Anantnag
-
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
లోయలో పడిన టాటా సుమో.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాందంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనం టాటాసుమో కిష్త్వార్ వైపు నుంచి వస్తున్న సమయంలో లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీ మారింది. అలాగే మూడో దశలో కాకుండా ఆరో దశలో (మే 25) ఓటింగ్ జరగనుంది. గతంలో ఇక్కడ మే 7న ఓటింగ్ నిర్వహించాలనుకున్నారు.అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఇటీవల కురిసిన మంచు, కొండచరియలు విరిగిపడటమే దీనికి కారణమని సమాచారం. మంచు కురియడానికి తోడు, కొండచరియలు విరిగిపడటం వలన అనంతనాగ్- రాజౌరిలను కలిపే మొఘల్ రహదారిని బ్లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగడం లేదని, దీనికితోడు ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపధ్యంలోనే అందిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ స్థానంలో ఇప్పటికే నామినేషన్ల దాఖలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాగా జమ్ముకశ్మీర్‌లోని రాంబన్, బనిహాల్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మరొకరు కాలువలో కొట్టుకుపోయారు. వర్షాల కారణంగా 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్, బనిహాల్ మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదానికి అధికారులు మూసివేశారు. -
గులాంనబీ రాజకీయ అస్త్రసన్యాసం
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్ రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆజాద్ బుధవారం(ఏప్రిల్17) ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) తరపున జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనన్నట్లు ఆజాద్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. అనంత్‌నాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున మహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అల్తాఫ్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5 వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
అనంతనాగ్ ఎన్కౌంటర్లో మేజర్ ఆశీష్ వీరమరణం
-
కశ్మీర్లో ఉగ్రఘాతుకం
రాజౌరీ/జమ్మూ: ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు మాటువేసి మెరుపుదాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీలు వీరమరణం పొందారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గరోల్ దగ్గర్లోని కొకొరెనాగ్ కొండ ప్రాంతంలో జరిగింది. రాజౌరీలో ఉగ్రకాల్పుల్లో జవానును కాపాడబోయి సైనిక జాగిలం కెంట్ ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఈ కాల్పుల ఘటన జరగడం విషాదకరం. బుధవారం ఉదయం సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొకొరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి అయిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్ భట్ నేలకొరిగారు. J-K: Army Colonel, Major killed in gunfight with terrorists in Anantnag Read @ANI Story |https://t.co/29Tvl95ZE6#IndianArmy #TerroristAttack #Anantnag pic.twitter.com/HsGielfLEy — ANI Digital (@ani_digital) September 13, 2023 జమ్మూకశ్మీర్ మాజీ ఐజీ గులామ్ హసన్ భట్ కుమారుడే ఈ హుమయూన్. కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్ జిల్లాలోని హలన్ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి. Anantnag encounter | A Jammu and Kashmir Police official also lost his life in the encounter. The Army officers were leading the troops from the front after they had gone to search for terrorists in the area based on specific intelligence: Indian Army officials — ANI (@ANI) September 13, 2023 ఇదీ చదవండి: సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
కశ్మీర్: అనంతనాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం నాడు అనంతనాగ్ వాగ్మా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్యాప్తు జరుగుతున్నట్లు.. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. సోమవారం నాడు చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో హిజ్బుల్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ ఉన్నాడు. ఇతడి మరణంతో దోడా జిల్లా ఉగ్రవాదరహిత జిల్లాగా మారినట్లు పోలీసులు ప్రకటించారు. -
కశ్మీర్లో 19 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో 19 మంది పోలీసులకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మొత్తం 103 మంది సాయుధ పోలీసు బలగాల శాంపిళ్లను పరీక్షించగా 19 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది. అనంత్‌నాగ్‌లోని జిల్లా పోలీస్ లైన్స్ ఆస్పత్రిలో వీరి శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకూ 1183 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 13 మంది మరణించారు. చదవండి : కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్ -
ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదుల హతం
అనంత్‌నాగ్ : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులను హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిర్థిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు. -
మిలిటెంట్ల డెన్‌లో అజిత్ దోవల్ పర్యటన
అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శనివారం అనంత్‌నాగ్‌లో పర్యటించారు. అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఉగ్రవాదులకు అడ్డగా పేరొంది.. జమ్మూకశ్మీర్‌లో మిలిటెన్సీకి కేంద్రంగా ఉన్న అనంత్‌నాగ్‌లో అజిత్ దోవల్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంత్‌నాగ్‌లో ఇటీవల పెద్దసంఖ్యలో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో స్థానికంగా పర్యటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అజిత్ దోవల్ స్థానికులతో మమేకమవుతూ.. వారి బాగోగులు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంత్‌నాగ్‌లో పర్యటించిన దోవల్.. వీధుల్లో తిరుగుతూ తనకు ఎదురుపడిన స్థానికులతో మాట్లాడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించారు. మౌల్వీలు, కార్మికులు, పాదచారులు.. ఇలా అనేక మందితో మాటామంతి కలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ గొర్రెల వ్యాపారి దోవల్‌తో మాట్లాడుతుండగా.. అతన్ని మరొకరు ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. దీనికి అతను తెలియదని బదులిచ్చాడు. అదేం పెద్ద సమస్య కాదని దోవల్ బదులిచ్చారు. మరో వీడియోలో నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ బంధువులతో, ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉందని దోవల్‌కు పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
కశ్మీర్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్
జమ్మూ కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ మేజర్ మరణించినట్టు, అదే ర్యాంకు ఉన్న మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు భద్రత బలగాల ఉన్నతాధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులను శ్రీనగర్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 12న భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు సీఆర్పీఎస్ పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. . -
బీజేపీ ఉపాధ్యక్షుడి కాల్చివేత
శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌కు కొద్దిగంటల ముందు అనంత్ నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ నివాసాన్ని చుట్టముట్టిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపారు. జిల్లాలోని నౌగ్రాం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2008, 2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దురూ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మిర్ చాలాకాలంగా బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మిర్‌కు భద్రతను అధికారులు ఉపసంహరించడంతో ఈ దారుణం జరిగిందని బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆరోపించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా మిర్‌కు భద్రతా సంస్ధలు భద్రతను కల్పించలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా మిర్‌కు భద్రతపై అధికారులకు తాము పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. మిర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఓ కుమారుడు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు విడతల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం జరగనున్న అయిదో దశ పోలింగ్‌కు 48 గంటల ముందు బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. -
అనంత్‌నాగ్ సీటుకు ఎందుకు ఎన్నికలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, శాంతి భద్రతల పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సునీల్ అరోరా చెప్పారు. అలాంటప్పుడు 2016 నుంచి ఖాళీగా ఉన్న అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ? 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉగ్ర ఆత్మాహుతి దాడి జరిగిన పుల్వామా జిల్లా కూడా ఈ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోనే ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా అనంత్‌నాగ్ నియోజక వర్గానికి మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కల్లోలిత కశ్మీర్ అయినాసరే, మూడు విడతలుగా ఓ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించడం అన్నది అసాధారణ విశయం. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా లేదన్నప్పుడు ఎందుకు అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సీనియర్ నాయకుడు మొహమ్మద్ సాగర్ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మెహబూబా ముఫ్తీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హిజుబుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మరణించడంతో ఈ నియోజకవర్గంలో నిరసనలు, ఘర్షణలు, కాల్పులు చోటుచేసుకొని పలువురు పౌరులు మరణించారు. దాంతో అప్పట్లో ఎన్నికలు నిర్వహించ కూడదని అనుకున్నారు. 2017, ఏప్రిల్ నెలలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించానుకున్నారు. అప్పుడు తలెత్తిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. దాంతో ఈ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడం వెనక దురుద్దేశం ఉందని బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నారు. కశ్మీర్ ప్రజలు ఈ ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరిస్తారుకనుక, కొద్ది మంది బీజేపీ కార్యకర్తల ఓటింగ్‌తో ఈ సీటును అతి సులభంగా దక్కించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహమని ఆ పార్టీలు విమర్శిస్తున్నారు. -
ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్..
శ్రీనగర్ : దేశ ఎన్నికల చరిత్రలోనే ఓ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలేదని, అక్కడ కేవలం లోక్‌సభ ఎన్నికలే జరుగుతాయని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువరిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పేర్కొన్నారు. అనంత్‌నాగ్ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆరు లోక్‌సభ స్ధానాల్లో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్‌లో బారాముల్లా, జమ్మూ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుండగా, 18న శ్రీనగర్, ఉధంపూర్ నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. మే 6న లడఖ్‌లో పోలింగ్ జరగనుండగా, అనంత్‌నాగ్ స్ధానంలో ఏప్రిల్ 23, 29 మే 6న మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మే 23న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి. -
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి
-
సరిహద్దులో అలజడి; వరుస ఎన్కౌంటర్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్‌గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
‘బిడ్డా.. ఇంటికి రా’ అని పోస్టు పెట్టాడు.. అంతలోనే!
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 18 ఏళ్ల ఫర్హాన్ వనీ కూడా ప్రాణాలు విడిచాడు. కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామానికి చెందిన ఫర్హాన్ వనీ గత ఏడాది మధ్యలో మిలిటెన్సీలో చేరాడు. గత నవంబర్‌లో అతని తండ్రి గులం మహమ్మద్ వనీ ఫేస్బుక్లో కొడుకును ఉద్దేశించి భావోద్వేగమైన పోస్టు పెట్టాడు. ‘బిడ్డా హింసను విడనాడి.. ఇంటికి తిరిగిరా’ అంటూ హృదయాన్ని పిండేసిరీతిలో విజ్ఞప్తి చేశాడు. ‘బిడ్డా.. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిన నాటినుంచి నా శరీరం నా మాట వినడం లేదు. నువ్వు చేసిన దానికి బాధతో నేను అల్లాడిపోతున్నాను. అయినా నువ్వు ఇంటికి తిరిగి వస్తావన్న నమ్మకం నాలో ఉంది’ అని గులాం నవంబర్ 24న వనీ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. ‘చిరునవ్వుతో కూడిన నీ ముఖాన్ని నేనెంతగా మిస్ అవుతున్నానో వివరించలేను. నువ్వు వెళ్లి ఆరు నెలలు అవుతోంది. నీ ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా నాకు గడవడం లేదు. నువ్వు బాగున్నావని, బాగుంటావని ఆశతో బతుకుతున్నాను. నేను నీ తండ్రిని. నేను కాకపోతే ఈ విషయాన్ని ఎవరు నీకు చెప్తారు.. నేను చనిపోతానేమో అనిపిస్తోంది. నాకు మరో మార్గం లేదు. నీకు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఎంతో నేర్పించాల్సి ఉంది. తిడుతూ నీకు సాయం చేయాల్సి ఉంది’ అంటూ హృదయాన్ని కదిలించేరీతిలో గులాం ఈ పోస్టు పెట్టారు. వనీ తల్లి కూడా కొడుకు కోసం ఎంతో తపించిపోతున్నదని, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వదిలి ఇంటికి తిరిగి రావాలని, గడిచిందంతా మరిచిపోవాలని, నువ్వు ఎంచుకున్న మార్గం వల్ల నువ్వు శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం కూడా ఉందని, కాబట్టి త్వరగా ఇంటికి తిరిగిరావాలని వేడుకుంటూ గులాం ఈ పోస్టు పెట్టాడు. మిలిటెన్సీలో చేరిన ఫుట్‌బాలర్ మజిద్ ఖాన్.. తన తల్లిదండ్రులు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు చూసి.. తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నేపథ్యంలో గులాం కూడా అదే ఆశతో ఈ పోస్టు పెట్టాడు. పోలీసులు కూడా మిలిటెన్సీలో కలిసిపోయిన స్థానిక యువకులు, విద్యార్థులు తిరిగి జనజీవనస్రవంతిలో కలువాలని, వారిపై ఎలాంటి కేసులు, విచారణలు ఉండవని భరోసా ఇస్తున్నారు. అయినా, అతని పోస్టు వృథానే అయింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఫర్హాన్ వనీ మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది. -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ము,కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం భద్రతదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కోకేర్ నాగ్ లార్నూ అటవీప్రాంతంలో ఉగ్రవాదుల దాక్కున్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. -
ఉగ్రదాడి: కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రెండ్రోజుల పాటు విద్యాసంస్థలు కూడా మూసివేయనున్నారు. అయితే అమర్నాథ్ యాత్ర మాత్రం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. జమ్ము నుంచి పలు యాత్రికుల బృందాలు అమర్నాథ్ బయలుదేరాయి. నేటి నుంచి పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచే భద్రతా బలగాలు జుమ్ముకు చేరుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు దాడికేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో నిన్న ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది యాత్రికులు గాయపడ్డ విషయం తెలిసిందే. మృతులంతా గుజరాత్ వాసులని సమాచారం. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర దాడి
ఏడుగురు యాత్రికుల దుర్మరణం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఘటన ► 32 మందికి గాయాలు.. మృతులంతా గుజరాత్‌కు చెందినవారే ► జమ్మూ–శ్రీనగర్ హైవేలో మొదట పోలీసు బంకర్‌పై ఉగ్రవాదుల కాల్పులు ► గట్టిగా తిప్పికొట్టిన పోలీసులు.. తర్వాత యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి ► ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్, జైట్లీ ఖండన శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర నెత్తురోడింది. పవిత్ర హిమలింగాన్ని శంభోహరహర అంటూ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వస్థలానికి పయనమైన అమాయక భక్తులపై ఉగ్రవాద రక్కసి పంజా విసిరింది. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి 8.20 గంటలకు ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. తర్వాత ముష్కరులు ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డారు. అక్కడా పోలీసులు గట్టిగా తిప్పికొట్టారు. ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతుండగా అక్కడికొచ్చిన యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. బస్సు అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యాత్రికులను తీసుకుని సోనామార్గ్ నుంచి జమ్మూ వెళ్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులెవరూ గాయపడలేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి.. దాడికి గురైన బస్సు అమర్నాథ్ యాత్రికుల వాహనశ్రేణిలో భాగం కాదు కనుక దానికి భద్రత కల్పించలేదని పోలీసులు తెలిపారు. ‘హైవేపై రాత్రి 7 గంటల నుంచి భద్రతను ఉపసంహరిస్తారు కనుక ఆ సమయం తర్వాత రోడ్డుపై యాత్రికుల బస్సులు రాకూడదన్న యాత్ర నిబంధనలను బస్సు డ్రైవర్ ఉల్లంఘించాడు. జీజే09జెడ్ 9976 నంబరున్న ఈ బస్సు అమర్నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేసుకోలేదు. సీఆర్పీఎఫ్ విస్తృత రక్షణ కల్పించే వాహన శ్రేణిలో ఇది భాగం కాదు. విడిగా వచ్చింది’ అని తెలిపారు. ఈ ఘటనతో జమ్మూ–శ్రీనగర్ హైవేను మూసేసి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భద్రతా బలగాలు హతమార్చిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడొచ్చన్న అనుమానంతో అధికారులు శని, ఆదివారాల్లో అమర్యాత్రను నిలిపేసి సోమవారం తిరిగి ప్రారంభించారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాలు సంయుక్తంగా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులపై 2000 ఆగస్టు 1న పహల్గావ్లో ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని బలితీసుకున్నారు. భారత్ బెదరదు: మోదీ న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికులపై దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు. ‘శాంతియుతంగా సాగుతున్న యాత్రపై ఉగ్రవాదుల పిరికిపంద దాడి మాటలకందని బాధ కలిగించింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులు, ద్వేషపూరిత దుష్ట పన్నాగాలకు భారత్ ఎన్నటికీ బెదరబోదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. ఓహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీలతో మాట్లాడానని, అవసరమైన సాయమంతా అందిస్తానని హామీ ఇచ్చానని వెల్లడించారు. దాడి అత్యంత గర్హనీయమని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న తమ సంకల్పాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్.. ఓహ్రా, ముఫ్తీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. యాత్రకు గట్టి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదులు కశ్మీర్ సంప్రదాయాలు, విలువలపై దాడి చేశారని ముఫ్తీ మండిపడ్డారు. దాడిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ఖండించారు. ముగ్గురు ఉగ్రవాదుల హతం శ్రీనగర్/న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముగ్గు రు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆదివారం తమ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు చనిపోయారని, రెండు బంకర్లను ధ్వంసం చేశామన్న పాక్ వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత సైనికులు తీవ్రంగా గాయపడినా, చనిపోయినా దేశ ప్రజలకు తెలియజేసే జవాబుదారీతనం తమకు ఉందని స్పష్టం చేశారు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా హజవిరా ఆచాబాల్లో పోలీస్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ అధికారితో పాటు అయిదుగురు పోలీసులు మృతి చెందారు. కాగా ఈ దాడిలో సుమారు 15మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో టాప్ లష్కరే తోయిబా కమాండర్ జునేద్ మట్టూ మరణించాడు. అనంత్‌నాగ్ జిల్లాలోని ఆర్వాణీ గ్రామంలో తీవ్రవాదులన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో కమాండర్‌తో మరో ఇద్దరు లష్కరే మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలను చూడగానే స్థానిక యువత రాళ్ల దాడి ప్రారంభించింది. పలు ఉగ్రదాడుల్లో జునేద్ హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. ఇక నిన్న వేర్వేరు ఘటనల్లో ఉగ్రదాడుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. -
ఉగ్రవాదుల బరితెగింపు..
- కొత్త నోట్ల కోసం బ్యాంకు దోపిడీ యత్నం అనంతనాగ్: పాత నోట్ల రద్దు..ఉగ్రవాద,తీవ్రవాద కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందన్న మాట నిజమని మరోసారి రుజువైంది. తమ కార్యక్రమాల విస్తరణ కోసం కొత్త నోట్లు అవసరమైన ఉగ్ర సంస్థలు ఏకంగా బ్యాంకులనే టార్గెట్ చేసుకున్నాయి. శుక్రవారం కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకున్న దోపిడీ యత్నం ఉగ్రవాదుల బరితెగింపును వెలుగులోకి తెచ్చేదిలా ఉంది. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్ లోని బ్యాంకులపై జరిగిన ఐదో దాడి ఇది. అనంత్ నాగ్ జిల్లా కేంద్రంలోని ఒక బ్యాంకును కొట్టగొట్టేందుకు సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముష్కరులు తోకముడవక తప్పలేదు. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడిని చెరపట్టగా, మరొకడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు తుపాకి పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ యత్నం చేసిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సిఉంది. కాగా, జనవరిలో ఇదే అనంత్ నాగ్ పట్టణంలో దుండగులు ఎటీఎంను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ బ్యాంక్ కు చెందిన ఆ ఏటీఎంలో రూ.14 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటివే మరో రెండు ఘటనలూ చోటుచేసుకున్దేనాయి. ఆ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే నేడు మరో దోపిడీ ఘటన చోటుచేసుకోవడం కశ్మీర్ లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతాప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. -
ఇంట్లో నక్కిన ముగ్గురు తీవ్రవాదులు
జమ్ము కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అవూరా గ్రామంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఓ ఇంట్లో ముగ్గురు తీవ్రవాదులు నక్కినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
ఏకే 47 బుల్లెట్లు దిగినా..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. -
ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని వేర్వేరు ప్రాంతాలలో మిలిటెంట్లు కాల్పులకు పాల్పడి ఒక ఉన్నతా అధికారి సహా ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. అనంత్ నాగ్ జిల్లాలో శనివారం ఉదయం పోలీస్ పార్టీపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. కాగా 24 గంటల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. శుక్రవారం సాయంత్రం బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమంది గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు అనంత్ నాగ్ జిల్లాలో జూన్ 22న ఉప ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ తండ్రి మఫ్తీ మహ్మద్ సయిద్ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.