Jacob
-
కార్డినల్‌గా కేరళ బిషప్
తిరువనంతపురం: కేరళకు చెందిన 51 ఏళ్ల మత ప్రబోధకుడు మాన్సిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్ను కార్డినల్‌గా ప్రకటిస్తూ పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 21 మందిని కార్డినల్స్‌గా పోప్ ప్రకటించినట్టు వాటికన్ సిటీ ఆదివారం వెల్లడించింది. రోమ్‌లో క్రిస్మస్ సీజన్ మొదలయ్యే డిసెంబర్ 8న వీరంతా కార్డినల్స్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జాకబ్ నాలుగేళ్లుగా పోప్ అంతర్జాతీయ పర్యటనల కార్యక్రమాలను చూసుకుంటున్నారు. చంగనచెర్రీ సైరో–మలబార్ ఆర్క్డయాసిస్కు చెందిన జాకబ్ వాటికన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో వాటికన్ ‘దౌత్య’ కార్యాలయాల్లో పనిచేశారు. 1973లో తిరువనంతపురంలో జన్మించిన జాకబ్ 2004 జూలై 24న చర్చి ఫాదర్ అయ్యారు.కొత్తవారిలో 99 ఏళ్ల బిషప్ సైతం..కొత్తగా కార్డినల్స్‌గా ఎన్నికైన 21 మందిలో అత్యంత వృద్దుడు, 99 ఏళ్ల ఏంజిలో అసెర్బీ సైతం ఉన్నారు. ఈయన గతంలో వాటికన్ దౌత్యవేత్తగా పనిచేశారు. గతంలో ఈయనను కొలంబియాలో వామపక్ష గెరిల్లా దళాలు ఆరు వారాలపాటు బంధించాయి. 21 మంది కొత్త కార్డినల్స్లో అత్యంత తక్కువ వయసు వ్యక్తిగా 44 ఏళ్ల బిషప్ మైకోలా బైచోక్ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉక్రెయిన్ గ్రీకు కేథలిక్ చర్చిలో ఈయన సేవలందిస్తున్నారు. నిబంధనల ప్రకారం 120 మంది మాత్రమే కార్డినల్స్ కాగలరు. కానీ పోప్‌ఫ్రాన్సిస్ ఎక్కువ మందిని ఎంపికచేశారు. దీంతో కొత్తవారితో కలుపుకుని సంఖ్య 142కు పెరిగింది. -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్‌లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్‌తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్‌ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
జీఎం ఆవాలు.. జనానికి సవాలు
మనదేశంలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక జన్యుమార్పిడి పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకీ జన్యుమార్పిడి సాంకేతికత విస్తరిస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జేఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతోపాటు కలుపుమందును తట్టుకునేలా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టీబీటీ) హైబ్రిడ్ ఆవాల రకం డీఎంహెచ్–11కు జేఈఏసీ పచ్చజెండా ఊపింది. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయన కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ సాగులో రసాయనాలతోపాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టీబీటీ ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి’తో చెప్పిన ముఖ్యాంశాలు.. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. జన్యుమార్పిడి ఆవ రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులిచ్చే ముప్పు పొంచి ఉంది. రైతులకు ఉండే సంప్రదాయ విత్తనాల హక్కులను జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వీటిని కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కోసమే జన్యుమార్పిడి చేసి, విత్తనాలను కంపెనీల ఆస్తిగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంటోంది. అదీగాక జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరిగితే తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. –సాక్షి, సాగుబడి -
GM Mustard: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!
మన దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకి కూడా జన్యుమార్పిడి సాంకేతికత వచ్చేస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జెఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతో పాటు కలుపుమందును తట్టుకునే విధంగా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టిబిటి) హైబ్రిడ్ ఆవాల రకం డిఎంహెచ్ 11కు జెఈఏసీ పచ్చజెండా ఊపటం, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ పరిశోధనా సంస్థల ఆవరణల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభం కావటం జరిగిపోయింది. వంట నూనెల ఉత్పత్తిని దేశీయంగా పెంపొందించటం ద్వారా దిగుమతులను తగ్గించటం కోసమే బీటీ ఆవాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. జీఎం పంటలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో విచారణ కూడా ప్రారంభమైంది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయనిక కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలతో పాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన వందలాది సీడ్ సేవర్స్, సేంద్రియ రైతులతో కూడిన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టిబిటి ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పూర్వరంగంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. పురుగును తట్టుకునే జన్యువులతోపాటు, కలుపు మందును తట్టుకునే ఆవాల పంటకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆవాల ఉత్పత్తి పెంచటం కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. మీరేమనుకుంటున్నారు? జన్యుమార్పిడి సాంకేతికతను ఆహార పంటల్లో ప్రవేశపెట్టాలన్న పట్టుదలతోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జన్యుమార్పిడి ఆవ హైబ్రిడ్ పంట డిఎంహెచ్11 సాగుకు పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే ఆవ రకాలేవి? జన్యుమార్పిడి ఆవ డిఎంహెచ్11 రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల ఆవాల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల ఆవాల దిగుబడిని ఇస్తుంది. 5 నెలల పంట. నారు పోసి, నాట్లు (3“2.5 అడుగుల దూరం) వేసుకోవడానికి అనువైన రకం ఇది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే.. ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడం మాత్రమే. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ఆవాల జీవవైవిధ్యానికి మన దేశం పుట్టిల్లు. జీవవైవిధ్య కేంద్రాలైన దేశాల్లో ఆయా పంటల్లో జన్యుమార్పిడి ప్రవేశపెట్టవద్దని అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక నిర్దేశిస్తోంది. అయినా జీఎం ఆవాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. జన్యుకాలుష్యం ముప్పు, తేనెటీగల పెంపకం, సేంద్రియ తేనె ఎగుమతి రంగానికి కలిగే తీరని/ వెనక్కి తీసుకోలేని నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరసమాజం, రైతు సంఘాలు, సంస్థలు వద్దంటున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులు మంజూరు చేసే ముప్పు పొంచి ఉంది. ఏయే ఆహార పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు రాబోతున్నారంటారు..? కలుపుమందులను తట్టుకునే (హెచ్‌టీ) బీటీ పత్తి, బీటీ వంగ, బీటీ మొక్కజొన్న, బీటీ వరి తదితర జన్యుమార్పిడి పంటల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జన్యుమార్పిడి వల్ల ముప్పు ఏమిటి? తరతరాలుగా మెరుగైన విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తుకొని పంటలు పండిస్తూ, పండించిన పంట నుంచి విత్తనాలు దాచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి వ్యవసాయ సమాజాలకు, రైతులకు ఆయా సంప్రదాయ విత్తనాలపై సర్వహక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వంగడాలు జీవ–సాంస్కృతిక వారసత్వంగా సంక్రమించినవి. వీటిని ప్రైవేటు/కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కొద్దీ జన్యుమార్పిడి చేసి, కంపెనీల సొంత ఆస్థిగా విత్తనాలను మార్చే ప్రక్రియ ప్రజా వ్యతిరేకమైనది. జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరగకుండానే చూడాలి. జరిగిన తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. భూమి, నీరు, జీవవైవిధ్యం, ప్రజారోగ్యం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా జన్యుమార్పిడి పంటల దుష్పలితాలకు గురవుతాయి. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. మైసూరులో ఇటీవల జరిగిన కిసాన్ స్వరాజ్య సమ్మేళనం వెలువరించిన ‘విత్తన స్వరాజ్య ప్రకటన –2022’ రైతుల సంప్రదాయ విత్తన హక్కుల్ని కాపాడటంలో రాజీలేని ధోరణి చూపమని పాలకులకు విజ్ఞప్తి చేసింది. (క్లిక్ చేయండి: అల్సర్‌ని తగ్గించిన అరటి.. 10 పిలకల ధర 4,200) -
భారత మహిళల జట్టుకు షాక్
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఊహించని రీతిలో తొలి పరాజయం ఎదురైంది. హంగేరి జట్టుతో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 1–3 తేడాతో ఓడిపోయింది. తాజా ఓటమితో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో భారత బృందం పతకం నెగ్గే అవకాశాలు సన్నగిల్లాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 50 ఎత్తుల్లో తన్ త్రాంగ్ హోంగ్ చేతిలో ఓడిపోగా... గారా అనీటాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో; జూలియానా తెర్బెతో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అయితే మరో గేమ్‌లో తానియా సచ్దేవ్ 56 ఎత్తుల్లో గారా టికియా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు 11 పాయింట్లతో 15వ స్థానంలో ఉంది. పురుషుల జట్టు విజయం... మరోవైపు భారత పురుషుల జట్టు ఆరో విజయం నమోదు చేసింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 2.5–1.5తో గెలిచింది. విశ్వనాథన్ ఆనంద్–డేవిడ్ నవారా గేమ్ 30 ఎత్తుల్లో; విదిత్–విక్టర్ లాజ్నికా గేమ్ 66 ఎత్తుల్లో; ఆధిబన్–జిబినెక్ గేమ్ 17 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... శశికిరణ్ 36 ఎత్తుల్లో జిరీ స్టోసెక్‌ను ఓడించి భారత్‌ను గెలిపించాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 15 పాయింట్లతో అమెరికా తొలి స్థానంలో, 14 పాయింట్లతో పోలాండ్ రెండో స్థానంలో ఉన్నాయి. -
ముంబైసే ఆయా మేరా దోస్త్
సాక్షి, హైదరాబాద్: వారిద్దరు బాల్యమిత్రులు. పుట్టింది మొదలు 20 ఏళ్ల వయసు వరకు ఇరువురు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో బాల్యమిత్రుల్లో ఒకరు కుటుంబంతో సహా మకాం మార్చారు. అప్పట్లో ఫోన్ల సదుపాయం లేని కారణంగా స్నేహబంధం దూరమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరిని తిరిగి ఫేస్బుక్ దగ్గర చేసింది. సోమవారం రాత్రి ఇరువురు మిత్రులు శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇందులో ఒకరు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. మోండాలోని టకారాబస్తీలో మంత్రి పద్మారావు పుట్టి పెరిగారు. ముంబై నుంచి కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్టియన్ కుటుంబం నగరానికి వలస వచ్చింది. మోండా మార్కెట్లో స్థిరపడిన ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జాకబ్ విక్టర్. పద్మారావుగౌడ్, జాకబ్‌విక్టర్ ఇరువురు బాల్యమిత్రులు. 20 ఏళ్ల వయసులో జాకబ్ విక్టర్‌కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. నాలుగు దశాబ్దాలుగా ఇరువురు కలుసుకోలేకపోయారు. ఫేస్బుక్ చూస్తుండగా... ఎయిర్‌ఫోర్స్‌లో పదవీ విరమణ చేసిన జాకబ్ విక్టర్ కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ పరిశీలిస్తుండగా మంత్రి పద్మారావు ఫొటోలు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావుగౌడ్ తన బాల్యమిత్రుడేనని గుర్తించిన జాకబ్‌విక్టర్ అందులోని ఫోన్‌నెంబర్‌కు కాల్చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న మంత్రి పీఆర్ఓ కలకోట వెంకటేశ్ జాకబ్ ముంబై నుంచి ఫోన్ చేసిన విషయాన్ని మంత్రికి చేరవేశారు. బాల్యమిత్రుడి ఆచూకీ లభించడంతో హర్షం వ్యక్తం చేసిన పద్మారావుగౌడ్ హైదరాబాద్ రావాల్సిందిగా జాకబ్ విక్టర్‌ను ఆహ్వానించారు. స్వయంగా మంత్రి స్వాగతం... సోమవారం రాత్రి ముంబై నుంచి నగరానికి చేరుకున్న జాకబ్ విక్టర్‌కు మంత్రి పద్మారావు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. టకారాబస్తీలోని మంత్రి నివాసంలో బసచేసిన జాకబ్ విక్టర్ మంగళవారం మంత్రి పద్మారావుతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో బాల్యం నాటి ముచ్చట్లను ఇరువురు పంచుకున్నారు. -
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
చదువుపై ఆసక్తితో కళాశాలకు వెళ్లిన ఓ అంధ విద్యార్థి కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకుంది. మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన యాకోబు, నర్సమ్మ దంపతుల కుమారుడు చింటు(16) పుట్టుకతోనే అంధుడు. అయినప్పటికీ, అతడు పట్టుదలతో చ దివి పదో తరగతి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇటీవలే చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్‌లో చేరాడు. మంగళవారం కళాశాలకు వెళ్లిన చింటు తెలియక తరగతి గది గోడకు ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. తమ కుమారుడి మృతికి కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మనిషికి మనిషే బద్ధశత్రువు...మనిషే ఆప్తమిత్రుడు!
సువార్త ఏవేవో ఆశించడం అవి పొందేందుకు అడ్డదారులు తొక్కడం అనే నైజం వల్ల యాకోబు జీవితమే ఒక సమస్యల సుడిగుండంగా మారింది. జ్యేష్ఠత్వాన్ని, దాని తాలూకు దీవెనల్ని మోసంతో కబళించి తన అన్న ఏశావును బద్ధశత్రువును చేసుకున్నాడు. ఏశావు వల్ల ప్రాణభయంతో పద్దనరాముకు పారిపోయి అక్కడ మేనమామ పంచన చేరి అతని వద్ద పనికి కుదిరాడు. అతని ఇద్దరు కుమార్తెలనూ పెళ్లి చేసుకున్నాడు. అయితే కుయుక్తితో మేనమామ ఆదాయానికి గండికొట్టి ఎంతో ఆస్తిపరుడయ్యాడు కాని బావమరుదులను శత్రువులను చేసుకొని బోనస్‌గా బోలుడు అశాంతినీ మూటగట్టుకున్నాడు. అక్కడా ప్రాణభయం ఏర్పడడంతో సకుటుంబ సపరివారంతో స్వస్థలమైన కనానుకు తిరుగు ప్రయాణమయ్యాడు. కాని తన మీద పగతో రగిలిపోతున్న ఏశావు తనను తన వారినందరినీ సమూలంగా నాశనం చేస్తాడన్న భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడు. ఆ అరణ్యమార్గంలో తననాదరించేవారు లేక, సాయం చేసేవారూ కానక ఏకాకిగా మారి ఒక రాత్రి తన దేవునినాశ్రయించాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అంతకాలంగా దేవుడతన్ని చూస్తున్నాడు కానీ అతను దేవుణ్ణి చూడలేదు. అతనిలోని పట్టుదలను చూసిన దేవునికి అతనిపట్ల అద్భుతమైన ప్రణాళిక ఉంది. అబ్రహాము వంశానికి చెందిన అతను కుటుంబాన్నే తనదైన స్వంత జనాంగంగా ప్రత్యేకించి ఆ కుటుంబాన్నే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపేందుకు వాడుకోవాలన్నది దేవుని స్వర్ణసంకల్పం. ఫలితంగా యబ్బోకు రేవు వద్ద యాకోబు ఒక రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడి నన్ను దీవిస్తే తప్ప వదలనని పట్టుబడితే దేవుడది మెచ్చి, అతన్ని ఆశీర్వదించి, అతనికి ‘ఇశ్రాయేలు అనే వినూత్న నామాన్నిచ్చి అతని కుటుంబాన్నే నేటి ఇశ్రాయేలీయులను చేశాడు (ఆది 32:3-22). యాకోబుకు బాహ్యశత్రువులున్నారు కాని ఆంతర్యంలో ఆతనికతడే బద్ధశత్రువు! అదే అతని సమస్యలకు మూలహేతువు. మనిషి తనను తాను అర్థం చేసుకున్న రోజునుండే, ‘ఆశీర్వాదాల యాత్ర’ ఆరంభమవుతుంది. ఒక కారు పనితీరు తెలియాలంటే దాన్ని తయారు చేసిన కంపెనీ వారి మాన్యువల్ చదవాలి. మనకు మనం అర్థం కావాలన్నా మనకు దేవుడే సాయం చేయాలి. సమస్యల్లో ఉన్న వాడికి సాయం చేసే వారొక్కరూ ఉండరు కాని సలహాలిచ్చే వారు బోలెడుమంది ఉంటారు. ఆ అరణ్యమార్గంలో యాకోబుకు ఎవరూ సాయం చేసేవాళ్లు, సలహాలిచ్చేవారూ లేని భయంకరమైన ఒంటరితనం. కాని అదే అతనికి ఆశీర్వాదమైంది. ఎందుకంటే ఆ ఒంటరితనమే అతన్ని దేవుని పాదాలమీద పడేలా చేసింది. అందరినీ తన పాదాలతో దిగతొక్కుతూ పెకైక్కడమే అంతకాలంగా ఎరిగిన యాకోబుకు ఆ రాత్రి దేవుని పాదాలనాశ్రయించడం ఎంత ఆశీర్వాదకరమో, ఆదరణకరమో అర్థమైంది. ఏశావు అనే కనిపించే శత్రువుకన్నా, తనలోని తానే ఎంత ప్రమాదకరమో ప్రభువు పాదాలవద్దే అతనికి తెలిసింది. మనకు మనమే మిత్రులుగా ఉంటే లోకమంతా మనల్ని ప్రేమించే వాళ్లే కనిపిస్తారు. మనకు మనమే బద్ధశత్రువులమైతే లోకం నిండా శత్రువులే ఉంటారు. యబ్బోకు రేవు వద్ద దేవునితో పెనుగులాడిన అనుభవంతో యాకోబు నేర్చుకున్న ఆత్మీయ సత్యమిది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
'జేఎఫ్ఆర్ జాకబ్'కు ఘననివాళి
-
1971 యుద్ధ హీరో జాకోబ్ మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాక్ పరాజయానికి బాటలు వేసిన రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జాకోబ్(92) బుధవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను జనవరి 1న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. న్యుమోనియాతో బాధపడ్తూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 1971 యుద్ధంలో పాక్ దళాలు నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లొంగిపోవడానికి కారకులుగా జాకోబ్ ప్రసిద్ధులు. జాకోబ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘లెఫ్ట్‌నెంట్ జనరల్ జాకోబ్కు నివాళి. కీలక సమయాల్లో ఆయన అందించిన నిరుపమాన సేవలకు దేశం సదా ఆయనకు రుణపడి ఉంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.