ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి | terror attack on army base camp | Sakshi
Sakshi News home page

ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి

Published Fri, May 26 2017 5:26 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి

ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి

► 15 మంది సైనికుల మృతి

కాందహార్‌: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారీ తాలిబాన్లు రెచ్చిపోయారు. రెండు రోజుల క్రితం పది మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శుక్రవారం ఆర్మీ బేస్‌పై దాడి చేసి మరో 15 మంది సైనికులను కాల్చి చంపారు. కాందహార్‌ ప్రావిన్సు షావలీ కోట్‌ జిల్లాలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే, మృతుల సంఖ్య ఇరవై వరకు ఉంటుందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిపిన దాడిలో పది మంది సైనికులు చనిపోయారు. తాజా ఘటనలో నేపథ్యంలో తాలిబాన్లు మరింత బలం పుంజుకున్నారని స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement