హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా మార్కెట్ వృద్ధి సెప్టెంబర్‌లో 2.1 శాతానికే పరిమితమైంది. 2022 సెప్టెంబరులో పరిశ్రమ ఏకంగా 13.2 శాతం వృద్ధి సాధించింది. ఆల్ ఇండియా ఆరిజిన్ కెమిస్ట్స్, డి్రస్టిబ్యూటర్స్ ప్రకారం.. అధిక బేస్, పరిమాణం పెరుగుదలలో సవాళ్ల కారణంగా దేశీయ ఔషధ రంగం 2023 సెప్టెంబర్‌లో వరుసగా ఐదవ నెలలో తక్కువ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ధర, కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా మొత్తం వృద్ధి సాధ్యమైంది.
2023 జనవరి–సెప్టెంబరులో దాదాపు స్థిరంగా 5–6 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా రేటింగ్స్ ఫార్మా మార్కెట్ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10–11 శాతం ఉంటుందని అంచనా వేసింది. పరిమాణం 2022 సెప్టెంబర్‌లో 4.5 శాతం పెరిగితే, గత నెలలో 5.6 శాతం క్షీణించింది. ధరలు గతేడాది 6.6 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.8 శాతం దూసుకెళ్లాయి. నూతన ఉత్పత్తుల పెరుగుదల 2022 సెప్టెంబర్‌లో 1.9 శాతం ఉంటే, గత నెలలో ఇది 2.9 శాతం నమోదైంది. మొత్తంగా భారతీయ ఫార్మా మార్కెట్ సగటు వృద్ధి సంవత్సరానికి 6.5 శాతం వద్ద ఆరోగ్యంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment