suside attempt
-
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్‌తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం శుక్రవారం రాత్రి తన బావమరిది ఎం.శివతో కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలు తీయడంతో తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో సుబ్రమణ్యం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కన్న తల్లిని హతమార్చిన కూతురు వాల్మీకిపురం : కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిని హతమార్చిన సంఘటన వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకొంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహళ్ నివాసి యర్రక్క (43) స్థానికంగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేది. కుటుంబ కలహాలతో ఆదివారం కూతురు నందిని, అల్లుడు శివరాంలు ఐరన్ రాడ్, కట్టెలతో కొట్టి యర్రక్కను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నాగేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం మదనపల్లె : తాను ఇప్పించిన రుణం చెల్లించకపోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్థాపం చెంది, వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె లో జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన తిరుపాల్ నాయక్ భార్య తిరుపాలమ్మ (42), స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉన్న స్వరూపారాణి పట్టణంలో హోటల్ నిర్వహిస్తోంది. దీంతో వ్యాపార అవసరాల కోసం తిరుపాలమ్మను నగదు రుణంగా కావాలని కోరింది. ఆమె సుమారు పది లక్షల రూపాయల వరకు స్వరూప రాణికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని అప్పుగా ఇచ్చింది. అయితే స్వరూపారాణి తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో, తిరుపాలమ్మ ఆమెను అప్పు చెల్లించాల్సిందిగా నిలదీసింది. స్వరూప రాణి అప్పు చెల్లించకపోగా దాడికి పాల్పడింది. దీంతో మనస్థాపం చెందిన తిరుపాలమ్మ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన భర్త!
గోపాల్పేట: సెల్ఫీవీడియో తీసి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. రేవల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బాలకిష్టమ్మల కుమారుడు శివకు లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శారదతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. మంగళవారం శివ మూడు నిమిషాల సెల్ఫీ వీడియో తీశాడు. అందులో తాను మరణిస్తున్నానని తన చావుకు కేవలం తన భార్యే కారణమని, తాను మరణిస్తే భార్యపైనే చర్యలు తీసుకోవాలని వీడియోలో చెప్పాడు. గొడవలు జరిగి పెద్దలను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదని, రేవల్లి పోలీసులు సైతం తనని పట్టించుకోలేదని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. వీడియో రేవల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమయ్యేసరికి కొందరు యువకులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో శివ కుటుంబ సభ్యులు, పోలీసులు వారి ఇంటికెళ్లి చూడగా అప్పటికే పురుగుల మందు తాగి ఉన్నాడు. వెంటనే అతన్ని రేవల్లి సీహెచ్‌సీకి తరలించారు. తరచుగా తన కుమారుడిని కోడలు వేధించేదని, వారు వనపర్తి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లిలో జీవనం గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత శివను వదిలేసి హైదరాబాద్ వెళ్లిందని, ఆ తర్వాత ఆమె రాకపోవడంతో శివ ఆవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రేవల్లి ఎస్ఐ శివకుమార్‌ను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని, రెండు రోజుల్లో అతని ఆరోగ్యం కుదుట పడ్డాక బాధితులతో వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం శివ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. -
ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!
బల్మూర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. పెద్దల సమక్షంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. బల్మూర్ మండలంలోని బాణాలకు చెందిన కోట్ర శారద, అదే గ్రామానికి చెందిన మల్లేష్లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది కిందట యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అతడికి విడాకులు ఇవ్వాలని.. నేను పెళ్లి చేసుకుంటానని మల్లేష్ నమ్మించడంతో మూడు నెలల కిందట శారద తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం మల్లేష్ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బల్మూర్‌లో పంచాయితీ పెట్టి మాట్లాడుతుండగా.. మల్లేష్ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో పాటు కొందరు పెద్దలు శారదను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నారని, ప్రేమికుడితో పెళ్లి చేయించాలని కోరుతున్నారని ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. -
నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గోపాల్పేట: నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన బీసమ్మకు కూతురు, కుమారుడు ఉండగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కూతురు వారి అత్తారింటికి వెళ్లగా, కుమారుడు పరశురాములు భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చేందుకు పరశురాములు వచ్చాడు. సాయంత్రం స్థానికులతో చిన్నపాటి గొడవ అయ్యింది. దీంతో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఉన్న పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం నొప్పి తాళలేక కేకలు వేశాడు. నిద్రలేచిన తల్లి బీసమ్మ మంటలు ఆర్పి అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించినట్లు తెలిసింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com బైక్‌పై నుంచి పడి వివాహిత దుర్మరణం కల్వకుర్తి టౌన్: సొంత పనులు ముగించుకొని ఇంటికి బైక్‌పై తిరిగి వెళ్తున్న భార్యభర్తలు ప్రమాదవాశత్తు కిందపడగా, భార్య మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్కొండ మండలంలోని జకినాలపల్లి అమ్మాయిపల్లి తండాకు చెందిన దేవేందర్, ఆయన భార్య కవిత (28)తో కలిసి కల్వకుర్తికి సొంత పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని ఇంటి వద్ద నీటి కోసం డ్రమ్మును తీసుకొని బైక్‌పై తిరుగు పయణమయ్యారు. పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీస్ వద్దకు రాగానే బైక్‌పై గాలికి తోడు డ్రమ్ము ఖాళీగా ఉండటంతో డ్రమ్ముతో సహా కవిత జారి కిందపడిపోయింది. వెంటనే దేవేందర్ కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తలకు తీవ్ర గాయం కావటంతో అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బాలానగర్: బాలానగర్ మండలంలోని అప్పాజిపల్లికి చెందిన కొత్తూర్ శారద (32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గత డిసెంబర్ 28న వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగగా.. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి దగ్ధం ఉప్పునుంతల: మండలంలోని మర్రిపల్లిలో బుధవారం మధ్యాహ్నం బంటు సైదులుకు చెందిన ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇంట్లోని తిండి గింజలతో పాటు ఇతర వస్తువులు, సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. రూ.50 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ సమయంలో సైదులు కుటుంబ సభ్యులు వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు నీళ్లు చల్లి మంటలు ఆర్పి వేశారు. ఆపాటికే ఇంట్లో ఉన్న బియ్యం, టీవీ, ఇతర వస్తువులు, దుస్తులు, పాలతిన్ కవర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తాగిన మైకంలో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా!
కోస్గి: పట్టణ శివారులోని బీఎస్ఎన్ఎల్ టవర్‌పైకి ఎక్కిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 100కు ఫోన్ చేసి హల్చల్ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నదమ్ములు భూమిలో సరిగా భాగం ఇవ్వడం లేదని, అడిగితే దాడి చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని చంద్రవంచకు చెందిన రాంచందర్ ఈ ఏడాది జూన్ 25న తాగిన మైకంలో పోలీస్‌స్టేషన్‌లోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తాజాగా అదే యువకుడు గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. మధ్యాహ్నం 2 గంటలకు డయల్ 100కు కాల్చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. 250 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌పై నుంచి ఆ యువకుడిని కిందకి దించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కి అక్కడే నిద్రపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసులు అక్కడే ఏడు గంటల పాటు ఉండి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. ఎత్తు ఎక్కువగా ఉండటంతో టవర్‌పైకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. చివరకు మత్తు దిగడం.. చలి ఎక్కువ కావడంతో అతడే కిందకు రావడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ జనార్దన్ కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె!
చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన కొడారు శ్రీనివాస్‌రావు(41) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి కుమారులు లేరు. కుమార్తె మౌనిక మాత్రమే సంతానం. కొడుకులు లేకపోవడంతో మౌనిక తన తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఈ ఘటనను చూసి పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం వలిగొండ: మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలమణి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు భర్త, కుమారుడు, కూమార్తె ఉన్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్ల అపహరణ ఆత్మకూరు(ఎం): వ్యవసాయ బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన తుమ్మల మహేందర్‌రెడ్డి ట్రాక్టర్ ఇంజన్‌తో పాటు లింగరాజుపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీశైలం ట్రాక్టర్ ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీంతో బాధితులు బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇసుక డంపు సీజ్ నూతనకల్: మండల పరిధిలోని గుండ్లసింగారం ఆవాసంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తోడి మామిడి తోటలో నిల్వ చేశారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని సుమారు 80ట్రిప్పుల ఇసుకను నిల్వ చేసినట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూవృద్ధుడి మృతి రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన అల్లం ముత్తయ్య(75) ఈనెల 2న తన మేనకోడలు ఊరైన పేరందేవిగూడేనికి ఆటోలో వెళ్తూ చిన్న సూరారం వద్ద దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తయ్య తలకు, రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు అల్లం రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సింగం రామ్మూర్తి తెలిపారు. -
కోర్టు ఆవరణలో పెట్రోల్ ఒంటిపై పోసుకొని వ్యక్తి ఆత్మహత్మ యత్నం
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మేకల పోశం అలియాస్ గ్యాస్ పోశం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పోశంకు రాజీవ్‌నగర్‌కే చెందిన మహేశ్‌తో పాత గొడవలున్నాయి. ఈ నెల 3న ఇద్దరూ గొడవ పడ్డారు. మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోశం మంగళవారం కోర్టు ఆవరణలోకి వచ్చి, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అక్కడే విధుల్లో ఉన్న ఎన్టీపీసీ ఠాణా కానిస్టేబుల్ పురుషోత్తం, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అభి, కోర్టు హోంగార్డు నాగేశ్వర్‌రావులు అడ్డుకున్నారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్?
సాక్షి, బళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా పోలీస్టేషన్ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్ఐ పరశురామ్ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య
సనత్‌నగర్: తమ్ముడి భార్య కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బబ్బుగూడకు చెందిన శీలం వీరస్వామి, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరస్వామి రెండో కుమారుడు హరినాథ్‌కు 2020లో తాండూరుకు చెందిన భాగ్యలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధిస్తున్నారని భర్త హరినాథ్‌తో పాటు అతడి సోదరుడు ప్రసాద్, ఇతర కుటుంబసభ్యులపై తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భాగ్యలక్ష్మీకి రూ.12 లక్షలు ఇచ్చి రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం పలు దఫాలుగా డబ్బు చెల్లించాల్సి ఉంది. గత నెల రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా సర్దుబాటు కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హనుమంతు తరచూ ప్రసాద్‌కు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. అతడితో పాటు పోలీసులు కూడా ఫోన్ చేస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రసాద్ గురువారం ఉదయం తమ్ముడి భార్య కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తండ్రిని హతమార్చిన కూతురు) -
చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి
నాగర్‌కర్నూల్: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్రవంతి భర్త 8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు -
చిట్టీవ్యాపారి ఇంటి ఎదుట దంపతుల ఆందోళన
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన బిజిగిరి ప్రభాకర్ భార్య కవితతో కలిసి జమ్మికుంట పట్టణంలోని చిట్టీ వ్యాపారి రమేశ్ ఇంటి ఎదుట మంగళవారం బైఠాయించాడు. చిట్టీ పాడుకుని ష్యూరిటీగా ఇచ్చిన బ్లాంక్ చెక్కును చిట్టీ డబ్బులు మొత్తం చెల్లించన తర్వాత కూడా రమేశ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెక్కు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుడు ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలో ప్రభాకర్ గతంలో సెలూన్ షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్దనే కటింగ్ చేయించుకునే చిట్టీ వ్యాపారి రమేశ్ తన వద్ద చిట్టీ వేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్ రూ.9 లక్షల చిట్టీ వేశాడు. ప్రారంభమైన మొదటి నెలలోనే చిట్టీని యాక్షన్‌లో రూ.4.50 లక్షలకు పాడిన ప్రభాకర్ ష్యూరిటీగా రమేశ్‌కు బ్లాంక్ చెక్కు ఇచ్చాడు. అయితే రమేశ్ చిట్టీ డబ్బులు రూ.4.50 లక్షల కు బదులు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఈక్రమంలో ప్రతి నెల చిట్టీ డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభాకర్ సుమారు రూ.3.60 లక్షలు కట్టాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చిట్టీ కట్టలేనని చెప్పాడు. తనకు రావాల్సి డబ్బులు, బ్లాంక్ చెక్కు ఇవ్వాలని రమేశ్‌ను కోరాడు. చిట్టి వ్యాపారి మాత్రం చెక్కును కోర్టులో వేసి ప్రభాకర్‌కే నోటీసులు పంపించాడు. దీనిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య పంచాయతీ జరిగిందని, అందులో రూ.2 లక్షలు చిట్టి వ్యాపారికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభాకర్ ముట్టజెప్పాడు. అయినా చెక్కు ఇవ్వకపోవడంతో భార్యతో కలిసి ఆందోళనకు దిగాడు. తన వెంట సూపర్వాస్మ తెచ్చుకుని చెక్కు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించారు. ఇంటో రమేశ్ లేకపోవడంతో పరిస్థితిని ఆయన భార్యకు వారు వివరించారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఉదయం 9 నుంచి రాత్రి7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి న్యాయం చేస్తామంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
ఆత్మాహుతి దాడి:18 మంది మృతి
-
ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు శుక్రవారం కారుబాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి 18 మంది ప్రాణాలు తీశారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మొగదిషులో తిరుగుతోందని సోమాలియా హోం మంత్రి గురువారమే హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు పేలుళ్లను అడ్డుకోలేకపోయాయి. సోమాలియా నిఘా విభాగం ప్రధాన కార్యాలయం వద్ద తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు సమీపంలో రెండో దాడి చోటుచేసుకుంది. -
భవనంపై నుంచి దూకిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
సాక్షి, మచిలీపట్టణం: కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపిచంద్ నాయక్ అనే విద్యార్థి భవనంపై నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపిచంద్ నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉడీ తరహా దాడి కుట్ర భగ్నం
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కశ్మీర్‌లోని ఆర్మీ బ్రిగేడ్ ప్రధానకార్యాలయం ఉన్న ఉడీలోని కల్గాయ్‌లో ఆదివారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో కల్గాయ్ ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఒక జవాను, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 18న ఉడీ స్థావరంపై జరిపిన దాడి తరహాలోనే ఈసారీ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారని, ముందస్తు సమాచారం అందటంతో కుట్రను భగ్నంచేశామని డీజీపీ వాయిద్ తెలిపారు. -
బాలిక ఆత్మహత్య
అప్పరాజ్‌పల్లి(గూడూరు) : తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అప్పరాజ్‌పల్లిలో గురువా రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లుట్ల నీలమ్మ భర్త మృతిచెందగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె కూతురు శ్రీలత(15) 6వ తరగతి చదువుతోంది. ఉదయం ఇంట్లో సెల్ఫో¯ŒS పాడైన విషయమై తల్లి కూతురిని మందలించింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీలత ఇంట్లోని కిరోసి¯ŒS ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తట్టుకోలేక అరుస్తుండగా గుర్తించిన తల్లి అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు చేరుకొని బాలికపై మంటలార్పి వెంటనే మానుకోటలోని 108కు సమాచారమిచ్చారు. అందులో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలానికి చెందిన ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయల మరియమ్మ, మంగయ్య దంపతులు పెదవేగి మండలం ముండూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంతకాలంగా మరియమ్మ తనను ఎవరో పిలుస్తున్నారని, తమతో వచ్చేయమని చెవిలో చెబుతున్నారని కుటుంబసభ్యులతో చెబుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఏదో పీడ ఆవరించిందని భావించి తాయిత్తులు, గండాలు కట్టించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితురాలి భర్త మంగయ్య, తండ్రి బాలాస్వామికి సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.