జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్‌లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment