జమ్మూ కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ మేజర్ మరణించినట్టు, అదే ర్యాంకు ఉన్న మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు భద్రత బలగాల ఉన్నతాధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులను శ్రీనగర్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 12న భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సీఆర్‌పీఎస్ పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
.
Comments
Please login to add a commentAdd a comment