శ్రీనగర్ : దేశ ఎన్నికల చరిత్రలోనే ఓ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలేదని, అక్కడ కేవలం లోక్‌సభ ఎన్నికలే జరుగుతాయని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువరిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పేర్కొన్నారు.
అనంత్‌నాగ్ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆరు లోక్‌సభ స్ధానాల్లో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్‌లో బారాముల్లా, జమ్మూ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుండగా, 18న శ్రీనగర్, ఉధంపూర్ నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. మే 6న లడఖ్‌లో పోలింగ్ జరగనుండగా, అనంత్‌నాగ్ స్ధానంలో ఏప్రిల్ 23, 29 మే 6న మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మే 23న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment