George
-
కార్డినల్‌గా కేరళ బిషప్
తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్ ప్రకటించినట్టు వాటికన్ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్ సీజన్ మొదలయ్యే డిసెంబర్ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జాకబ్ నాలుగేళ్లుగా పోప్ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్ ఆర్క్డయాసిస్కు చెందిన జాకబ్ వాటికన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004 జూలై 24న చర్చి ఫాదర్ అయ్యారు.కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్ సైతం..కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్ మైకోలా బైచోక్ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉక్రెయిన్ గ్రీకు కేథలిక్ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. -
లోయలో పడిన టాటా సుమో.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాందంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనం టాటాసుమో కిష్త్వార్ వైపు నుంచి వస్తున్న సమయంలో లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బైడెన్ తప్పుకోవడమే మంచిది: హాలీవుడ్ హీరో
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నుంచి సైతం బైడెన్ అభ్యర్ధిత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల బైడెన్ సొంత పార్టీకి చెందిన మహిళా సెనేటర్ నాన్సీ పెలోసి బైడెన్.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అన్నారు.తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ అందుస్తున్న ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం అద్యక్షుడు జో బైడెన్‌పై పోటీపై పెదవి విరిచారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు బైడెన్ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని కోరుతూ ప్రముఖ వార్తా ప్రతిక న్యూయార్క్ టైమ్స్‌లో భావోద్వేగమైన లేఖ చేశారు.బైడెన్‌తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న జార్జ్.. డెమొక్రాటిక్ పార్టీకి మద్దతునిచ్చే హాలీవుడ్ ఎలైట్ సభ్యులలో ఒకరు. పార్టీ కోసం ఎన్నోసార్లు నిధులు కూడా సేకరించారు. క్లూనీ తను రాసిన లేఖలో.. బైడెన్ తనకు మంచి మిత్రుడని, అతన్ని ఎంతో నమ్ముతానని చెప్పారు. గతంలో తన కోసం ఎంతో పనిచేశానని గుర్తు చేశారు.అయితే అప్పటి బైడెన్ కు.. ఇప్పుడున్న బైడెన్ కు చాలా తేడా ఉందని రాశారు. అతను సమయానికి వ్యతిరేకంగా గెలవలేని ఒక యుద్ధంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. "నాకు చెప్పేందుకు మాటలు రావడం లేదు. కానీ మూడు వారాల క్రితం ఫండ్ రైజర్‌లో నేను కలిసిన జో బైడెన్.. ఒకప్పటి ఓ బైడెన్ వేరు. అతనిలో చాలా మార్పులు వచ్చాయి. 2010, 2020 చూసిన బైడెన్ కూడా కాదు. ఆయనలో ఎలాంటి ఉత్సాహం లేదు. బైడెన్ అంటే ఇటీవల డిబెట్లో చూసిన వ్యక్తినే మనం చూశాం.. ట్రంప్ తో జరిగిన చర్చలో తన ప్రదర్శన పేలవంగా ఉంది.డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బిడెన్‌ను ఉపసంహరించుకోవాలని బహిరంగంగా పిలుపునివ్వంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇక బైడెన్ తనంటే తానే తప్పుకోవడం మంచిది." అని భావోద్వేగంగా లేఖలో రాశారుఅయితే ఎన్నికలకు నాలుగు నెలలముందు బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడుతుందనే వాదనను క్లూనీ కొట్టి పారేశారు. బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆగస్టులో జరిగే డెమొక్రాట్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ కమాలా హ్యారిస్, మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, ఇతర నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.మరోవైపు జో బైడెన్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లలో చక్ షుమర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి లాంటి అగ్రనాయకులతో పాటు.. డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు సేనేటర్లు కూడా ఉన్నారు. అందుకే వారంతా బైడెన్ ని తప్పకోవాలని బహిరంగంగా చెబుతున్నారు. -
దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!
మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కేడీ జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 29న మరణించాడు. తనను చివరి చూపు చూసుకోవడానికి, అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు, బంధువులెవరూ ముందుకు రాలేదు. రెండు వారాలుగా మార్చురీలోనే ఆయన శవం కుళ్లిపోతోంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వ జోక్యంతో సంక్రాంతి పండగరోజే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సొంతిల్లు.. వెళ్లడానికి డబ్బు లేదు జార్జ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ నిర్మాత జి. శిబు సుశీలన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. '1993లో ఏవీఎమ్ స్టూడియోలోని ఎడిటింగ్ రూమ్‌లో తొలిసారి జార్జ్‌ను కలిశాను. సినిమాలపై ఆసక్తితో అతడు చెన్నై నుంచి కేరళ వచ్చేశాడు. గంభీరమైన కంఠంతో మాట్లాడే అతడి స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాడు. తనకు చెన్నైలో సొంతిల్లు ఉంది. కానీ అక్కడికి వెళ్లడానికి డబ్బు లేదని ఆయన నాతో చెప్పిన మాట నాకింకా గుర్తుంది. సినిమాల ద్వారా తనకు పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. సొంతింటికి వెళ్లి బతకాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. డిసెంబర్ 27న ఆస్పత్రిలో.. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫెఫ్కా(డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్) వంటి కొన్ని సంస్థల సాయం వల్ల బతుకుబండి లాగించాడు. ఆ తర్వాత తిరిగి సినిమా ప్రాజెక్టులు చేశాడు. డిసెంబర్ 27 సాయంత్రం అతడు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందింది. వెంటనే మా యూనియన్‌తో మాట్లాడి తనకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించాం. వెంటనే అతడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కానీ తను పోరాటం చేసీచేసీ అలిసిపోయాడు. అనాథ శవంలా.. డిసెంబర్ 29న కన్నుమూశాడు. అతడు చనిపోయి 16 రోజులపైనే అవుతున్నా తన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అంత్యక్రియల బాధ్యతను భుజానెత్తుకుంది. కానీ అనాథ శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. బంధువులు ఎవరో ఒకరు వస్తేనే మృతదేహాన్ని అప్పజెప్తామంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జనవరి 15న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి' అని తెలిపాడు. చదవండి: చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్ రిలీజ్.. -
కిరణ్ జార్జికి సింగిల్స్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోరీ్నలో 23 ఏళ్ల కిరణ్ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్ కూ తకహాíÙపై గెలుపొందాడు. కిరణ్ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చీరను వండింది
టెక్నాలజీ ఎంతవేగంగా ఎదుగుతోందో మనిషిలోని సృజనాత్మకత అంతే వేగంగా విభిన్న కోణాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటివిటీకి హద్దులు లేకపోవడంతో అనేక రంగాల్లో చిత్రవిచిత్ర ఆలోచనలకు రూపురేఖలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అగ్గిపెట్టెలో పట్టగలిగే చీరలు, బంగారంతో నేసిన చీరలను తయారు చేయడం గురించి విన్నాం. తాజాగా కేరళకు చెందిన మహిళా బేకర్ నమిలి మింగేయగల సరికొత్త చీరను రూపొందించింది. మహిళలు ధరించే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్‌తో కేరళ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చీర ఉండడం విశేషం. కేరళలోని కొల్లంకు చెందిన అన్నా ఎలిజబెత్ జార్జ్... క్యాన్సర్ అండ్ న్యూరోబయాలజీలో పీహెచ్డీ చేస్తోంది. ఒక పక్క చదువుతూనే మరోపక్క తన కిష్టమైన కుకింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇటీవల ముగిసిన ఓనం వేడుకల్లో సరికొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే మలయాళీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, కేరళలో జరిగే ప్రతి సంప్రదాయ కార్యక్రమానికి తప్పసరిగా కట్టుకునే ‘కేరళ కసువ చీర’ను సరికొత్తగా రూపొందించింది. తెల్లని రంగు, గోల్డెన్ జరీ అంచుతో ఉండే కసువా చీరను బంగాళ దుంప గుజ్జుతో చేసిన పొడి, బియ్యప్పిండిని ఉపయోగించి చీరను తయారు చేసింది. అన్నా.. వంటలు చేయడమేగాక ఫ్యాషన్ డిజైనర్‌గా, ఫ్లోరిస్ట్ గా రాణిస్తుండడంతో, తన సృజనాత్మకతను కొంత జోడించి... దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యప్పిండిలని కలిపి అరఠావు పరిమాణంలో పలుచటి పొరను తయారు చేసి వాటిని చీరకు బేస్‌గా వాడింది. అలా దాదాపు వంద పలుచటి పొరలను వాడి ఐదున్నర మీటర్ల చీరను రూపొందించింది. కేక్ డెకరేషన్స్‌లో వాడే గోల్డెన్ రంగులను చీర అంచుకు అద్దింది. ముప్పై గంటలపాటు శ్రమించి స్వీట్ చీరను తయారు చేసింది. తియ్యటి చీరకు మొత్తం ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. రెండు కేజీల బరువున్న ఈ చీరను భుజం మీద వేసుకుని, సరదాగా కొంగును కొరుకుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యి మాకు ఒకటి చేసివ్వండి అని కామెంట్లు చేస్తున్నారు. తన తాతయ్య జాకబ్ దగ్గర వంటలు నేర్చుకుంది అన్నా. తాతయ్య గుర్తుగా ఆయన పేరుమీద బేకింగ్, ఫ్లోరల్ ప్రాజెక్టులను చేస్తోంది.‡‘‘జీవితంలో తొలిసారి ఇంత ఖర్చు పెట్టి తియ్యటి చీరను తయారు చేసాను. ఓనంకు ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న ఉద్దేశ్యం తోనే ఈ చీరను తయారు చేసాను. కణజీవ శాస్త్రం (సెల్ బయాలజీ) పరిశోధకురాలిగా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశ్యంతో సెల్ బయాలజీని నా బేకింగ్ స్కిల్స్ యాడ్ చేసి ప్రపంచంలోనే తొలిసారి కట్టుకుని కొరుక్కు తినగల చీరను తయారు చేశాను’’ అని అన్నా చెప్పింది. -
ముత్తూట్‌లో బంగారం క్షేమమేనా? షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : బంగారు రుణ సంస్థ ముత్తూట్ గ్రూపు చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పద మరణం ఇన్వెస్టర్ల సెంటిమెంటును తీవ్రంగా ప్రభావితం చేసింది. వీంతో సోమవారం బుల్ మార్కెట్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభంలోనే 6.57 శాతం క్షీణించి బీఎస్ఈలో 1205 రూపాయల ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు సంస్థ పెద్ద మరణంతో ముత్తూట్ ఫైనాన్స్ లో తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో భారీ ఆందోళన నెలకొంది. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) జార్జ్ ముత్తూట్ అకాలమరణంపై విచారం వ్యక్తం చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఆయన నాయకత్వంలో సరికొత్త వృద్ధిని నమోదు చేసిందని, గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయ్యిందని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కుటుంబం, సన్నిహితులతోపాటు, కంపెనీకి, ఉద్యోగులకు తీరని నష్టమంటూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ముత్తూట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది, కానీ ఆయన మరణానికి కారణం కంపెనీ ప్రస్తావించలేదు. అయితే తన నివాసంలోని నాలుగో అంతస్తునుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేట్‌ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసులో వారు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని, ఎయిమ్స్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా వెల్లడించారు. కాగా జార్జ్ ముతూట్ అనుమానాస్పద పరిస్థితుల్లో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. జార్జ్ ముత్తూట్ 1993లో ముత్తూట్ గ్రూపునకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ భారీగా విస్తరించింది. గత దశాబ్దంలో మార్కెట్ క్యాప్‌ను దాదాపు ఎనిమిది రెట్ల మేర వృద్ధి చెందేలా కృషి చేశారు. -
వేలానికి కింగ్ జార్జి III వాచ్
లండన్: రాజులు వాడిన వస్తువులను, అప్పుడు వాడుకలో ఉన్న అలంకార వస్తువులను, రాజుల చరిత్రను తెలిపే మాన్యుస్క్రిప్ట్‌లను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. వీటిని కోట్లు కుమ్మరించి కొనుక్కుంటూ ఉంటారు. త్వరలో ప్రముఖ ఆక్షన్ కంపెనీ సోథెబే.. కింగ్ జార్జి III కోసం తయారుచేసిన అత్యంత విలువైన గడియారాన్ని, హొరాషియో నెల్సన్, ఎమ్మా హామిల్టన్ కు రాసిన ప్రేమలేఖలు, మొదటి ప్రపంచ యుద్దం నాటి ఆల్బమ్ వీటన్నింటిని వేలం వేయనుంది. వీటి విలువ 5 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా కింగ్ జార్జి III, నెపోలియన్ కాలం నాటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన బంగారు గడియారాన్ని ప్రముఖ వాచ్‌మేకర్ అబ్రహం-లూయిస్ బ్రెగ్యూట్ 1808లో జార్జ్ III కోసం తయారు చేశారు. ఇది దాదాపు మిలియన్ డాలర్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. (సహాయం కోసం వేలం) జి అండ్ ఆర్ అనే అక్షరాలతో చెక్కబడిన ఒక ప్లేట్ ఉంది. ఇది బ్రుగెట్ సృష్టించిన వాటిలో ప్రత్యేకమైనది. దానిని అప్పట్లో 4,800 ఫ్రెంచ్ ఫ్రాంక్‌లకు అమ్మారు. ఆ సమయంలో భారీ మొత్తాన్ని చెల్లించడంలో రాజు విఫలమయ్యాడు. ఈ వేలంలో లభించనున్న మరో ముఖ్యమైన వస్తువులలో ఒకటి కింగ్ నెల్సన్ తన ప్రేయసి హామిల్టన్‌కు రాసిన 100కు పైగా ప్రేమ లేఖలు ఉన్నాయి. వీటిలోని ఒక లేఖలో తన బాధను వ్యక్తపరుస్తూ.. ‘నేను ఆనందంగా లేను, మనం దూరంగా ఉండటం నాకు బాధను మాత్రమే మిగులుస్తుంది’ అని రాసివుంది. దీనికి 12000 పౌండ్ల వరకు పలికే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు మొదటి ప్రపంచానికి సంబంధించిన అనేక సందేశాలు, డ్రాయింగ్లు, కవితలు ఉన్న బ్రిటీష్ ఆల్బమ్ ఒకటి ఉంది. వీటితో పాటు మరెన్నో విలువైన వస్తువులు ఈ వేలంలో లభించనున్నాయి. జూలై 8-15 వరకు ఈ వేలం నిర్వహించనున్నారు. (వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్) -
ఊరికి దూరంగా... దేవునికి దగ్గరగా.. క్రిస్మస్!
తెల్లారితే క్రిస్మస్... ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఒక పాత ఇల్లు... దాన్ని ఆనుకొని ఒక కార్ రిపేర్ షాపు... చిమ్మచీకటి, భోరున కురుస్తున్న మంచు.. బయటి ప్రపంచం, కాలం అతనికి ఎప్పుడో అతని భార్య చనిపోయినప్పుడే పదేళ్ల క్రితమే స్తంభించింది ఆ ఇంట్లోని 70 ఏళ్ళ ముసలాయన జార్జ్‌కి ... క్రిస్మస్ అంటే అయిష్టమేమీ లేదు, కాకపోతే ఆనందమూ లేదు. ఏడాదిలో అదీ ఒక రోజు అంతే!! ఇంతరాత్రి కస్టమర్లెవరొస్తారులే అనుకొంటున్న సమయంలో ఒక అపరిచితుడు తలుపు తోసుకొని లోనికి వచ్చాడు. అతనూ వయసులో పెద్దవాడే. పాపం! బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు... ‘‘చలిగా ఉంది, వచ్చి హీటర్ వద్ద కూర్చోండి’’ అన్నాడు జార్జ్ జాలిగా... చలికి గడ్డకట్టుకుపోతున్న ఆ వ్యక్తికి ఆ మాటలు గుడిగంటల్లా వినిపించాయి. హీటర్ వద్ద కూర్చున్న ఆ అపరిచితునికి ఆ రాత్రి తన కోసం చేసుకున్న వేడి వేడి సూప్‌ను ఫ్లాస్కులో నుండి పోసి ఇచ్చాడు. ‘‘బయట చలి భరించలేక లోనికి వచ్చాను... మీరేమో నాకింత మంచి ఆతిథ్యమిస్తున్నారు’’ అన్నాడా అపరిచితుడు. సరిగ్గా అదే సమయంలో అతని ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఎవరో కస్టమర్ వచ్చాడన్న మాట!! తలుపు తీసి చూస్తే ఒక పాత కారు, దాని డ్రైవింగ్ సీట్లో ఒక యువకుడు... ‘‘నా భార్య నిండు చూలాలు, నొప్పులొస్తున్నాయి. కానీ నా కార్ ముందుకు సాగడం లేదు... కాస్త రిపేర్ చేస్తారా?’’ అనడిగాడా వ్యక్తి ఎంతో దీనంగా. అది రిపేరయ్యే కారు కాదని అతనికి అర్ధమై ఆ మాటే అతనితో అన్నాడు జార్జ్. ‘‘ప్లీజ్... నా భార్య చాలా ప్రమాదంలో ఉంది. సాయం చెయ్యండి’’ అంటూ ప్రాధేయపడుతున్నాడతను. జార్జ్ తలుపేసి లోపలికొచ్చి గోడకున్న తాళపు చెవుల గుత్తిలో నుండి తన కారు తాళం చెవులు తీసుకొని బయటికెళ్లి షెడ్డులోనుండి తన కార్ బయటికి తీసి అతనిముందు పెట్టి ‘‘నా ఈ కార్ తీసుకెళ్లండి. పాతదే కానీ బాగా పరుగెత్తుతుంది’’ అన్నాడు. అతని కారులోనుండి భార్యను ఎత్తి తన కారులో కూర్చోబెట్టడంలో సాయం చేసి...‘‘కంగారు పడొద్దు. నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్ళు. నీ భార్యకేమీ కాదు’’ అన్నాడు జార్జ్. అతని కారు వెళ్లిన తర్వాత ఇంట్లోకి వస్తూ ‘‘నా కాఫీ ఎలా ఉంది?’ అనడగబోతూ ఆగిపోయాడు. అపరిచితుడక్కడ లేడు, వెళ్ళిపోయాడు. పోనీలే అనుకొంటూ జార్జ్ సర్దుకొంటుండగా, తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. బయటికి పరుగెత్తాడు. ఎవరో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు ఆఫీసర్ గాయపడ్డాడు. అతను పోలీసు కారులో ఉన్నాడు. కాల్పులు జరిపిన వాడు పారిపోయాడు. జార్జ్ గతంలో సైన్యంలో పనిచేశాడు. ప్రథమ చికిత్స చెయ్యడం అతనికి తెలుసు. మెల్లిగా పోలీసు ఆఫీసర్‌ను లోనికి తెచ్చి పడుకోబెట్టి కట్టుకట్టాడు. నొప్పి తగ్గడానికి కొన్ని మాత్రలిచ్చి ‘మీ వాళ్లకు కబురు చేసి ఆంబులెన్స్ పిలిపిస్తాను’ అంటూ బయటికెళ్లి పోలీసు కారులోని వైర్లెస్ ద్వారా సమాచారం పంపి మళ్ళీ లోపలికొచ్చాడు. ‘‘థాంక్యూ. మీరు నాకు ఎంతో సాయం చేశారు, నా ప్రాణాలు కాపాడారు’’ అన్నాడా పోలీసు ఆఫీసర్ ఎంతో కృతజ్ఞతగా.. ‘‘ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు. గాయాలతో నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి బయట పడి ఉంటే నేను విస్మరించలేను... నేను చెయ్యగలిగింది నేను చేశాను’’ అన్నాడు జార్జ్. అతనికీ కాఫీ కప్పు ఇచ్చాడు. అతను కాఫీ తాగుతోంటే విసురుగా తలుపు తెరుచుకొని ఒక యువకుడు చేతిలో తుపాకీతో లోనికొచ్చాడు. ‘‘మీ వద్ద ఉన్న డబ్బులన్నీ బయటికి తీయండి’’ అంటూ తుపాకీతో బెదిరించాడు. ‘‘నన్ను ఇందాక గాయపర్చింది ఇతనే’’ అన్నాడు పోలీసు అధికారి. ‘‘బాబూ ముందా తుపాకీ పక్కన పెట్టు, నీకు కావలసింది ఇస్తాం’’ అన్నాడు జార్జ్. ‘‘ముసలోడా!! నోరు మూసుకొని ముందు డబ్బంతా బయటికి తియ్యి’’ అన్నాడా యువకుడు. పోలీసు అధికారి తన తుపాకీ తియ్యబోతుండగా ‘ఆ అవసరం లేదు’ అని అతన్ని వారించాడు జార్జ్. ‘‘ఈ రోజు క్రిస్మస్ ఈవ్ కదా... ఈ డబ్బంతా తీసుకో. దయచేసి నీ తుపాకీ మాత్రం పక్కన పెట్టు’’ అన్నాడు జార్జ్ అనునయంగా. తన వద్ద ఉన్న 150 డాలర్లు తీసుకెళ్లి జార్జ్ అతని చేతిలోపెట్టి, ‘‘చాలా ఇంకా కావాలా?’’ అనడిగాడు. ఆ యువకుడు అలసిపోయినవాడిలాగా తుపాకీ వదిలేసి మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయాడు. ‘‘నాకిలాంటి పనులు అలవాటు లేదు. నా ఉద్యోగం పోయింది, ఆరు నెలలు ఇంటి అద్దె బకాయిపడ్డాను. ఫైనాన్స్ వాళ్ళు నా కార్ తీసుకెళ్లిపోయారు. ఈ క్రిస్టమస్ కోసం నా భార్యకు, కొడుక్కు ఏమైనా కొందామనుకున్నానంతే’’ అంటూ ఆ యువకుడు ఏడుస్తున్నాడు. జార్జి అతని తుపాకీ తీసి పోలీసు ఆఫీసర్‌కి ఇచ్చాడు. ‘‘బాబూ! తప్పులు చేయడం మానవ సహజం. మనం ప్రయాణిస్తున్న దారిలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ పట్టుదలతో, కష్టపడే తత్వంతో వాటిని ఎదుర్కోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, కానీ ఇలా కాదు’’ అని చెప్పాడు జార్జ్. అతన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతనికీ ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. ‘‘కాస్త అలసట తీర్చుకో... అన్నీ కుదుటపడతాయి..’’ అన్నాడాయన.ఆ యువకుడు భోరున ఏడుస్తూ ‘‘సారీ, మిమ్మల్ని తుపాకీతో కాల్చాను’’ అంటూ పోలీసు అధికారికి క్షమాపణ చెప్పాడు. ‘‘నోరు మూసుకొని కాఫీ తాగు’’ అని బెదిరించాడా అధికారి. ఇంతలో ఆంబులెన్స్ వచ్చింది. ఇతర పోలీసు అధికారులొచ్చారు. ‘‘నీ మీద కాల్పులు జరిపింది వీడేనా?’’ అని ఆ యువకుని చూపిస్తూ వాళ్లడిగారు. ‘‘అతను కాదు... వాడు తుపాకీ ఇక్కడ పారేసి పారిపోయాడు’’ అని అధికారి జవాబిచ్చాడు. జార్జి, ఆ యువకుడు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ‘‘మరి ఇతనెవరు?’’ అని వాళ్లడిగారు అనుమానంగా. ‘‘ఈ రోజే కొత్తగా నావద్ద పనిలో చేరాడు’’ అని జార్జ్ వారికి బదులిచ్చాడు. అతన్ని ఆంబులెన్స్‌లోకి ఎత్తడంలో ఆ యువకుడు కూడా సాయం చేస్తూ ‘‘నన్నెందుకు క్షమించారు?’’ అని గుసగుసగా అడిగాడు. పోలీసు అధికారి చిన్నగా నవ్వుతూ ‘‘హ్యాపీ క్రిస్మస్’’ అన్నాడు. ‘‘నీకు కూడా జార్జ్... నాకెంతో సాయం చేశావు’’ అన్నాడతను. వాళ్ళు వెళ్లిపోయాక, జార్జ్ ఇంటిలోనికి వెళ్లి ఒక చిన్న పెట్టెలాంటిది తెచ్చి ఆ యువకునికిచ్చాడు. ‘‘నేనెంతో కాలం బతకను. కానీ దీంట్లోనివి నీకు అక్కరకొస్తాయి. నా భార్య మార్త బతికుంటే సరిగ్గా ఇదే పని చేసి ఉండేది’’ అన్నాడు జార్జ్. దాంట్లో చూస్తే అతని భార్య తాలూకు పెద్ద వజ్రపుటుంగరం అందులో ఉంది. ‘‘అయ్యో ఇంత ఖరీదైనది నేను తీసుకోలేను’’ అన్నాడా యువకుడు. ‘‘నువ్వు తప్పక దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దాని అవసరం నీకు ఉంది. నాకు అత్యంత విలువైన నా భార్య జ్ఞాపకాలు చాలు’’ అన్నాడు జార్జ్. ‘‘నీకున్న 150 డాలర్లు నాకిచ్చేశావు. ఇవి మాత్రం తీసుకోవాలి’’ అన్నాడా యువకుడు. సరేనంటూ అతన్ని వీధిలోకి సాగనంపి ఇంట్లోకి వచ్చి మంచం మీద అతను మేను వాలుస్తూ ఉండగా ఆ యువకుడు నవ్వుతూ మళ్ళీ లొనికొచ్చాడు. ‘‘నేను తలుపేశానుగా, లోనికెలా వచ్చావు?’’ అనడిగాడు జార్జ్ ఆశ్చర్యంగా. ‘‘నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకోవా?’’ అనడిగాడా యువకుడు. ‘‘నా భార్య మార్తతోటే ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. క్రిస్మస్ చేసుకునే ఓపిక నాకిప్పుడు లేదు’’ అన్నాడు జార్జ్. ఆ యువకుడు జార్జ్ భుజాలమీద చెయ్యి వేసి ‘‘కానీ నీ భార్య జ్ఞాపకాలతో నీవింకా అద్భుతంగా క్రిస్మస్ చేసుకుంటున్నావు జార్జ్. నీలాంటి వారు చాలా అరుదు. నీవు నాకు ఆహారమిచ్చావు, తాగడానికి కాఫీ ఇచ్చావు, హీటర్ వెచ్చదనాన్నిచ్చావు. నీవు సాయం చేసిన ఆ జంటకు కొడుకు పుట్టి గొప్ప డాక్టర్ అయి ఎంతో మందికి సేవచేస్తాడు. నీవు ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి మరెంతోమంది ప్రాణాలు కాపాడుతాడు. నీవు దారిచూపించిన నాలాంటి యువకుడు మరెంతో మందికి దారి చూపించి యేసుక్రీస్తు ప్రేమను, క్షమాపణను లోకానికంతటికీ చాటిచెప్పుతాడు...’’ అని అతను చెబుతుంటే ‘‘నీకివన్నీ ఎలా తెలుసు?’’ అనడిగాడు జార్జ్ ఆశ్చర్యంగా. ‘‘నేను ఎప్పుడూ నీవెంటే ఉంటాను జార్జ్, సదా నిన్ను నేను ఆవరించి ఉంటాను. ఇక వెళ్తాను మరి. లోకమంతా నా జన్మదినం జరుపుకోవడానికి సంసిద్ధమవుతోంది మరి, నేను లేకపోతే ఎలా?’’ అంటూ అతను నవ్వుతూ వెళ్లిపోతుండగా అతని చిరిగిపోయిన వస్త్రాలు తెల్లబడి బంగారు రంగులో మారి ధగధగా మెరిసిపోయాయి... ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోగా జార్జ్ మోకాళ్ళ మీదుం ‘‘హ్యాపీ బర్త్‌డే జీసస్’’ అన్నాడు. ‘జీసస్‌ను నా మార్త కూడా చూసి ఉంటే ఎంత బావుండేది’ అని జార్జ్ అనుకొంటూ ఉండగా, ‘‘నీ ప్రియమైన మార్త ఇపుడు నాకు ప్రియమైన కుమార్తె. ఆమె నాతోపాటే ఉంది జార్జ్’’ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చెప్పు వెనుక చరిత్ర.. ‘చెప్పు’కుందామా!
నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా.. మీ రుణం తీర్చుకోలేం బాబుగారూ ఈ డైలాగు మనం చాలా సినిమాల్లో విన్నాం.. అయితే.. ఎప్పుడైనా చూశారా? చర్మం వలిచి చెప్పులు కుట్టించడాన్ని!! ఓసారి పక్కనున్న షూపైన లుక్కేసుకోండి.. పై ప్రశ్నకు సమాధానం ఈ ఫొటోనే .. ఎందుకంటే.. ఇది చర్మం వలిచి కుట్టించిన చెప్పే!! అసలు ఇది సాధ్యమా? నిజమా? నిజమైతే.. అసలు ఎవరి చర్మాన్ని వలిచారు? ఎవరికి చెప్పులు కుట్టించారు? జవాబు దొరకాలంటే.. ఓసారి రింగులు తిప్పండి.. ఎందుకంటే.. మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నాం మరి.. 1878 సంవత్సరంలో ఒకానొక రోజు.. అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రం బిగ్ నోస్ జార్జ్ గ్యాంగ్ అలియాస్ జార్జ్ ప్యారెట్ గ్యాంగ్ ఓ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది. జార్జ్ ప్యారెట్ అంటే అప్పట్లో పేరొందిన బందిపోటు.. అతడికి పొడుగాటి ముక్కు ఉండటంతో అందరూ బిగ్ నోస్ జార్జ్ అని కూడా పిలిచేవారు.. అలాంటి జార్జ్ రైలు దోపిడీకి ప్లాన్ వేశాడు.. ఇప్పట్లో అంటే అంతా మొబైల్ పేమెంట్.. అప్పట్లో కాగితపు కరెన్సీనే.. ముఖ్యంగా జీతాల రోజున ఉద్యోగులకు చెల్లించడానికి బాక్సుల్లో డబ్బును రైళ్ల ద్వారా పంపేవారు.. జార్జ్ టార్గెట్ చేసింది కూడా అలాంటి రైలునే.. అప్పటికే అతడి గ్యాంగు సభ్యులు బోగీల మధ్య ఉన్న లంకెలను లూజ్ చేసి పెట్టారు.. బోగీలు విడిపోతే.. వాటిని దోచుకోవచ్చన్నది వీరి ప్లాన్.. అయితే.. రైలులో వేరే సీన్ నడుస్తోంది.. అప్పటికే దీన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది.. లింక్‌లు లూజ్ కాకుండా బిగించి.. పోలీసులకు సమాచారమిచ్చారు.. ఇక్కడ విషయం తెలియని జార్జ్.. రైలు కోసం ఎదురుచూస్తున్నాడు.. పోలీసులు వచ్చేశారు.. కాల్పులు.. గ్యాంగ్ సభ్యులు పారిపోయారు.. అయితే.. డిటెక్టివ్ టిప్ విన్సెంట్.. వయోమింగ్ డిప్యూటీ పోలీసు అధికారి రాబర్ట్‌లు బిగ్ నోస్ జార్జ్‌ను వెంటాడుతూ వెళ్లారు.. కానీ.. అంతలోనే.. ధన్.. ధన్ అంటూ శబ్దం.. జార్జ్ తుపాకీ గురి తప్పలేదు.. ఈ రాబర్ట్.. విన్సెంట్ మరణం పెద్ద సంచలనమైంది.. జార్జ్ తలపై వెలను 20 వేల డాలర్లుగా ప్రకటించారు.. రెండేళ్లు.. బిగ్ నోస్ హవా కొనసాగింది.. ఒకరోజు మోంటానాలోని బార్లో జార్జ్ తాగి వాగాడు.. పోలీసులను తానెలా చంపిం దీ గొప్పలు పోయాడు.. ఎవరో విషయం అధికారులకు చేరవేశారు.. వారొచ్చి.. తాగి పడున్న జార్జ్‌ను అరెస్టు చేసి తీసుకు పోయారు.. కోర్టులో విచారణ జరిగింది.. జార్జ్‌కు ఉరిశిక్ష పడింది.. సీన్ కట్ చేస్తే.. 1881 మార్చి 21 అర్ధరాత్రి.. జార్జ్‌కి ఉరి వేయడానికి 10 రోజుల ముందు... జైలు నుంచి తప్పించుకోవడానికి బిగ్ నోస్ ప్లాన్ వేశాడు.. బయట పడేవాడే.. కానీ చివరి నిమిషంలో దొరికిపోయాడు.. విషయం జనానికి తెలిసింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జైల్లోకి దూసుకెళ్లారు.. జార్జ్‌ను బయటికి లాగి.. టెలిఫోన్ స్తంభానికి కట్టేసి.. ఉరేశారు.. అతడి శవాన్ని తీసుకెళ్లడానికి సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో థామస్, జాన్ ఓస్బర్న్ అనే వైద్యులు తమ ప్రయోగాల నిమిత్తం వాడుకోవడానికి తీసుకెళ్లారు. అతడి క్రిమినల్ మనస్తత్వాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా అతడి మెదడులో ఏమైనా తేడా ఉందేమో పరిశీలించిడానికి జార్జ్ పుర్రె భాగాన్ని రెండుగా కోశారు. తర్వాత తర్వాత జాన్ చాలా చిత్రవిచిత్ర పనులకు పాల్పడ్డాడు. తాను ధరించడానికి వీలుగా జార్జ్ చర్మాన్ని వలిపించి.. డెన్వర్‌లోని ఓ ఫ్యాక్టరీలో షూ తయారుచేయించాడు. మిగతా బాడీని ఉప్పు నీటి మిశ్రమం కలిగిన పీపాలో ఉంచాడు.. పలు ప్రయోగాల తర్వాత ఆ పీపాను భూమిలో పాతించాడు. ఇంకో విషయం తెలుసా? 1893లో వయోమింగ్ గవర్నర్‌గా కూడా ఎన్నికైన జాన్.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జార్జ్ చర్మంతో తయారుచేసిన షూనే ధరించాడని చెబుతారు. తర్వాత చాన్నాళ్ల వరకూ బిగ్ నోస్ పేరు ఎక్కడా వినిపించలేదు.. 1950ల్లో మళ్లీ జార్జ్ పేరు వార్తల్లోకెక్కింది. ఓ చోట భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా.. ఆ పీపా బయటపడింది. అంతటి మహాబందిపోటు చెప్పుగా మారిన చరిత్ర బయటికొచ్చింది.. ఇప్పుడా చెప్పులు, జార్జ్ పుర్రె వంటివి వయోమింగ్‌లోని కార్బన్ కౌంటీ మ్యూజియంలో ఉన్నాయి. జార్జ్ చర్మంతోనే ఓ మెడిసిన్ బ్యాగ్‌ను కూడా తయారు చేయించారని చెబుతారు. అది మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అదీ దొరికితే.. ఆ కథను పార్ట్–2గా చెప్పుకుందాం.. ప్రస్తుతానికి ఇదండీ.. చెప్పు తాలూకు చరిత్ర! – సాక్షి, తెలంగాణ డెస్క్ -
వాటికన్ చర్చి మతాధిపతిపై లైంగిక ఆరోపణలు
మెల్బోర్న్ : వాటికన్ సిటీ చర్చిలో ఉన్నత స్థాయి ప్రవక్త, ఆస్ట్రేలియాకు చెందిన మతాధిపతి (కార్డినల్) జార్జ్ పెల్‌పై నమోదైన లైంగిక ఆరోపణల కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. జార్జి పెల్‌పై నమోదైన లేంగిక వేధింపుల కేసులో ఇప్పటికే కోర్టు 50 మందిని విచారించింది. వీరంతా జార్జిపెల్కు వ్యతిరేకంగానే కోర్టులో సాక్ష్యం చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్డినల్ జార్జి పెల్.. పోప్ ఫ్రాన్సిస్‌కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న 76 ఏళ్ల జార్జ్ పెల్‌పై స్థానికంగా చాలా కాలం నుంచి లైంగిక వేధింపులు, అత్యాచార ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్ కోర్టు మార్చి 5 నుంచి ఆయన విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగుతున్న విచారణలో ఇప్పటివరకూ 50 మందిని విచారించినట్లు మెజిస్ట్రేట్ బెలిండా వెల్లింగ్టన్ పేర్కొన్నారు. ఇందులో 5 మంది మినహా మిగిలిన వారంతా జార్జ్ పెల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం జరిగిన కోర్టు విచారణకు జార్జ్ పెల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై విశ్వాసముందని ఆయన చెప్పారు. ఈ కేసును ఎదుర్కోవడం కోసమే.. పోప్ ఆర్థిక సలహాదారు పదవిని వదులుకున్నానని చెప్పారు. -
నా చావుకు మంత్రే కారణం..
మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీపై ఆరోపణలు బెంగళూరు: ‘నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్‌తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా న్యాయం చేయలేదు. నా చావుకు వీరే కారణం’ అంటూ తన మరణానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు రామనగర జిల్లా మాగడి తాలూకా గవినాగమంగళ గ్రామానికి చెందిన రైతు శివణ్ణ(65). వివరాలు.. శివణ్ణ కుటుంబానికి అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతేకాదు శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఇక తన సమస్యకు పరిష్కారం లభించదని భావించిన శివణ్ణ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం తెల్లవారుఝామున శివణ్ణ మృతిచెందారు. మృతిచెందడానికి కాసేపటి ముందు శివణ్ణ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు వీడియో రికార్డ్ చేశారు. ‘నా మరణానికి మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీలు కారణం, అంతేకాదు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం.’ అని వీడియోలో రికార్డ్ చేశారు. ఇదే సందర్భంలో డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. -
రాష్ట్రానికి మీరే గర్వకారణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కామన్వెల్త్ క్రీడల్లో అయిదు రజత పతకాలను గెలుచుకున్న క్రీడాకారులను హోం మంత్రి కేజే. జార్జ్, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డిలు సత్కరించారు. కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ (కేవోఏ) గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీఎన్. ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), అశ్విని పొన్నప్ప (షటిల్ బ్యాడ్మింటన్), వీఆర్. రఘునాథ్, ఎస్వీ. సునీల్, నిఖిన్ తిమ్మయ్య (హాకీ)లు సత్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జార్జ్, క్రీడాకారుల సాధన అపూర్వమని కొనియాడారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరాశ చెందరాదని ధైర్యం చెప్పారు. కేవోఓ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలను గెలుచుకున్న వారికి నగదు బహుమతితో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని గుర్తు చేశారు. నివేశనంతో పాటు స్వర్ణ పతక విజేతలకు రూ.25 లక్షలు, రజత పతక విజేతలకు రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అక్టోబరులో నిర్వహించే బ్రహ్మాండమైన కార్యక్రమంలో ఈ బహుమతులు అందజేస్తారని తెలిపారు. -
త్రిపాఠి అవుట్.. జార్జ్ ఇన్!
లోక్ సభ ఎన్నికల కోసం నియమించిన చెన్నై పోలీసు కమిషనర్ త్రిపాఠి బుధవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కమిషనర్‌గా జార్జ్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని నగరంలో భద్రత పటిష్టం, అనుక్షణం నిఘా లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దించనున్నట్టు జార్జ్ ప్రకటించారు. సాక్షి, చెన్నై:లోక్‌సభ ఎన్నికల వేళ ఈసీ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీలు ఓ వైపు సాగితే, మరో వైపు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను ఆగమేఘాలపై మరోచోటకు ఎన్నికల కమిషన్ మార్చింది. ఆ దిశగా చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన జార్జ్‌పై ఆరోపణలు వచ్చారుు. అధికార పక్షానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే ఫిర్యాదులు మోత మోగించింది. దీంతో జార్జను తప్పించాల్సి వచ్చింది. ఆయన్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించారు. జార్జ్‌ను జైళ్ల శాఖకు పంపించారు. నెల రోజులకు పైగా త్రిపాఠి చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల నిబంధనలను ఈసీ సడలించింది. దీంతో ఎన్నికల వేళ బదిలీల వేటు, ఆగమేఘాలపై మార్పులకు గురైన అధికారులు మళ్లీ తమ తమ స్థానాల్లోకి వచ్చే పనిలో నిమగ్నమయ్యారు. బాధ్యతల స్వీకరణ: ఎన్నికల పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన త్రిపాఠి ఉదయం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో కమిషనర్ పగ్గాలను జార్జ్‌కు అప్పగించారు. పూందమల్లి హైరోడ్డులోని కమిషనరేట్‌లో ఉదయం జార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఇరువురు కరచాలనం చేసుకున్నారు. త్రిపాఠికి వీడ్కోలు పలికారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జార్జ్‌కు అదనపు, డెప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక బృందాలు: రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నామని జార్జ్ పేర్కొన్నారు. మీడియా తమ వంతుగా అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. కొన్ని కేసుల ఛేదింపుల్లో మీడియా సహకారం ఆమోఘం అని, ఇది మరింతగా విస్తృతం కావాలని కోరారు. నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటూ వస్తున్నా, కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని వివరించారు. సినీ ఫక్కీలో సాగుతోన్న నేరాలను కట్టడి చేయడం లక్ష్యంగా నిఘాను మరింత పటిష్ట వంతం చేయబోతున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి దించబోతున్నామని పేర్కొన్నారు. నగరంలోని ఆయా పోలీసు డివిజన్లలోని అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో ఈ బృందాలు ఏర్పాటు చేయనున్నాట్లు వివరించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాలను, సంఘవిద్రోహ శక్తులు, నేరగాళ్ల కదలికలను ఈ బృందాలు ఎప్పటికప్పుడు పసిగడుతూ వస్తాయని చెప్పారు. అలాగే, రైల్వే స్టేషన్లలో సమష్టి భద్రతకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆర్పీఎఫ్తో సంప్రదింపులు జరపనున్నామని, సమీక్షల అనంతరం రైల్వే స్టేషన్లలో నిఘా కట్టుదిట్టానికి సమష్టిగా నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. కొన్ని చోట్ల చాప కింద నీరులా సాగుతున్న రౌడీల వ్యవహారాలు పసిగట్టి, వారి భరతం పడతామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడుతున్న వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చేందుకు వీల్లేని రీతిలో నాన్ బెయిల్ కేసు గూండా చట్టంను అత్యధికంగా ప్రయోగించనున్నట్లు చెప్పారు. ఇక, గూండా చట్టాల మోత తప్పదని, తస్మాత్ జాగ్రత్త అంటూ నేరగాళ్లకు, అజ్ఞాతంలో ఉన్న రౌడీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. -
సైకో జయ శంకర్ చిక్కాడు
ఐదు రోజుల పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సైకో జయ శంకర్ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడో కాదు పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలోని కూడ్లు చెరువు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరు, న్యూస్‌లైన్ : పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ అలియాస్ శంకర్‌ను ఓ ఫోన్ కాల్ పట్టిచ్చింది. దీంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు-హొసూరు రోడ్డులోని కూడ్లు గేట్ సమీపంలో చెరువు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో అతనిని శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ రహస్య ప్రాంతానికి తరలించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ... ‘తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన జయ శంకర్ మీద ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో అనేక హత్యలు, లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు డ్రైవర్‌గా పని చేసే వాడు. ఈ నెల 1న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బెంగళూరు నగర, బెంగళూరు సీసీబీ, చిత్రదుర్గ, శిర, బిజాపురలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేకృబందాలు ఇతని కోసం గాలించాయి. ఇతని ఆచూకీ కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పది వేల పోస్టర్లను అతికించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో 75 వేల కరపత్రాలు ముద్రించి పంచి పెట్టారు. ఎట్టకేలకు కూడ్లు గేట్ వద్ద పట్టుబడ్డాడు’ అని వివరించారు. జయ శంకర్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు. జైలు నుంచి అతను 30 అడుగుల గోడ దూకడానికి గ్లౌజ్‌లు, దుప్పటి ఉపయోగించాడని చెప్పారు. జయశంకర్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారని అడిగినప్పుడు, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇన్ఫార్మర్ పేరు చెప్పడానికి నిరాకరించారు. ఇన్ఫార్మర్కు తాము ఒక మొబైల్ ఇచ్చామని చెప్పారు. జయ శంకర్ నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, అదే రోజు జైలులోని గార్డెన్లో ఆ తాళం చిక్కిందని వివరించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. శంకర్ పోలీసు దుస్తులలో పారిపోలేదని, నైట్ డ్రెస్‌లో తప్పించుకున్నాడని తెలిపారు. అదే డ్రెస్‌తో శుక్రవారం పట్టుబడ్డారని అన్నారు. పోలీసులకు అభినందనలు.... మంత్రి జార్జ్ బెంగళూరు పోలీసులు సమర్థంగా పని చేశారని, అందువల్లే శంకర్ చిక్కాడని హోం మంత్రి జార్జ్ తెలిపారు. శంకర్ తప్పించుకోవడానికి జైలు సిబ్బంది సహకరించారని వెలుగు చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు అందిస్తామని తెలిపారు. రూ.100 ఇచ్చి నీరు, భోజనం కావాలన్నాడు: నరేంద్ర పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో కూడ్లు చెరువు ఉంది. కూడ్లు గేట్ కూడా సమీపంలోనే ఉంది. చేపలు పట్టేవారు చెరువు పక్కన చిన్న గుడిసె వేసుకున్నారు. చేపలు తగ్గిపోవడంతో ఆరు నెలల నుంచి ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు. గుడిసెకు కనీసం తలుపులేదు. శుక్రవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న నరేంద్ర, బాబు తదితరులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న శంకర్ తాగడానికి నీళ్లు కావాలని, ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేశాడు. అక్కడికెళ్లి ఇక్కడెందుకున్నావని వారు ప్రశ్నించగా, తాను తమిళనాడుకు చెందిన డ్రైవర్‌నని, ప్రమాదం జరగడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని వచ్చానని చెప్పాడు. కాళ్లు, చేతులకు గాయాలుండడంతో వారూ నిజమనుకున్నారు. వారికి రూ.100 నోటు ఇచ్చి భోజనం తెచ్చివ్వాలని కోరాడు. అదే సమయంలో బనశంకరిలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేయాలనడంతో బాబు అతనికి మొబైల్ ఇచ్చాడు. తర్వాత బాబు భోజనం తీసుకురావడానికి వెళ్లాడు. ఐదే నిమిషాల్లో పోలీసులు వచ్చి గుడిసెలోకి చొరబడిఅతని కాళ్లు, చేతులు కట్టి వేశారని నరేంద్ర మీడియాకు చెప్పాడు. తరువాత అతను సైకో శంకర్ అని తమకు తెలిసిందన్నాడు. ఆరు జీపులలో పోలీసులు వచ్చి శంకర్‌ను తీసుకు వెళ్లారని నరేంద్ర వివరించాడు.