న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌లో జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మోత మోగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లలో ఇది ఒకటి. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడపా జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment