శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. | Pampore Attack: 3 Soldiers Killed After Terrorists Attack Army Convoy Near Srinagar | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో ఉగ్రదాడి..

Published Sun, Dec 18 2016 3:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. - Sakshi

శ్రీనగర్‌లో ఉగ్రదాడి..

ముగ్గురు జవాన్ల మృతి  
శ్రీనగర్‌: కశ్మీర్‌లోని పుల్వానా జిల్లాలో ఉగ్రవాదులు.. జవాన్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలిసింది. పాంపోర్‌లోని కండ్లబల్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు తేరుకుని ఎదురుదాడి చేసేటప్పటికే.. ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఘటన జరిగే సమయానికి ప్రజలు కూడా రోడ్లపైనే ఉండటంతో కాల్పులు జరిపేందుకు వీలు కాలేదని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్‌ క్యాంపుకు నిత్యావసరాలను తరలించే కీలకమైన పాంపోర్‌ ప్రాంతంలో కాన్వాయ్‌పై దాడి జరగటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. కాగా, రెండ్రోజుల క్రితం అనంతనాగ్, బారాముల్లా ప్రాంతాల్లో ఇద్దరు మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతోనే ఈ దాడులు జరిగి ఉండొచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement