట్లకు మళ్లించింది. గ్లెన్‌మార్క్ కూడా బహుళ సైట్స్ వ్యూహాలను పాటిస్తోంది. -
భారత ఫార్మాపై కుట్ర జరుగుతోంది..
• ఇక్కడి కంపెనీలపై తప్పుడు ఆరోపణలు • ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న భారత ఫార్మా రంగం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) అభిప్రాయపడింది. అంతర్జాతీయ జనరిక్స్ మార్కెట్లో పోటీనిస్తున్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోందని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియాకు అరబిందో ఫార్మా, ఆర్చిడ్ కెమికల్స్, ఆసియాటిక్ డ్రగ్స్లు కారణమవుతున్నాయని లండన్‌కు చెందిన చేంజింగ్ మార్కెట్స్ అనే స్వచ్చంద సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. జనరిక్ ఔషధాల తయారీలో ప్రపంచంలోని టాప్-20 సంస్థల్లో భారత్ నుంచి 8 ఉన్నాయని అప్పాజీ గుర్తుచేశారు. భారీ ఆర్డర్లను దక్కించుకుంటున్నాయన్న కారణంగా ఇక్కడి కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. నిజం లేదని తేలింది: పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్, కార్బాపెనిమ్ తయారవుతున్న అరబిందోకు చెందిన యూనిట్-7 సమీపంలో సేకరించిన వ్యర్థాల్లో ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా దర్శనమిచ్చినట్టు చేంజింగ్ మార్కెట్ ఆరోపించింది. అయితే యూనిట్-7లో ఈ ఔషధాలను కంపెనీ తయారు చేయడం లేదు. పైగా యూనిట్-11 నుంచి శుద్ధి చేసిన మురుగునీరు పైపుల ద్వారా నియంత్రణ సంస్థలు నిర్దేశించిన సముద్రం లోపల వదులుతోంది. చేంజింగ్ మార్కెట్ ఆరోపణల్లో నిజం లేదని దీనినిబట్టి అర్థమౌతోందని ఫార్మెక్సిల్ అదనపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు రవి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. -
ఐదేళ్లలో ఫార్మా వృద్ధి మూడింతలు...
న్యూఢిల్లీ: భారత ఫార్మా రంగం ఐదేళ్లలో మూడింతల వృద్ధిని సాధిస్తుందని అసోచామ్, టెక్‌సై రీసెర్చ్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. కొన్ని సమస్యలు ఉన్పప్పటికీ ప్రస్తుతం 1,800 కోట్ల డాలర్లుగా ఉన్న ప్రస్తుత భారత ఫార్మా రంగం 2020 నాటికి 5,500 కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... అమెరికా, రష్యా, ఆఫ్రికా దేశాల్లో కఠిన నిబంధనల కారణంగా ఫార్మా రంగ ఎగుమతులు వార్షికంగా 8% చొప్పున మాత్రమే చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. నాణ్యత గల జనరిక్ ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండటంతో అమెరికాకు మన భారత కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల ద్వారా ఆదాయం పెరుగుదలలో కరెన్సీ కదలికలు కీలకమైనవి.