ఉడీ తరహా దాడి కుట్ర భగ్నం | Security forces thwart Uri-like attack plan, kill three militants | Sakshi
Sakshi News home page

ఉడీ తరహా దాడి కుట్ర భగ్నం

Published Mon, Sep 25 2017 3:33 AM | Last Updated on Mon, Sep 25 2017 3:33 AM

Security forces thwart Uri-like attack plan, kill three militants

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కశ్మీర్‌లోని ఆర్మీ బ్రిగేడ్‌ ప్రధానకార్యాలయం ఉన్న ఉడీలోని కల్గాయ్‌లో ఆదివారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో కల్గాయ్‌ ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఒక జవాను, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 18న ఉడీ స్థావరంపై జరిపిన దాడి తరహాలోనే ఈసారీ ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేశారని, ముందస్తు సమాచారం అందటంతో కుట్రను భగ్నంచేశామని డీజీపీ వాయిద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement