రాంచందర్‌కు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ జనార్దన్ . రాంచందర్ ఎక్కిన సెల్‌టవర్ ఇదే..
కోస్గి: పట్టణ శివారులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పైకి ఎక్కిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 100కు ఫోన్ చేసి హల్‌చల్ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నదమ్ములు భూమిలో సరిగా భాగం ఇవ్వడం లేదని, అడిగితే దాడి చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని చంద్రవంచకు చెందిన రాంచందర్ ఈ ఏడాది జూన్ 25న తాగిన మైకంలో పోలీస్‌స్టేషన్‌లోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
తాజాగా అదే యువకుడు గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కాడు. మధ్యాహ్నం 2 గంటలకు డయల్ 100కు కాల్‌చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. 250 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌పై నుంచి ఆ యువకుడిని కిందకి దించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కి అక్కడే నిద్రపోయాడు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసులు అక్కడే ఏడు గంటల పాటు ఉండి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. ఎత్తు ఎక్కువగా ఉండటంతో టవర్‌పైకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు.
చివరకు మత్తు దిగడం.. చలి ఎక్కువ కావడంతో అతడే కిందకు రావడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ జనార్దన్ కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment