
కశ్మీర్: అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం నాడు అనంతనాగ్ వాగ్మా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్యాప్తు జరుగుతున్నట్లు.. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. సోమవారం నాడు చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో హిజ్బుల్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ ఉన్నాడు. ఇతడి మరణంతో దోడా జిల్లా ఉగ్రవాదరహిత జిల్లాగా మారినట్లు పోలీసులు ప్రకటించారు.