1971 యుద్ధ హీరో జాకోబ్ మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాక్ పరాజయానికి బాటలు వేసిన రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎఫ్‌ఆర్ జాకోబ్(92) బుధవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను జనవరి 1న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. న్యుమోనియాతో బాధపడ్తూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 1971 యుద్ధంలో పాక్ దళాలు నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లొంగిపోవడానికి కారకులుగా జాకోబ్ ప్రసిద్ధులు. జాకోబ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘లెఫ్ట్‌నెంట్ జనరల్ జాకోబ్‌కు నివాళి. కీలక సమయాల్లో ఆయన అందించిన నిరుపమాన సేవలకు దేశం సదా ఆయనకు రుణపడి ఉంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.