హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ : ఉగ్రవాది హతం | Terrorist Killed Search Operations Underway Over Handwara Encounter | Sakshi
Sakshi News home page

హంద్వారాలో ఎన్‌కౌంటర్‌ : ఉగ్రవాది హతం

Published Thu, Mar 7 2019 10:17 AM | Last Updated on Thu, Mar 7 2019 10:17 AM

Terrorist Killed  Search Operations Underway Over Handwara Encounter - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని హంద్వారాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్ట్‌ మరణించాడు. హంద్వారా సమీపంలోని క్రాల్‌గండ్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

కాగా, ఈ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసి భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఇండో-పాక్‌ దళాల మధ్య కాల్పులు, ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. గత రెండు రోజుల్లో జమ్మూ కశ్మీర్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్‌ కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement