army base camp
-
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు
ఇంపాల్: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. #WATCH | NDRF, SDRF, State Government and Railways workers involved in rescue work at the landslide-hit Tupul station building in Noney, Manipur (Video credit: CPRO, NF Railway) pic.twitter.com/N7zo2pLaY7 — ANI (@ANI) June 30, 2022 చదవండి: ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం -
ఉడీ తరహా దాడి కుట్ర భగ్నం
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కశ్మీర్‌లోని ఆర్మీ బ్రిగేడ్ ప్రధానకార్యాలయం ఉన్న ఉడీలోని కల్గాయ్‌లో ఆదివారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో కల్గాయ్ ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఒక జవాను, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 18న ఉడీ స్థావరంపై జరిపిన దాడి తరహాలోనే ఈసారీ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని, ముందస్తు సమాచారం అందటంతో కుట్రను భగ్నంచేశామని డీజీపీ వాయిద్ తెలిపారు. -
ఆర్మీ బేస్‌పై తాలిబాన్ల దాడి
► 15 మంది సైనికుల మృతి కాందహార్: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారీ తాలిబాన్లు రెచ్చిపోయారు. రెండు రోజుల క్రితం పది మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శుక్రవారం ఆర్మీ బేస్‌పై దాడి చేసి మరో 15 మంది సైనికులను కాల్చి చంపారు. కాందహార్ ప్రావిన్సు షావలీ కోట్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మృతుల సంఖ్య ఇరవై వరకు ఉంటుందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిపిన దాడిలో పది మంది సైనికులు చనిపోయారు. తాజా ఘటనలో నేపథ్యంలో తాలిబాన్లు మరింత బలం పుంజుకున్నారని స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. -
భీకరకాల్పులు.. 32 మంది తీవ్రవాదులు హతం
డమాస్కస్(సిరియా): సిరియా సైన్యానికి, ఐఎస్ తీవ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని అల్‌జర్రా మిలిటరీ స్థావరాన్ని ఐఎస్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు విధేయంగా ఉన్న దళాలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్వోహెచ్ఆర్) ప్రకటించింది. 17మంది సైనికులు అమరులు కాగా, 32 మంది ఐఎస్ తీవ్రవాదులు అంతమయ్యారని పేర్కొంది. కాగా, సిరియా సైన్యం అల్ జిర్రా ఎయిర్‌బేస్ చుట్టుపక్కలున్న 12 పట్టణాలను తిరిగి వశం చేసుకోవడం శుభపరిణామం. అయితే ఐసిస్‌ను అంతం చేసేంతవరకు అక్కడ తమ పోరు ఆగదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. -
శ్రీనగర్‌లో ఉగ్రదాడి..
ముగ్గురు జవాన్ల మృతి శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వానా జిల్లాలో ఉగ్రవాదులు.. జవాన్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలిసింది. పాంపోర్‌లోని కండ్లబల్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు తేరుకుని ఎదురుదాడి చేసేటప్పటికే.. ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఘటన జరిగే సమయానికి ప్రజలు కూడా రోడ్లపైనే ఉండటంతో కాల్పులు జరిపేందుకు వీలు కాలేదని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ క్యాంపుకు నిత్యావసరాలను తరలించే కీలకమైన పాంపోర్ ప్రాంతంలో కాన్వాయ్‌పై దాడి జరగటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. కాగా, రెండ్రోజుల క్రితం అనంతనాగ్, బారాముల్లా ప్రాంతాల్లో ఇద్దరు మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతోనే ఈ దాడులు జరిగి ఉండొచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.