అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నుంచి సైతం బైడెన్ అభ్యర్ధిత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల బైడెన్ సొంత పార్టీకి చెందిన మహిళా సెనేటర్ నాన్సీ పెలోసి బైడెన్.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అన్నారు.
తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ అందుస్తున్న ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం అద్యక్షుడు జో బైడెన్‌పై పోటీపై పెదవి విరిచారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు బైడెన్ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని కోరుతూ ప్రముఖ వార్తా ప్రతిక న్యూయార్క్ టైమ్స్‌లో భావోద్వేగమైన లేఖ చేశారు.
బైడెన్‌తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న జార్జ్.. డెమొక్రాటిక్ పార్టీకి మద్దతునిచ్చే హాలీవుడ్ ఎలైట్ సభ్యులలో ఒకరు. పార్టీ కోసం ఎన్నోసార్లు నిధులు కూడా సేకరించారు. క్లూనీ తను రాసిన లేఖలో.. బైడెన్ తనకు మంచి మిత్రుడని, అతన్ని ఎంతో నమ్ముతానని చెప్పారు. గతంలో తన కోసం ఎంతో పనిచేశానని గుర్తు చేశారు.
అయితే అప్పటి బైడెన్ కు.. ఇప్పుడున్న బైడెన్ కు చాలా తేడా ఉందని రాశారు. అతను సమయానికి వ్యతిరేకంగా గెలవలేని ఒక యుద్ధంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. "నాకు చెప్పేందుకు మాటలు రావడం లేదు. కానీ మూడు వారాల క్రితం ఫండ్ రైజర్‌లో నేను కలిసిన జో బైడెన్.. ఒకప్పటి ఓ బైడెన్ వేరు. అతనిలో చాలా మార్పులు వచ్చాయి. 2010, 2020 చూసిన బైడెన్ కూడా కాదు. ఆయనలో ఎలాంటి ఉత్సాహం లేదు. బైడెన్ అంటే ఇటీవల డిబెట్‌లో చూసిన వ్యక్తినే మనం చూశాం.. ట్రంప్ తో జరిగిన చర్చలో తన ప్రదర్శన పేలవంగా ఉంది.
డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బిడెన్‌ను ఉపసంహరించుకోవాలని బహిరంగంగా పిలుపునివ్వంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇక బైడెన్ తనంటే తానే తప్పుకోవడం మంచిది." అని భావోద్వేగంగా లేఖలో రాశారు
అయితే ఎన్నికలకు నాలుగు నెలలముందు బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడుతుందనే వాదనను క్లూనీ కొట్టి పారేశారు. బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆగస్టులో జరిగే డెమొక్రాట్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ కమాలా హ్యారిస్, మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, ఇతర నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మరోవైపు జో బైడెన్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లలో చక్ షుమర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి లాంటి అగ్రనాయకులతో పాటు.. డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు సేనేటర్లు కూడా ఉన్నారు. అందుకే వారంతా బైడెన్ ని తప్పకోవాలని బహిరంగంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment