జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాందంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనం టాటాసుమో కిష్త్వార్ వైపు నుంచి వస్తున్న సమయంలో లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment