కార్డినల్‌గా కేరళ బిషప్‌ | Kerala priest Monsignor George Jacob Koovakad elevated to Cardinal by Pope Francis | Sakshi
Sakshi News home page

కార్డినల్‌గా కేరళ బిషప్‌

Published Mon, Oct 7 2024 4:43 AM | Last Updated on Mon, Oct 7 2024 4:43 AM

Kerala priest Monsignor George Jacob Koovakad elevated to Cardinal by Pope Francis

జార్జి జాకబ్‌ సహా 21 మంది ఎంపిక

తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్‌ జార్జ్‌ జాకబ్‌ కోవక్కడ్‌ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్‌ ఫ్రాన్సిస్‌ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్‌ ప్రకటించినట్టు వాటికన్‌ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్‌ సీజన్‌ మొదలయ్యే డిసెంబర్‌ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. 

జాకబ్‌ నాలుగేళ్లుగా పోప్‌ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్‌ ఆర్క్‌డయాసిస్‌కు చెందిన జాకబ్‌ వాటికన్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్‌ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్‌ 2004 జూలై 24న చర్చి ఫాదర్‌ అయ్యారు.

కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్‌ సైతం..
కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్‌ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్‌లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్‌ మైకోలా బైచోక్‌ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉక్రెయిన్‌ గ్రీకు కేథలిక్‌ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్‌ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్‌ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement